»   » సీదేసింది (సీమ టపాకాయ రివ్యూ)

సీదేసింది (సీమ టపాకాయ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu-జోశ్యుల సూర్య ప్రకాష్
సంస్థ: వెల్ఫేర్‌ క్రియేషన్స్‌
నటీనటులు: అల్లరి నరేష్‌, పూర్ణ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, అలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్‌, జయప్రకాష్‌ రెడ్డి, గీతాసింగ్‌ తదితరులు.
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
నిర్మాత: మళ్ల విజయ్‌ప్రసాద్‌
దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి

'కామిడి సినిమాలన్నిటిలో అల్లరి నరేష్ హీరో ఎలా అవడో...అల్లరి నరేష్ హీరోగా చేసే సినిమాలు అన్ని కామిడీగా అవ్వవు' అనే అద్బుతమైన సత్యాన్నితెలుగు ప్రేక్షకులకు తెలపటానికి తీసినట్లున్న ఈ చిత్రం ఓపినింగ్స్ వరకూ మంచి క్రేజ్ తెచ్చుకోగలిగింది. పాయింటుగా వినటానకి బాగానే అనిపించే ఈ చిత్రంలో సీమ ప్యాక్షన్ సంభంధం లేకుండా దూరిపోయి కథను కకావికలు చేసిపారేసింది. దాంతో ప్రేక్షకులు కూడా బయిట ఎండల నుంచి తప్పించుకునేందుకు మార్గంగానే భావిస్తున్నారు తప్ప సినిమాను పెద్దగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనపడటంలేదు.
అయితే మరీ ఆత్మహత్యలు చేసుకోవాలని తలంపు తెచ్చే సినిమాలు కన్నా ఇది బెటర్ అని అనిపించి ఓకే చేయిస్తుంది.

కృష్ణ (నరేష్‌) పెద్ద కోటీశ్వరుడు (సాయాజీషిండే) గారాల కొడుకు. అతని తండ్రికి కామన్ గానే కనీసం పది వేల కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయిని కోడలిగా తమ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే కృష్ణ తొలి చూపులోనే సత్య (పూర్ణ) తో ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనక పడగా..పడగా అతనికో భయంకర నిజం తెలుస్తుంది. అది...సత్యకు ధనవంతులంటే అస్సలు పడదు. కోటిశ్వరులంతా డబ్బు ని పేదలకు పంచి పెట్టాలని, పేదలు కోసం పాటు పడాలని ఆమెకు తోచిన లాజిక్ లతో చెప్తూ తిరుగుతూంటుంది. దాంతో తాను కోటీశ్వరుడుని అని తెలిస్తే ఏ సమస్య వస్తుందో అని ఆమె మనస్సు గెలవటానికి ఓ ఎత్తు వేస్తాడు. కృష్ణ తన పేరు పేద కృష్ణ అని అబద్దమాడి ..ఆమెతో పరిచయం పెంచుకొంటాడు.పేదవాడికే తన మనస్సు నివ్వాలని డిసైడ్ అయ్యిన ఆమె వెంటనే కృష్ణకు తన మనస్సుని ఇచ్చేస్తుంది. ఇలా మనస్సుల మార్చుకునే కార్యక్రమం అయ్యాక దండలు మార్చుకునే కార్యక్రమం ఉంది కాబట్టి ఆమె నీ కుటుంబాన్ని పరిచయం చేయి అని అంటుంది. తప్పని సరి పరిస్ధితుల్లో కృష్ణ తన రిచ్ ఫ్యామిలీని కూటికి కూడా గతిలేని పేద కుటుంబంగా ఆమెకు పరిచయం చేయాలని నిర్ణయించుకుని తన వాళ్ళను బ్రతిమాలి..పేదవాళ్ళుగా నటింపచేయటానకి ఒప్పిస్తాడు. వారంతా నాటకమాడి ఆమెని పెళ్ళికి ఒప్పించి ఓకే అనుకున్న సమయంలో ఈ సారి సత్య ఫ్యామిలీ గురించి మరో ఊహించని నిజం రివిలవుతుంది. ఇంతకీ ఏమిటా నిజం..దాంతో కథ ఏమి మలుపు తిరిగిందనేది మిగతా కథ.

''ఆద్యంతం నవ్వులు పంచే చిత్రమిది. నరేష్‌ హావభావాలు, అతని మాట తీరు కితకితలు పెట్టిస్తాయి. అంతులేనంత సంపద ఉండి కూడా... ఏమీ లేనట్టు ప్రవర్తించడంలో ఓ గమ్మత్తు ఉంటుంది. అదే మా సినిమాలో చూపిస్తున్నాం అంటూ ఊదర కొట్టిన సినిమాలో నిజానికి ఆ పాయింట్ మీద చేసిన ప్లే కు సంభందించిన సీన్స్ కొత్తగానూ ఏమీలేవు.అలాగే పెద్దగా పేలనూ లేదు. అలాగే ఫస్టాఫ్ లో ఈ తరహా పేద,దనిక ప్లే అయిపోవటంతో సెకండాఫ్ కోసం ఫ్యాక్షన్ నేపధ్యాన్ని ఎన్నుకుని కథను సీమలోకి పంపారు. దాంతో కథ కొత్త యాంగిల్ తీసుకుందనుకున్నారు కానీ అనుకున్న పాయింట్ కి సంభందం లేకుండా పోతోందని భావించకలేకపోయారు. అలా స్క్రిప్టు తన ఇష్టం వచ్చిన మలుపులు తిరుగుతూ పోవటంతో స్టోరీ లైన్ లో స్పష్టత పోయి చూస్తున్న ప్రేక్షకుడుకి తాను రెండు వేరు వేరు అల్లరి నరేష్ సినిమాలు చూస్తున్నామా అన్న ఫీలింగ్ ఏర్పడింది. అంతేగాక ఫ్యాక్షన్ ని సీరియస్ గా చూపెడుతూ...కామిడీ నేరేషన్ లో ఒప్పించాలని చూసారు. అలా చేయటంతో చివర్లో ఆ ఫ్యాక్షన్ నాయకులు మారటం, కథకు సంభందం లేని ఎమేషన్స్ ,ఉపదేశాలు వచ్చి చేరాయి. దాంతో ఎంత కామిడీ డైలాగులు, పేరడీ సీన్స్ పెట్టినా అప్పటికప్పుడు నవ్వించగలిగాయే తప్ప సినిమాకు పెద్దగా ఉపయోగపడి కథలో కలవలేకపోయాయి.టెక్నికల్ చూస్తే అన్ని విబాగాలు రెగ్యులర్ అల్లరి నరేష్ సినిమాకు చేసినట్లుగానే ఏదీ సీరియస్ గా పనిచేయలేదని అర్దమవుతుంది.ఇక నరేష్ నటన విషయానికి వస్తే ఏ డైలాగుకు ఏ రకమైన ఎక్సప్రెషన్ ఇస్తాడు అని ప్రేక్షకుడు ఊహించి చెప్పేయగలుగుతున్నాడు. ఎందుకంటే ఏ సినిమాలో చూసినా అవే ఎక్సప్రెషన్స్. హీరోయిన్ విషయానికి వస్తే ఆమెలో అసిన్ పోలికలు ఉన్నాయి. అవి ఆమెకు ప్లస్ అయ్యే అవకాశం కనపడుతోంది. మిగతా సీనియర్ ఆర్టిస్టులు తమ పరిధిమేరకు సినిమాను మోసుకుంటూ వెళ్ళిపోయారు. పాటల్లో 'ఆకాశంలో ఒక తార' (సింహాసనం సినిమాలోది) రీమిక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇవివి సత్యనారాయణ తరహాలో ప్లాన్ చేసిన క్లైమాక్స్ సాంగ్ కూడా బావుంది. ఖలేజా,సింహా ప్యారడీలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మానందం ఎపిసోడ్ ఫరవాలేదనిపిస్తుంది.

ఫైనల్ గా ధియోటర్ కే వెళ్ళి చూడక్కర్లేదు టీవి లో చూసినా పర్వాలేదనిపించే ఈ చిత్రాన్ని ఏదో ఒక సినిమా చూసెయ్యాలి అని ఫిక్సై ధియోటర్ కు వెళ్ళటానకి మంచి ఆఫ్షన్. అసబ్యత,శృంగారం,కామిడీ ఏదీ పెద్దగా లేని ఈ చిత్రం ఫ్యామిలీలు వేసవిలో చూడడానికి ఆఫ్షన్ గా పెట్టుకోవటానకి ఒక్కసారి ఆలోచించటం బెస్ట్.

English summary
Like all Allari Naresh films, Seema Tapakai is also make audience laugh. G. Nageswara Reddy succeeded up to some extent in making this film a ‘laugh riot’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu