twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరమ బోరు ( ‘జోరు’ రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5
    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    సప్తగిరి, బ్రహ్మానందం ఇద్దరూ విడివిడిగా అదీ ఏ సెకండాఫ్ లోనే వస్తూంటేనే సినిమాలు హిట్టేపోతున్నాయి..అదే ఫస్టాఫ్ లో మొదటి సీన్ నుంచీ, అదీ ఇద్దరూ ఉంటే భాక్స్ బ్రద్దలైపోదూ ...అనుకుని నమ్మి ఈ సినిమా రెడీ చేసిన్నట్లున్నారు దర్శకుడు. అంతేతప్ప ఎంత కామెడీ ప్రహసనానికైనా ఓ కథ, కథనం అంటూ ఉండాలి..లేకపోతే రెండు గంటలు సేపు డబ్బులు ఇచ్చి, తమ సమయాన్ని ఇచ్చి కళ్లు తెరకు అప్పగించే ప్రేక్షకుడుని ఒప్పించలేమనే విషయం మర్చిపోయినట్లున్నారు. ఓ ప్రక్కన టీవీల్లో జబర్దస్త్ వంటి పోగ్రామ్ లు కామెడీతో అదిరిపోతూంటే ఇంకా అరిగిపోయిన కామెడీతో, అలరించాలనుకున్న దర్శకుడు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సప్తగిరి,బ్రహ్మానందం సైతం తెరమీద మొదటినుంచీ చివరి వరకూ కనపడ్డారే కానీ ఎక్కడా నవ్వించలేపోయారు. హీరోగా సందీప్ కిషన్ సైతం ఈ సినిమాలో ఏమీ చేయటానికి లేదు... ఫలితం...మీరు ఊహించిందే.

    అమెరికానుంచి వస్తున్న అను(రాశిఖన్నా) క్యాబ్ డ్రైవర్ మోసానికి గురి అయ్యి లగేజ్ పోగొట్టుకుంటే లిప్ట్ ఇస్తాడు అటుగా వస్తున్న సందీప్(సందీప్ కిషన్). అంతేకాక ఆమెతో ప్రేమలో పడి ఓ పాట కూడా పాడుకుంటాడు. ఈ లోగా అను ..ఎమ్మల్యే సదాశివం(షాయీజీ షిండే) కూతురు అని తెలుస్తుంది. ఇంతలో ఆమెపై ఊహించని విధంగా ఎటాక్ జరుగుతుంది..దాన్నుంచి తప్పించిన సందీప్ కు ఆ ఎటాక్స్ వెనక ఉన్నది మరెవరో కాదు..ఆమె తండ్రే అని తెలుస్తుంది. అప్పుడు కూపీ లాగితే..ఆమె అసలు తండ్రి కాదని, అదే పోలికలతో ఉన్న మరొకరు అని ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఆమె ఆస్ది కోసం భారీ ఎత్తున కుట్ర జరుగుతోందని తెలుసుకున్న సందీప్ ...ఏం ఫ్లాన్ చేసి ఆమెను రక్షించాడు..అను తండ్రి ఏమయ్యాడు. ఈ కథలో నామాలు(సప్తగిరి), పెళ్లి కొడుకు అలియాస్ పి.కె(బ్రహ్మానందం) పాత్రలేమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    కన్ఫూజన్ కామెడీ అంటూ ఈ చిత్రం గురించి దర్శక,నిర్మాతలు మొదటినుంచి చెప్తూ వస్తున్నారు. అయితే వాళ్లు చెప్పినట్లు కన్ఫూజన్ అయితే పూర్తిగా ఉంది..అది స్క్రిప్టు తయారీలో..దర్శకుడు మైండ్ లో... అంతే తప్ప....కథలో పాత్రల మధ్య లేదు. ఫస్టాఫ్ ని లవ్ స్టోరీ కే పూర్తిగా వినియోగించాడే కానీ...కామెడీ కాబట్టి సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు పండటం కోసం సెటప్ చేయాలని అనుకోలేదు. దాంతో సెకండాఫ్ లో జరిగే కామెడీ కోసం అప్పటికి అప్పుడు సీన్స్ పేర్చుకుంటూ పోయారు. దాంతో చూసేటప్పుడు అప్పటికి అప్పుడు పాత్రలు ఎక్కడినుంచో ఊడిపడుతున్న ఫీలింగ్ వచ్చింది. దాంతో ఆ పాత్రల నుంచి పుట్టాల్సిన కామెడీ జనరేట్ కాలేదు.

    అంతేకాక హీరోది పూర్తి గా ప్యాసివ్ వ్యవహారం. విలన్ కు సైతం ఇదంతా హీరోనే గేమ్ ఆడుతున్నాడని సినిమా చివరి దాకా తెలియదు. విలన్ ...రెడీ,ఢీ,దూకుడు వంటి తెలుగు సినిమాలు చూడలేదనుకుంటాను. తను నమ్మే బ్రహ్మానందంని అడ్డం పెట్టి తనను ఆడుకుంటున్నారని అర్దం చేసుకోలేని పూర్ ఫెలో.

    పోనీ ఈ స్టోరీ లైన్ కొత్తదా అంటే అదీ కాదు..మొన్నీ మధ్యనే అల్లుడు శ్రీను లో చూసేసాం. అలాగే కథనం సైతం అరిగిపోయి రొట్టగా మారిన రెడీ ఫార్మెట్ లోనే లాగించారు. ఇక స్లాఫ్ స్టిక్ కామెడీ ...పండకుండా వికటించింది. ఇక ఫస్టాఫ్ లో సప్తగిరి, ఎలుగబంటి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అయితే రోత పుట్టించాయి. ఆ సీన్స్ లెంగ్త్ ఎందుకు పెట్టుకున్నారో దర్శక,హీరోలకే తెలియాలి. అలాగే హీరోయిన్స్ లో రాశిఖన్నా..ఊహలు గుస గుసలాడే చిత్రంలో గ్లామర్ తో ఆకట్టుకుంది. అదేంటో ఈ సినిమాలో ఆమెను అసలు ఎలివేట్ చేయలేదు. మిగతా ఇద్దరు హీరోయిన్స్ అయితే వారిని గుర్తు పట్టడమే కష్టమన్నట్లు ఎస్టాబ్లిష్ చేసారు. పూర్తిగా ఇది స్క్రిప్టు లోపంతో తయారైన చిత్రం మాత్రమే.

    హైలెట్...

    హైలెట్...

    సినిమాలో ఏమన్నా హెలట్ అంటే చెప్పుకోదిన మ్యాటర్ ఉందీ అంటే అది కేవలం...పాటల చిత్రీకరణలోనే. కొరియోగ్రాఫర్స్ అయినా కొద్దో గొప్పో కొత్తదనం చూపుదామని ప్రయత్నించారు.

    అదేంటో..

    అదేంటో..

    ఈ మధ్య కాలంలో సినిమాల్లో సప్తగిరి..కామెడీ విశ్వరూపం చూస్తున్నాం...లవర్స్ వంటి చిత్రాలు అతని కామెడీ వల్లే ఆడాయి అంటే అతిశయోక్తి కాదు. అలాంటిది అసలు ఈ సినిమాలో అతన్ని భరించటమే కష్టమన్నట్లు సీన్స్ తయారయ్యాయి.

    టైటిల్ లోనే...

    టైటిల్ లోనే...

    సినిమా టైటిల్ లో తప్ప సినిమాలో ఎక్కడా జోరు అనేదే కనపడదు. ఏదో స్టేజీ డ్రామా జరుగుతున్నట్లుగా క్యారెక్టర్స్ ఎక్సప్రెషన్స్, ఎట్రీలు,డైలాగులు ఉంటాయి.

    పూర్తిగా వృధా

    పూర్తిగా వృధా

    అజయ్, ధర్ట్ ఇయిర్స్ పృధ్వీ వంటి ఆర్టిస్టులను ఎందుకు పెట్టుకున్నారో దర్శకుడుకే తెలియాలి. పొటిన్షియల్ ఉన్న ఈ ఆర్టిస్టులును వారి రెగ్యులర్ స్టైల్ లో కూడా చేయించలేకపోయాడు దర్శకుడు.

    బహ్మానందం

    బహ్మానందం


    క్యారెక్టర్ కు బేస్ లేనప్పుడు బ్రహ్మానందం అయినా ఏం చెయ్యగలడు. అప్పటికీ ఆయన తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేసి,అక్కడక్కడా సఫలీకృతుడయ్యాడు.

    పెద్ద మైనస్..

    పెద్ద మైనస్..


    గుండెల్లో గోదారి చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా దర్శకుడుగా మంచి పేరు తెచ్చి పెట్టింది. మెచ్యూరిటీ ఉన్న దర్శకుడుగా కుమార్ నాగేంద్ర ఎస్టాబ్లిష్ అయ్యారు. అయితే ఆయనేనా ఈ చిత్రం ఇంత నాసిగా తీసారు అని డౌట్ వస్తుంది.

    టెక్నికల్ గా..

    టెక్నికల్ గా..

    సినిమా టెక్నికల్ గానూ పూర్ గానే ఉంది. ఏ డిపార్టమెంటూ చెప్పుకోదగ్గ రీతిలో ఫెరఫార్మ్ చేయలేదనిపిస్తుంది. ఇదంతా కెప్టెన్ అయిన దర్శకుడు సమస్యే అయ్యింటుంది అనిపిస్తుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    బ్యానర్: శ్రీ కీర్తి ఫిలింస్
    చిత్రం: ‘జోరు'
    నటీనటులు: సందీప్‌కిషన్, రాశిఖన్నా, ప్రియాబెనర్జీ, సుష్మ, బ్రహ్మానందం, సప్తగిరి, ప్రియా బెనర్జి, సుష్మారాజ్, బాలయ్య, అజయ్, షాయాజీ షిండే, సత్యం రాజేష్, కాశీ విశ్వనాధ్, హేమ, అన్నపూర్ణమ్మ తదితరులు.
    మాటలు: నిరాఖ్,
    పాటలు:వనమాలి, భీమ్స్,
    ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్,
    కెమెరా: ఎం.ఆర్.పళని కుమార్,
    సంగీతం: భీమ్స్ సిసిరోలియో,
    కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర (గుండెల్లో గోదారి ఫేమ్).
    నిర్మాతలు: అశోక్, నాగార్జున
    విడుదల తేదీ: 07-11-2014.

    ఫైనల్ గా...మిగతా జానర్ ల చిత్రాల రూపకల్పన కన్నా కామెడీని పండించటమే కష్టం. ఏ మాత్రం కామెడీ బాలెన్స్ తప్పినా భరించటం చూసేవారికి మహా కష్టం... అని ఇండస్ట్రీకు మరోసారి గుర్తు చేసిందీ చిత్రం.

    English summary
    Sundeep Kishan 's new movie Joru, released today with divide talk. Directed by Gundello Godari fame Kumar Nagendra. Sundeep Kishan and Rashi Khanna in Lead Role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X