For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్లోగా...హృదయాలను స్పృశించేలా... ('మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5
  ఫీల్ గుడ్ సినిమాలు మనకు అప్పడప్పుడూ వస్తూంటాయి కానీ రెగ్యులర్ గా రావు. అయితే శర్వానంద్ మాత్రం అలాంటి చిత్రాలుకు స్వాగతం పలుకుతూనే ఉన్నారు. రన్ రాజా రన్ వంటి కమర్షియల్ హిట్ చిత్రం తర్వాత చేసిన ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులకు బాగుందనిపించేలా...స్లోగా...ఫీల్ తో సా........గింది. ఓ అందమైన ప్రేమ కధగా చిత్రాన్ని తీర్చి దిద్దాలనే దర్శకుడి తాపత్రయం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఓ వర్గానికి మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తే...మరికొందరకి ఒక్కసారి చూడటమే కష్టమిపిస్తుంది. ఫస్టాఫ్ రన్ బాగుందనిపించినా సెకండాఫ్ కు వచ్చేసరికి అది మరింత స్లో అయ్యిపోయింది. అక్కడక్కడా సీన్స్ చూస్తూంటే ఏదో మళయాళ చిత్రం చూసినట్లు అనిపించినా సీన్స్ లోని కంటంట్ తో దాన్ని అధిగమిస్తాడు. ఇవన్నీ ప్రక్కన పెడితే నిత్యామీనన్ అభిమానులకు ఇది పండుగ చేసుకునే సినిమానే. ఈ సినిమాలో తన ప్రతిభను మరోసారి సినిమాకు ప్లస్ అయ్యేలా చేసింది. మంచి విజువల్స్ కోసం, చక్కటి డైలాగ్స్ కోసం...కాస్త స్లో అయినా ఫరవాలేదు...మన పాత ప్రేమ కథలను గుర్తు చేసుకుందామనుకునే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రన్నర్... రాజారాం(శర్వానంద్) జీవితాశయం నేషనల్ లెవిల్లో గోల్డ్ మెడల్. ఆ సాధన చేస్తూ ఖాళీ సమయంలో ... తన కాలేజీలో చదివే ముస్లిం అమ్మాయి నజీర(నిత్యామీనన్) ని ప్రేమిస్తాడు. మతాలు వేరైనా మనస్సులు కలిసాయని ఇద్దరూ ప్రేమని కంటిన్యూ చేస్తారు...అంతేకాక ఆమె తన ముఖం చూపకుండా అతని లక్ష్యానికి అన్ని విధాలా సాయబడి అతని ఆశయం నెరవేరేలా చేస్తుంది. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయంలో అనుకోని పరిస్ధితుల్లో విడిపోతారు. విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఈ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? తర్వాత ఏం జరిగింది. అసలు వీరు విడిపోయే పరిస్ధితులు ఏమి వచ్చాయి ..ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ

  ఈ చిత్రం దర్శకుడు ఎక్కడ మనకు నచ్చుతాడంటే.... కమర్షియల్, మాస్ అంటూ రెగ్యులర్ పోకడలకు పోకుండా తాను నమ్మి రాసుకున్న స్క్రిప్టుని నిజాయితీగా తెరకు ఎక్కించిన విధానం చూస్తే ముచ్చట వేస్తుంది. హిందూ, ముస్లీ కథలు మనకు బొంబాయి సినిమా రోజుల నుంచి మనకు తెరపై చూస్తూనే ఉన్నా... మన జీవితంలోనో లేక తెలిసి ఉన్నవారి జీవితంలోనో జరిగినట్లు ఉండేలా కథనం రాసుకున్నారు. ముఖ్యంగా విధి విలన్ గా నడిచే ఇలాంటి స్క్రిప్టులకు స్క్రీన్ ప్లే, సీన్స్ ప్రాణం. దానిపై మరింత కసరత్తు చేసి ఉంటే పెద్ద విజయం సాధించేది అనిపిస్తుంది. ఈ దర్శకుడు కష్టానికి శర్వానంద్, నిత్యామీనన్ పెయిర్ సాయిపడింది. నిత్యామీనన్ చాలా చోట్ల కళ్ళ తోటే హావ భావాలు పలికించే ప్రయత్నం చేసి తన లోని నటిని మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అయితే లెంగ్తే భారం అనిపిస్తుంది. మలుపులు గట్రా లేని ఈ సినిమా రెండు గంటలు దాటి చూడాలంటే కష్టమనిపిస్తుంది. ఇది దర్శకుడు గమనించి ఉంటే బావుండేది.

  Sharwanand’s ‘Malli Malli Idi Rani Roju’ review

  సినిమాకు మరో ప్లస్... డైలాగులు...అర్దవంతంగా రాస్తూ ఆలోచింప చేసేలా చేసారు. ‘జేబులో రూపాయి లేకపోతే అమ్మాయిని ట్రే చేయవచ్చు కానీ, డబ్బు లేకుండా లక్ష్యాన్ని ప్రేమించకూడదురా, కంటికి...మనస్సుకు కామన్ సెన్స్ ఉండదు..వాటితో తిరిగితే చెడిపోతాం, పాటకి మనస్సు ఉంటుంది కానీ మతం ఉండదు, ఓడించాలి అనుకునే వాడు ఎప్పుడూ వెనకే ఉంటాడు, గెలుపే లక్ష్యంగా సాగేవాడు ముందుంటాడు, బిడ్డ ఆకలి తీరాకే అమ్మకి ఆకలి మొదవుతుంది' వంటివి బాగున్నాయి.

  టెక్నికల్ గా ఈ సినిమాని మంచి స్దాయిలో నిలబెట్టారు కెమెరామెన్. చక్కటి విజువల్స్ తో చాలా సీన్స్ ని ఫీల్ మిస్సవకుండా చూపటంలో సక్సెస్ అయ్యారు. పాటలు కూడా విజువల్స్ కు తగినట్లు భావోద్వేగ భరితంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓ పెద్ద హీరో సినిమాకు ఉన్నట్లు ఖర్చు పెట్టినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడి సీరియస్ నెస్, సినిమాపై ప్రేమ, ఏదో చుట్టేయాలని కాకుండా తీర్చి దిద్దటం బాగున్నాయి.

  ఎన్ని చెప్పుకున్నా కామెడీ లేకపోవటం, కథనం చాలా స్లోగా ఉండటం, తెలిసిన కథే అనిపించటం తో ఓ వర్గానికి మాత్రమే ఎక్కే అవకాసం ఉంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయ్యింది అనుకునే వారు ఈ సినిమాని చూస్తే ఆ లోటు పూడుతుంది.

  బ్యానర్: సి.సి.మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌

  నటీనటులు :శర్వానంద్, నిత్యా మీనన్, నాజర్‌, తనికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్‌, తేజస్వి తదితరులు

  సంగీతం: గోపీసుందర్‌,

  కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.యస్‌.,

  మాటలు: సాయిమాధవ్‌ బుర్రా,

  ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం క్రాంతి మాధవ్

  నిర్మాత: కె వల్లభ

  సమర్పణ : కె.యస్‌.రామారావు

  విడుదల తేదీ: 06,ఫిబ్రవరి 2015

  English summary
  Sharwanand is now coming up with ‘Malli Malli Idi Rani Roju’, a romantic entertainer that also stars Nitya Menen released today with average talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X