For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  శరభ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |
  Sharabha Movie Review శరభ మూవీ రివ్యూ | Filmibeat Telugu

  Rating:
  2.0/5
  Star Cast: ఆకాశ్ కుమార్ సహదేవ్, జయప్రద, నాజర్, పునీత్ ఇస్సార్, నెపోలియన్
  Director: ఎన్ నరసింహారావు

  టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎక్కువ బజ్ క్రియేట్ అయిన చిత్రం శరభ. అలనాటి అందాల నటి జయప్రద రీ ఎంట్రీ ఇవ్వడం, భారీ ఎత్తున విజువల్ గ్రాఫిక్స్‌తో సినిమా రూపొందడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే సినిమా వాయిదాల మీద వాయిదా పడటం కూడా చర్చనీయాంశమైంది. ఆకాశ్ కుమార్ నటించి, నిర్మించిన సినిమాలో పునీత్ ఇస్సార్, నెపొలియన్ లాంటి సీనియర్ నటులు నటించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న చిత్రం నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు చేరుకొన్నదా? జయప్రద రీ ఎంట్రీ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  శరభ మూవీ కథ

  సింగాపురంలో చంద్రాక్ష (పునీత్ ఇస్సార్) అనే దుష్టుడు ఉంటాడు. 18 మంది మానవులను బలి ఇచ్చి అతీంద్రియ శక్తులను సాధించి భూప్రపంచంపై అధిపత్యం సాగించాలని ప్రత్యేక పూజలు చేస్తుంటాడు. అలా 17 పూజలు పూర్తి చేస్తాడు. ఇదిలా ఉండగా, సింగాపురం గ్రామంలో శరభ (ఆకాష్ కుమార్) తన తల్లి (జయప్రద)తో జీవిస్తుంటాడు. ఓ మోసానికి గురై తండ్రిని శరభ కోల్పోతాడు. అదే ఊరికి చెందిన దివ్యతో (మిస్టి చక్రవర్తి), ఆకాశ్ ప్రేమలో పడుతాడు. ఇలా సాగుతుంటే చంద్రాక్ష 18వ పూజ కోసం దివ్యను ఎత్తుకెళ్తాడు.

  శరభ మూవీలో ట్విస్టులు

  దివ్యను బలి ఇచ్చిన అతీంద్రియ శక్తులను సాధించాడా? శరభ కుటుంబానికి జరిగిన మోసం ఏమిటి? ఎవరి వల్ల జరిగింది? తన తల్లి పసుపు కుంకుమలను హరించిన వ్యక్తి ఎవరనే విషయాన్ని ఎలా తెలుసుకొంటాడు? చివరికి సింగాపురం గ్రామానికి పట్టిన పీడను ఎలా తొలగిస్తాడు అనే ప్రశ్నలకు సమాధానమే శరభ సినిమా.

  ఫస్టాఫ్‌ అనాలిసిస్

  పెళ్లి బస్సుపై దుష్టశక్తి దాడితో శరభ సినిమా హైఓల్టేజ్‌తో ప్రారంభవుతుంది. గ్రాఫిక్ వర్క్ పనితీరు అద్భుతంగా ఉండటంతో ఏదో గొప్ప సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ అసలు కథలోకి వెళ్లిన తర్వాత లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. పేలవమైన, మూస కథ, నాసిరకమైన సన్నివేశాల కారణంగా కథపై పట్టు సడలినట్టు కనిపిస్తుంది. కాకపోతే గ్రాఫిక్స్ వర్క్‌తో లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరిగింది. సాదాసీదాగా సాగే సినిమాలో ఓ యాక్షన్ మళ్లీ ఎపిసోడ్‌తో తొలిభాగాన్ని ముగిస్తాడు.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక రెండో భాగంలో శరభ తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పడం కూడా ఆకట్టుకోలేకపోతుంది. జయపద్ర పాత్రను కూడా సరిగి తీర్చి దిద్దకపోవడం, ఆ పాత్రలో కనిపించాల్సిన ఇంటెన్సెటీ కనిపించకపోవడం సినిమాకు ప్రతికూలంగా మారింది. జయప్రద పాత్రను చాలా నాసిరకంగా చూపించడం జీర్ణించుకోలేని అంశంగా కనిపిస్తుంది. సినిమా మొత్తంగా చూసుకొంటే చివరి 20 నిమిషాల్లో గ్రాఫిక్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. నరసింహా అవతారంలో హీరో విలన్ చంపడం సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

  దర్శకుడి ప్రతిభ

  దర్శకుడు నరసింహారావు ఆసక్తికరమైన పాయింట్‌ను బలమైన కథగా మలచడంలో తడబాటుకు గురయ్యాడని చెప్పవచ్చు. కథలో ఇంటెన్సిటీ ఉన్నా తెరపైన ఎలివేట్ కాకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. పాత్రలను ప్రభావవంతంగా తీర్చిదిద్దలేకపోవడం మరో లోపమని చెప్పవచ్చు. ఓవరాల్‌గా అన్ని రకాల వనరులు చేతిలో ఉన్నా సరిగా ఉపయోగించడంలో విఫలమయ్యాడని చెప్పవచ్చు.

  హీరో అకాశ్ టాలెంట్

  హీరో ఆకాశ్ కుమార్ శరభ సినిమాకు నిర్మాతగా కావడం విశేషం. చూడటానికి హీరోలా ఉన్నప్పటికీ.. కథను ముందుకు తీసుకెళ్లే నటనా పరిణతి కనిపించలేదు. తొలి సినిమాలోనే భారమైన పాత్రను మోసేందుకు ప్రయత్నించడమే ఓ సక్సెస్ అని చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో యాక్టింగ్ పరంగా తడబాటుకు గురయ్యాడు. నటనపరంగా ఇంకా మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది.

  హీరోయిన్‌గా మిస్త్రి చక్రవర్తి

  దివ్యగా మిస్త్రి చక్రవర్తి నటించింది. హీరోయిన్‌గా నిరూపించుకోవడానికి బలమైన పాత్రనే లభించింది. తన ప్రతిభకు మించిన పాత్రను మోయలేకపోయిందనే చెప్పవచ్చు. స్ల్పిట్ పర్సనాలిటీ సీన్లలో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. టాలీవుడ్ రేసులో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే ఇంకా నటనపరంగా నేర్చుకోవాల్సింది ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.

  జయప్రద రీఎంట్రీ

  ఇక అలనాటి అందాల తార, సీనియర్ నటి జయప్రద శరభ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమె స్థాయి తగిన పాత్ర ద్వారా రీఎంట్రీ ఇవ్వకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయంగా మారింది. ఇక స్ప్లిట్ పర్సనాలిటీ సీన్లలో ఆమె పాత్ర సీరియస్ మూడ్‌ ప్రదర్శించకపోగా అపహాస్యం పాలైంది. తల్లి పాత్రలో ఆమె పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమాను సక్సెస్ బాట పట్టించేంతగా జయప్రద పాత్ర ప్రభావం చూపించలేకపోయిందని చెప్పవచ్చు.

  నాజర్, నెపోలియన్ రోల్స్

  శరభ చిత్రంలో మిగితా పాత్రల్లో నాజర్, నెపోలియన్ తదితరులు కనిపించారు. నాజర్ కమెడియన్‌గా హాస్యాన్ని పండించే పాత్రలో కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన చేసిన కామెడీ ఆకట్టుకొన్నది. ఇక హీరో తండ్రిగా, జయప్రద భర్తగా సీనియర్ నటుడు నెపోలియన్ నటించాడు. గ్రామపెద్దగా తనదైన మార్కు నటనను ప్రదర్శించాడు. దుష్టుడిగా పునీత్ ఇస్సార్ ఆకట్టుకోలేకపోయాడు.

  స్పెషల్ ఎట్రాక్షన్‌గా సినిమాటోగ్రఫి

  శరభ సినిమాకు రమణ సల్వా అందించిన సినిమాటోగ్రఫి ప్రాణంగా నిలిచింది. హిమాలయాల్లోకి హీరో సీన్లు, సినిమా ఆరంభంలో టోర్నడో ఎఫెక్ట్ సీన్లు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ సన్నివేశాల్లో నరసింహస్వామి అవతారంలో హీరో చేసిన యాక్షన్ సీన్లు మరోస్థాయికి తీసుకెళ్లాయి.

  కోటి మ్యూజిక్

  శరభ సినిమాకు మరో అదనపు ఆకర్షణ మ్యూజిక్. కోటి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఆకట్టుకొనేలా లేవు. క్లైమాక్స్‌లో సన్నివేశాలను మ్యూజిక్ మరోస్థాయికి చేర్చింది. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ కనిపించింది.

  అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్

  బాహుబలి తర్వాత అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్‌తో వచ్చిన చిత్రంగా శరభ గురించి చెప్పుకోవచ్చు. ఎక్కువ మోతాదులో మేలురకమైన గ్రాఫిక్ వర్క్ కనిపిస్తుంది. విజువల్స్ వండర్ ఫుల్‌గా ఉంటాయి. ఆకాశ్ కుమార్ సహదేవ్ నిర్మాణ సారథ్యంలో సినిమా పొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  ఫైనల్‌గా

  దైవశక్తి, దుష్టశక్తికి మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంగా అల్లుకొన్న అతీంద్రియ శక్తుల కథతో శరభ రూపొందింది. ప్రస్తుత కాలానికి సరిపడని స్టోరీ అయినప్పటికీ బలమైన కథనం, పాత్రల లేకపోవడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకొలేకపోయింది. గ్రాఫిక్స్‌ వర్క్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచినప్పటికీ.. సినిమాను హిట్ ట్రాక్‌పై పరుగులు పెట్టించలేకపోయింది. బీ, సీ సెంటర్ల ఆదరణపైనే సినిమా అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్
  సినిమాటోగ్రఫి
  వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్
  మ్యూజిక్
  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్
  కథను సరిగా చెప్పలేకపోవడం
  నాసిరకంగా కథనం
  పాత్రల డిజైన్

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: ఆకాశ్ కుమార్ సహదేవ్, జయప్రద, నాజర్, పునీత్ ఇస్సార్, నెపోలియన్, దివ్య తదితరులు
  దర్శకత్వం: ఎన్ నరసింహారావు
  నిర్మాత: ఆకాశ్ కుమార్ సహదేవ్
  మ్యూజిక్: కోటి
  సినిమాటోగ్రఫి: రమణ సల్వా
  విజువల్ ఎఫెక్ట్స్: మెహుల్ జోషి
  రిలీజ్:2018-11-23

  English summary
  Sharabha movie is a Socio-Fantasy and Action Thriller directed by N Narasimha Rao and produced by Ashwani Kumar Sehdev while Koti scored music for this movie. Aakash Kumar and Mishti are in the main lead roles along with Jaya Prada, Napoleon, Puneet Issar, Charandeep, L B Sriram, Avinash, Tanikella Bharani are seen in supporting roles in this movie. It is an Epic Fight between Good and Evil - God and Devil.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more