twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సత్యభామా? జండుబామా?

    By Staff
    |

    Sri Srimathi Satyabhama
    చిత్రం: శ్రీ శ్రీమతి సత్యభామ
    నటీనటులు: విజయశాంతి, రెహమన్‌, ఎమ్మెస్‌ నారయణ,
    జయప్రకాష్‌ రెడ్డి, అశోక్‌ కుమార్‌
    మాటలు: సత్యానంద్
    కథ,స్క్రీన్‌ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి

    అడవిచుక్క, వైజయంతి చిత్రాల తర్వాత విజయశాంతి పంథా మార్చి సాప్ట్‌ క్యారెక్టర్లు చేయాలనుకొని నటించిన శ్రీశ్రీమతి సత్యభామ చిత్రం ప్రేక్షకుల పాలిట నరకం లాంటిదే. సకుటుంబ సపరివార సమేత చిత్రాలు రూపొందిస్తాడని పేరు ఉన్న ఎస్వీకృష్ణారెడ్డి డైరక్ట్‌ చేసిన ఈ చిత్రం రెండున్నర గంటలపాటు తలనొప్పిని తీసుకువస్తోంది. 70వ దశకంలో వచ్చిన కథను తీసుకొని ''ఈనాటి సత్యభామా ...' అంటూ కొత్తరీళ్ళలో చుట్టిన ఈ సినిమాను విడుదల చేసేందుకే డిస్ట్రిబ్యూటర్లు జంకారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 50 లక్షలు పెట్టి నైజాం హక్కులు పొందిన డిస్ట్రిబ్యూటర్‌ సినిమాను విడుదల చేసేందుకు వెనకా ముందు ఆడి చివరికి ఒక రోజు ఆలస్యంగా విడుదల చేశారు. అదీ పరిస్థితి. ఐనా సినిమా గురించి వివరించాలంటే.. ఓకే ..చదవండి......

    విజయశాంతి, రెహమాన్‌ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ విజయశాంతి తండ్రి రంగనాథ్‌ ధనవంతుడు. రెహమన్‌ ది పేద కుటుంబం. ఎలాగూ తన కూతురిని రెహమన్‌ కు ఇచ్చి చేస్తాను కదాని రంగనాథ్‌ తన ఆస్తినంతా రెహమన్‌ పేర రాస్తాడు. మర్నాడు రెహమన్‌ తండ్రి అశోక్‌ కుమార్‌ విషమిచ్చి చంపేస్తాడు. ఆస్తినంతా దక్కించుకొని విజయశాంతిని, వాళ్ళ అమ్మను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతాడు. రెహమన్‌ ను చదువుకోసం విదేశాలకు పంపుతాడు. చదువు పూర్తి చేసుకొని వచ్చిన రెహమన్‌ విజయశాంతిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతాడు.

    తమ పెళ్ళి జరగదని భయపడుతూ రెహమన్‌ కూల్‌ డ్రింక్‌ లో విషం కలిపి విజయశాంతికి ఇచ్చి తనూ తాగుతాడు. వెంటనే వీరిని ఆస్పత్రిలో చేర్పిస్తారు. అశోక్‌ కుమార్‌ డాక్టర్‌ కు డబ్బిచ్చి తన కొడుకును బతికించమంటాడు. విజయశాంతిని మాత్రం చంపమని కోరుతాడు. విజయశాంతి చనిపోయిందని దిగులుతో రెహమన్‌ ఒంటరిగా బ్రతుకుతుంటాడు సో అశోక్‌ కుమార్‌ అతన్ని మళ్ళీ విదేశాలకు పంపిస్తాడు. అక్కడ విజయశాంతి లాంటి ఓ అమ్మాయి కనిపిస్తుంది.

    ఆమెను కలిసి ఊళ్ళో ఉన్న తన మరదలు సత్య గురించి చెబుతాడు.ఆమె రెహమన్‌ ఎవరో తెలియదు అంటుంది. వీరిద్దరూ కలిసి వాళ్ళ ఊరికి వస్తారు. ఈమెను చూసి అశోక్‌ కుమార్‌ షాక్‌ తింటాడు. తను చనిపోలేదని సత్య నేనేని ఆమె అతనికి చెప్పుతుంది. కానీ రెహమన్‌ కు మాత్రం చెప్పదు. చివరికి అశోక్‌ కుమార్‌ ఆటలు కట్టించి పెళ్ళి చేసుకోవడంతో విజయశాంతి శ్రీశ్రీమతి సత్యభామ అవుతుంది.

    పట్టు పరికిణీ, వడ్డాణం తొడిగి, వాలుజడ ఊపుతూ పదహారేళ్ళ అమ్మాయిలా కనిపించేందుకు విజయశాంతి ప్రయత్నం చేయడం మూర్ఖత్వం. నలభై ఏళ్ళ విజయశాంతి వయసును దాచుకునేందుకు ప్రయత్నించినా దాగుతుందా? ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం గురించి చెప్పడం శుద్దదండగ. మ్యూజిక్‌ డైరక్టర్‌ గా కూడా రాణించలేదు. రెండు దశాబ్దాల అనుభవమున్న సత్యానంద్‌ కొత్తగా ఆ రంగంలోకి అడుగు పెట్టిన వాడిలాగా మాటలు రాయడం విచిత్రం. ఒక్క డైలాగ్‌ లో కూడా పంచ్‌ లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X