For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాయినివ్వని... (‘హాయి హాయిగా’ రివ్యూ)

  By Srikanya
  |

  యానిమేషన్‌ సినిమా 'కిట్టూ'తో జాతీయ అవార్డ్‌, నంది అవార్డ్‌లను స్వంతం చేసుకున్న దర్శకుడు సత్య తాజా చిత్రం 'హాయి హాయిగా' ఈ రోజు విడుదలైంది. హాస్య చిత్రంగా ప్రమేట్ అయిన ఈ చిత్రం మిస్ కాస్టింగ్ అవటంతో ప్రేక్షకులను నిరాసపరిచింది. అయితే దర్శకుడు తన యానిమేషన్ నైపుణ్యం మాత్రం ఈ చిత్రంలో మరోసారి ప్రదర్సించారు. అదొక్కటే సినిమాలో చూడదగ్గ అంశం.

  బ్యానర్: పనోరమ పెంగ్విన్ ప్రొడక్షన్స్

  నటీనటులు: సూర్యప్రతాప్, ధృవపటేల్, రఘుబాబు, రితిమాతినారి, శ్రీనివాసరెడ్డి, గిరిబాబు, సూర్య, చలపతిరావు,జోగినాయుడు,కల్పన తదితరులు

  రచన: జీవన సత్యం,

  పాటలు: వనమాలి, భాస్కరభట్ల,

  సంగీతం: జాన్‌క్రిష్ట్ఫోర్,

  నిర్మాతలు: కె.ఇ.రాజాప్రముఖ్, జయకృష్ణ,

  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్య.

  రఘుబాబు(అవతార్), సిద్దు(సూర్య ప్రతాప్)ఇద్దరికీ గత ఆరు నెలలుగా ఒకే పీడ కల వస్తూంటుంది. ఆ కలలో సిద్దు..అవతార్ ని నరికేసి దారుణంగా చంపేసినట్లు కనపడుతుంది. ఒకే కల రోజూ రిపీట్ కావటంతో సిద్దు తాను హంతకుడుని అవతానేమోనని,అవతార్ తాను చంపబడతానేమోనని, నిజజీవితంలో కల నిజమౌతుందేమోనని భయపడుతూంటారు. వారి భయానికి తగినట్లే ఇద్దరూ ఓ రోజు ఎదురెదురెదురు పడతారు. దాంతో తమ కలలో కనపడిన వాళ్ళ నిజ జీవితంలో నిజంగానే ఉండటంతో వారి భయం ఇంకా పెరిగిపోయి దానికి పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నాలు ఫలించాయా,కల నిజమైందా అనే విషయాలు తెరపై చూడాల్సిందే.

  చిత్రంలో నటీనటులు నటన కన్నా...యానిమేషన్ పాత్ర కాకి బాగా నటించిందనే చెప్పాలి. హీరో,హీరోయిన్స్ కన్నా సైడ్ కిక్స్ అయిన రఘుబాబు,శ్రీనివాస్ ఉన్నంతలో నవ్వించారు. సినిమాలో చూడదగినది ఏదైనా ఉందీ అంటే యానిమేషన్ కాకి విన్యాసాలే. దర్శకుడు ప్రతిభ కొన్ని సన్నివేశాల్లో కనపడినా,నిర్మాణ విలువలు సరిగ్గా లేకపోవటం దాన్ని మరుగున పరిచేసింది. ఎంత మంచి కథ ఉన్నా, దర్శకత్వ విలులు ఉన్నా సినిమాకు ప్రాణమైన ప్రధానపాత్రలు సరైన వారు లేకపోతే సినిమా సహనానికి పరీక్షే అని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. సినిమా హైలెట్స్ లో లొకేషన్స్ నిలుస్తాయి. చాలా సన్నివేశాల్లో బయిటకు వెళ్లనీయకుండా ఆ లొకేషన్సే కాపాడతాయి. టెక్నికల్ గా ఈ చిత్రం ఎడిటర్ సీనియర్ కావటంతో సినిమా క్లైమాక్స్ దాకా చూసే అవకాసం కలిగింది. సినిమాకి తగ్గట్లే సంగీతం కూడా నీరసంగా సాగుతూంటుంది. డైలాగులు మరో మైనస్.

  చిన్న సినిమాలను ప్రోత్సహించాలనేవారు ఈ సినిమాని చూస్తే మనస్సు మార్చుకుంటారేమో.. పబ్లిసిటీ లేకుండా... మినిమం ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ లేకుండా వచ్చిన ఈ చిత్రంపై మరింత నిర్మాతలు శ్రద్ద పెట్టి ఉండే బావుండేదనిపిస్తుంది.

  English summary
  Director B.Satya's Latest film Hai Haiga released with Divide talk. It's a comedy film with a different twist.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X