For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సర్కార్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

  |
  vijay sarkar Movie Review సర్కార్‌ సినిమా రివ్యూ

  Rating:
  2.0/5
  Star Cast: విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, తులసి, రాధారవి
  Director: ఏఆర్ మురగదాస్

  దర్శకుడు ఏఆర్ మురగదాస్, సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన కత్తి, తుపాకీ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా ప్రేక్షకులను అలరించాయి. ఈ సక్సెస్ జోడి మూడో ప్రయత్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న సర్కార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ సరసన కీర్తి సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్, విజయ్ స్టార్ స్టామినా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపావళీ కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ మూటగట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  సర్కార్ మూవీ కథ

  సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీఎల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఈవోగా సేవలందిస్తుంటారు. ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సుందర్ అంటే దడ. ప్రతీ దేశంలోని ప్రత్యర్థి కంపెనీలపై దాడులు చేసే ఛంఘీజ్ ఖాన్ అనే పేరు మూటగట్టుకొంటాడు. ఇలాంటి ఇమేజ్ ఉన్న సుందర్ ఇండియాకు వస్తుంటే అందరూ గజగజలాడిపోతాడు. కానీ అతడు స్వదేశానికి ఓటు వేయడానికి వచ్చాడని తెలుసుకొని ఊరట చెందుతారు. కానీ ఓటు వేయడానికి వచ్చిన సుందర్‌కు ఓ షాక్ తగులుతుంది. అప్పటికే సుందర్ ఓటు మరోకరు వేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.

  సర్కార్ కథలో ట్విస్టులు

  తన ఓటును మరో వ్యక్తి వేసిన క్రమంలో సుందర్ ఏం చేశాడు? తన ఓటు హక్కును ఎలా సాధించుకోగలిగాడు? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడానికి సుందర్ ఏం చేశాడు. సుందర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎమ్మెల్యే కూతురైన లీలా (కీర్తీ సురేష్‌)కు సుందర్‌కు లింక్ ఏమిటీ? విదేశాల్లో ఉండే కోమలివల్లి (వరలక్ష్మీ శరత్ కుమార్) రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కోమలివల్లికి సుందర్‌కు మధ్య వైరం ఎందుకు కలిగింది? రాజకీయాల్లో సుందర్ తన లక్ష్యాన్ని ఛేదించాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సర్కార్ సినిమా కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  సర్కార్ సినిమా తొలిభాగంలో విజయ్ స్వదేశాగమనంతో కథ ఆసక్తిగా మొదలవుతుంది. ఓటు హక్కు ప్రాధాన్యతను చెప్పే అంశం ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సాగుతుంది. కానీ కథ లోతుల్లోకి వెళ్లిన కొద్ది విషయం లేదనే అంశంతో ప్రేక్షకుడిని నిరాశ అవరించడం మొదలవుతుంది. ఇంటర్వెల్‌కు ముందు రెండు పాటలు, రెండు ఫైట్లు, ఓ ఆసక్తికరమైన పాయింట్ తప్ప ఏమీ కనిపించదు.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక సెకండాఫ్‌లో రాజకీయ వాతావరణం వేడేక్కుతుందని భావించిన ప్రేక్షకుడికి సన్నివేశాల్లో, కథలో ఎలాంటి వినోదం, ఉద్వేగం కనిపించదు. ఇక సెకండాఫ్‌లో 30 నిమిషాల తర్వాత మరీ నాసిరకంగా సన్నివేశాలు పేర్చుకొంటూ పోవడంతో ట్రాక్ తప్పిందనే విషయం బోధపడుతుంది. దానికి తోడు రెహ్మాన్ సంగీతం మరీ పేలవంగా ఉండటంతో ఉండే ఆసక్తి తగ్గిపోతుంది. యువతను, ఓటర్లను చైతన్య పరిచే అంశాన్ని బలంగా చెప్పలేకపోవడం, సినిమా ఫార్మూలాకు అనుగుణంగా కథ నడవడంతో రొటీన్ సినిమాగా మారిపోయిందని చెప్పవచ్చు.

  దర్శకుడు మురుగదాస్ పనితీరు

  ప్రేక్షకుడిని ఆలోచింప జేసే అంశాలను ఎత్తుకోవడం దర్శకుడు మురుగదాస్ ప్రత్యేకత. కానీ ఇటీవల కాలంలో బలమైన పాయింట్‌ను కథను బలంగా అల్లుకొనే విషయంలో తడబాటుకు లోనవుతున్నారు. కథనం మరీ పేలవంగా కనిపిస్తుంది. సర్కార్ విషయంలోనూ దర్శకుడు ఇదే పొరపాటు చేశాడనే చెప్పాలి. ఏదో చెప్పాలనే కసి కనిపిస్తుంది కానీ.. కథ, కథనాల్లో అది కనిపించకపోవడం ప్రతికూలంగా మారుతున్నది. భారీ అంచనాలతో ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్తే మరోసారి మురగదాస్ నిరాశే మిగిల్చాడని చెప్పవచ్చు.

  విజయ్ ఫెర్ఫార్మెన్స్

  విజయ్ మాస్ ఇమేజ్‌కు తగినట్టు అల్లుకొన్న కథ ఇది. తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టు సన్నివేశాలు, తన అభిమాన అనుచరగణం కోసమే తీసిన సినిమాగా అనిపిస్తుంది. ఓటర్లను పక్కన పెడితే అభిమానులనే మెప్పించలేకపోయాడనే చెప్పవచ్చు. పాటలు చాలా నాసిరకంగా ఉండటంతో విజయ్ డ్యాన్సుల్లో పస కనిపించలేదు. నాలుగైదు సీన్లు మాత్రమే ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించే విధంగా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కెమెరా ముందు అనవసరంగా ఊగిపోవడం విసుగుపుట్టించేలా ఉంటుంది.

  కీర్తి సురేష్ గురించి

  మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించింది. హీరోకు కేవలం అంటిపెట్టుకొని బలమైన డైలాగ్ చెప్పలేని పాత్రలో ఆమె నటించారు. గ్లామర్‌కు కూడా స్కోప్ లేదు. ఆట పాటలకే పరిమితమైన కీర్తి సురేష్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. సాదాసీదాగా సపోర్టివ్ యాక్టర్‌ పాత్రలో కనిపించింది.

  వరలక్ష్మీ శరత్ కుమార్ నటన

  పందెంకోడి2 చిత్రంలో బలమైన విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించారు. తొలిభాగంలో పాత్ర తీరు తెన్నులు కాస్తా ఆసక్తికరంగా ఉన్నట్టు కనిపించినా.. సెకండాఫ్‌లో మరీ తేలిపోయింది. లాజిక్కుల్లేని కథనం, సన్నివేశాల రూపకల్పన వరలక్ష్మీ పాత్రను దెబ్బతీసింది. క్లైమాక్స్‌లో గాలి తీసేసిన బెలూన్ మాదిరిగా ఆ పాత్ర తీరు కనిపిస్తుంది.

  ముక్కుమొహం తెలియని వారే

  మిగితా పాత్రల్లో కనిపించిన వారిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నది కేవలం సీనియర్ నటి తులసి మాత్రమే. మిగితా పాత్రల్లో తమిళ సీనియర్ నటుడు రాధారవి, కమెడియన్ యోగిబాబు మినహా అంతా ముక్కుమొహం తెలియని వారే. బలమైన పాత్రలకు పేరున్న నటీనటులు లేకపోవడం, పాత్రల ఎంపిక కూడా సినిమాకు మైనస్‌గా మారింది.

  ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ మైనస్

  ఇక సర్కార్ సినిమాకు ప్రధానమైన మైనస్ పాయింట్ ఏఆర్ రెహ్మన్ సంగీతం. ఇటీవల కాలంలో ఇంత దారుణమైన మ్యూజిక్‌ను రెహ్మాన్ నుంచి వినడం గానీ చేసి ఉండరు. పాటలు చాలా నాసిరకంగా, బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ మరీ చెత్తగా ఉంది. సినిమాలో సన్నివేశాలు ఆకట్టుకోలేకపోవడానికి సంగీతం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.

  సాంకేతిక నిపుణుల పనీతీరు

  సర్కార్ సినిమాకు శ్రీకర్ ప్రసాద్ అక్కినేని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎడిటింగ్‌లో అంతగా పదును కనిపించలేదు. సెకండాఫ్‌లో శ్రీకర్ ప్రసాద్ కత్తెరకు పదును తగ్గింది. తెర వెనుక పనిచేసిన విభాగాల్లో రామ్, లక్ష్మణ్ ఫైట్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్ల కంపోజిషన్ ఆకట్టుకొనేలా ఉంది.

  నిర్మాణ విలువలు

  సర్కార్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ రూపొందించారు. సామాజిక చైతన్యం కలిగించే పాయింట్‌ను ఎంచుకోవడం అభినందనీయమే కానీ అందుకు తగిన కసరత్తు చేసినట్టు పెద్దగా కనిపించదు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన ఉన్నప్పుడు అందుకు తగిన నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టినట్టు కనిపించదు. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి.

  ఫైనల్‌గా

  దేశ పురోగతిని నిర్దేశించే ఓటు విలువ ప్రాధాన్యాన్ని చెప్పే కథాంశంతో సర్కార్ సినిమా రూపుదిద్దుకొన్నది. పాయింట్ బాగా ఉన్నప్పటికీ.. కథ, కథనాలు పేలవంగా ఉండటం సినిమాకు ప్రతికూలంగా మారింది. విజయ్ ఫ్యాన్స్‌, రాజకీయ నేపథ్యమున్న చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరించడం బట్టే తెలుగులో విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.

  బలం, బలహీనత

  ప్లస్ పాయింట్స్
  విజయ్ ఫెర్మాన్సెన్స్
  ఓ మేరకు ఫస్టాఫ్
  వరలక్ష్మీ శరత్ కుమార్

  మైనస్ పాయింట్స్
  ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్
  పాటలు చిత్రీకరణ
  ఎడిటింగ్
  కథ, కథనాలు
  తెలుగు నేటివిటికి దూరంగా

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: విజయ్, కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, తులసి, రాధారవి, యోగిబాబు, తులసి తదితరులు
  కథ, దర్శకత్వం: ఏఆర్ మురగదాస్
  సినిమాటోగ్రఫి: గిరీష్, గంగాధరన్
  మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
  ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
  స్టంట్స్: రామ్ లక్ష్మణ్
  నిర్మాత: సన్ టీవీ
  రిలీజ్ డేట్: 2018-11-06

  English summary
  Thalapathy Vijay and Keerthy Suresh starrer Sarkar is set to make a grand entry at the box office on November 6. But it looks like the political action thriller is set to break records before its release. Bhagyaraj, president of South Indian Film Writers Association, who claimed that the stories of AR Murugadoss's Sarkar and assistant director Varun Rajendran's Sengol are one and the same, has resigned from his post.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more