For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్తగానే ఉంది కానీ... ('కో అంటే కోటి' రివ్యూ)

  By Srikanya
  |

  -సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  2.0/5
  తను హీరోగా ఉన్నాడంటే... రెగ్యులర్ సినిమాల్లా కాకుండా ఏదో ఒక విభిన్నత ఉంటుందని ప్రేక్షకులు ఆశించేలా తనదైన శైలిలో కథలు ఎన్నుకుంటూ శర్వానంద్ ముందుకెళ్తున్నాడు. అదే ఒరవడి కంటిన్యూ చేస్తూ ఈ సారి తనే నిర్మాతగా మారి తెలుగులో అరుదైపోయిన... హీస్ట్ (Heist)జనర్ లో ఓ చిత్రం చేసాడు. అయితే చాలా సినిమాల్లాగానే ఫస్టాఫ్ బాగుండి.. సెకండాఫ్ లెక్కకుమించిన ట్విస్ట్ లతో, డబుల్ క్రాసింగ్ లతో థ్రిల్లర్ చూస్తున్న అనుభూతిని చంపేసింది. కానీ సినిమా ఫలితం ఎలా ఉన్నా దర్శకుడు కష్టం మాత్రం ప్రతి ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. ఆవకాయ బిర్యానీతో పరిచయమైన అనీష్ కురువిల్లా ఈ చిత్రంలో లవ్ స్టోరీని మాత్రం చాలా బాగా తీసి పండించాడు. అదొక్కటే పూర్తి సినిమాగా ఉన్నా బావుండేది అనిపించింది.

  బ్యానర్: శర్వా ఆర్ట్స్
  నటీనటులు: శర్వానంద్, శ్రీహరి, ప్రియా ఆనంద్, త్రాగుబోతు రమేష్, పృధ్వీ, వినయ్ వర్మ, ప్రభాకర్ తదితరులు.
  ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
  సంగీతం: శక్తికాంత్ కార్తీక్,
  ఛాయాగ్రహణం: ఎరుకుళ్ళ రాకేష్, నవీన్ యాదవ్
  నిర్మాత: మైనేని వసుంధరాదేవి,
  దర్శకత్వం: అనీష్ యోహాన్ కురువిల్లా.
  విడుదల తేదీ: డిసెంబర్ 28, 2012

  జీవన ప్రస్దానంలో దొంగగా మారిన వంశీ(శర్వానంద్) అనే అనాధ కథ ఇది. జైలుకు వెళ్లి వెళ్లి విసుగు వచ్చిన వంశీ... పేరు, ఊరు మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నా అతని గతం అతన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఏదో ఒక సవాల్ విసురుతూనే ఉంటుంది. అలా ఓ రోజు మాయా మాస్టర్ (శ్రీహరి)అనే ఓ సీనియర్ దొంగ అతని జీవితంలోకి ప్రవేశిస్తాడు. మాయా మాస్టర్ ఓ పెద్ద దొంగతనానికి ప్లాన్ చేస్తాడు. ఎంత ఎత్తైన ఎత్తులు అయినా ఎక్కగలిగే నైపుణ్యం ఉన్న వంశీని తన టీమ్ లోకి తీసుకోవాలనుకుంటాడు. అయితే మళ్లీ దొంగగా మారటం మొదట ఒప్పుకోని వంశీ... తర్వాత మాయా మాస్టర్...పోలీసులుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని బెదిరించటంతో ఓకే అంటాడు. మరో ప్రక్క వంశీ కి పర్శనల్ లైఫ్ లో సత్య(ప్రియా ఆనంద్)తో లవ్ స్టోరీ ఉంటుంది. ఆమెకు తను దొంగ అని తెలియటంతో బ్రేక్ అప్ అయ్యి ఉంటాడు. తిరిగి ఆమెను ఎలా కలుసుకున్నాడు. ఆ దొంగతనం ఎలా జరిగింది....అంతా సవ్యంగానే జరిగిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  నాకెవరూ చెప్పలేదు..బతుడం ఎలానో..! బతికే దారే లేనప్పుడే.. మంచో.. చెడో..ఎలానో బతికేయడమే కావాలి.. వంటి డైలాగుతో హీరో పాత్రను పరిచయం చేస్తూ కథకు డెప్త్ తీసుకువచ్చే ప్రయత్నం చేసిన దర్శకుడు,ఫస్టాఫ్ బాగా చేసినా సెకండాఫ్ కి వచ్చేసరికి తడబడిపోయాడు. నిజానికి... హీస్ట్ సినిమాలను చూసే ప్రేక్షకుడు దృష్టి .. కథలో ప్రధాన పాత్రలు దొంగతనం ఎలా చేస్తారు...జరిగేటప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి...ఎలా తప్పించుకున్నారు వంటి విషయాలపైనే ఉంటుంది. అలాంటిది ఈ సినిమాలో దొంగతనం ఎపిసోడ్ చాలా చిన్నది చేసేసారు. అక్కడ ఉత్కంఠత కలిగించలేకపోయారు. అలాగే సెకండాఫ్ ప్రారంభమైన కొద్ది సేపటికే..కథలో కీలకమైన రెండు పాత్రలను చంపేయటంతో కథ ఒక్కసారిగా సీరియస్ మోడ్ లోకి వెళ్లి డ్రాప్ అవటం మొదలైంది. పోనీ ఆ సీరియస్ నెస్ ని అయినా కంటిన్యూ చేసారా అంటే...దాన్ని వదిలేసి... హీరో ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి లవ్ స్టోరీతో కనెక్టు చేయటం మొదలెట్టారు. కథలో ప్రధాన పాత్రలు మంచి టెన్షన్ గా ఉన్న సమంయంలో వేరే ట్రాక్ లోకి వెళితే ఆ ట్రాక్ ఎంత గొప్పగా ఉన్నా...టెన్షన్ ఎలిమెంట్ మీదే చూసేవారి దృష్టి ఉంటుంది. అది మర్చిపోయినట్లున్నారు. దానికి తోడు ప్లాష్ బ్లాక్ లో ప్లాష్ బ్యాక్ లు చూపి...కన్ఫూజ్ అయ్యి..చూసే వారిని కన్ఫూజ్ చేసేసారు. ఒకానొక టైమ్ లో కథ ప్లాష్ బ్యాక్ లో జరుగుతోందా...ఆఫ్టర్ ప్లాష్ బ్యాక్ జరుగుతోందా అర్దం కాకుండా పోయింది.
  అలాగే ఫలానా వాడు మెయిన్ విలన్ అని చెప్పకుండా నలుగురైదుగురు విలన్స్ ని చూపటంతో అసలు ఎవరు విలనో...కొసరు విలన్ ఎవరో అర్దం కాదు. రెగ్యులర్ కథ కాదు కాబట్టి స్క్రిప్టు పై మరింత శ్రద్ద పెడితే బాగుండేది.

  ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ దర్శకుడు మంచి లవ్ స్టోరీ తీస్తే మాత్రం సూపర్ గా ఉంటుందని, లవ్ ఎపిసోడ్ చూడగానే అనిపిస్తుంది. అలాగే శర్వానంద్ కూడా చాలా బాలన్సెడ్ గా చేసాడు. ఇక శ్రీహరి అయితే చాలా బాగా చేసాడు..లేదు దర్శకుడు అంత బాగా చేయించుకున్నాడు. కెమెరా వర్క్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ .. ప్రేక్షకుడుకి కన్పూజన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుని ప్లాష్ బ్యాక్స్ అమరిస్తే బాగుండేది. సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. ప్రియా ఆనంద్ క్యూట్ గా ఉంది.. గజనీలో అసిన్ ని గుర్తు చేసింది. ఆమె తన డ్రామా ట్రూప్ తో చేసే కామెడీ సీన్స్ కూడా బాగా పండాయి. డైలాగులు కూడా న్యాచురల్ గా బాగున్నాయి. హీరోతో పాటు దొంగతనం టీమ్ లో చేసే మరో ఇద్దరు (కొత్తవాళ్లు) బాగా చేసారు. తాగుబోతు రమేష్ ఉన్నది కొద్ది సేపే కానీ బానే నవ్వించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శర్వానంద్ ఇదే బ్యానర్ పై ఇలాంటి కొత్త తరహా చిత్రాలు మరిన్ని చేస్తే బాగుంటుంది.

  ఫైనల్ గా కొత్త గా ట్రై చేసిన ఈ చిత్రం హీరో,హీరోయిన్ లవ్ సీన్స్ కోసం చూడొచ్చు. అంతేగాని Heist సినిమా చూడబోతున్నాం అని ఫిక్సై వెళితే అనుకున్నంత థ్రిల్లింగ్ దొరక్క నిరాసకలుగుతుంది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఏదో కొత్తగా ప్రయత్నించాలనే తాపత్రయంతో సొంత డబ్బు పెట్టి మరీ సినిమా తీసిన శర్వానంద్ ని మాత్రం అభినందిచాలి.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Sharwanand and Priya Anand -starrer Ko ante Koti is releasing today (December 28) with divide talk. This hero is doing his first ever action and commercial entertainer 'Ko ante Koti' directed by Anish Yohan Kuruvilla and produced by Maineni Vasundhara Devi on the banner of Sarva Arts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X