»   » సాహసం చేయరా ఢింబకా... (‘శివాయ్’ మూవీ రివ్యూ)

సాహసం చేయరా ఢింబకా... (‘శివాయ్’ మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ దర్వకుడిగా, నిర్మాతగా, హీరోగా చేసిన హిందీ మూవీ 'శివాయ్'. సినిమా ఎక్కువ శాతం హిమాయల్లో జరుగడం, పోస్టర్లు కాస్త డిఫరెంటుగా ఉండటంతో ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలే ఉన్నాయి.

సినిమా విడుదల ముందు కొన్ని వివాదాలు, విమర్శలు. ఈ సినిమా రోజే కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన మరో హిందీ మూవీ 'యే దిల్ హై ముష్కిల్' రిలీజ్ అవుతున్న నేపథ్యంలో శివాయ్ మూవీపై నెగెటివ్ ప్రచారం చేయడానికి కరణ్ జోహార్ లక్షలు ఖర్చుపెట్టాడనే ప్రచారం జరిగింది.

రిలీజ్ కు ఒక రోజు ముందు(అక్టోబర్ 27) ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్.... 'శివాయ్' అస్సలు చూడొద్దని, ఈ సినిమాలో పర్వాతాలను ఎక్కడం తప్ప ఏమీ చూపించలేదని, సినిమా పెద్ద ప్లాపవుతుందంటూ విమర్శలు చేసారు. మరి ఈ విమర్శలను దాటుకుని శివాయ్ మూవీకి బాక్సాఫీసు వద్ద నిలబడే సత్తా ఉందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే...

కథ విషయానికొస్తే...

శివాయ్‌(అజయ్‌ దేవగణ్‌) ఒక మౌంటెనీర్(పర్వాతారోహకుడు). అందరితో సరదాగా ఉండే మనిషి. బలవంతుడే అయినా ఎవరి జోలికి వెళ్లే రకంకాదు. సామసాలంటే ఇష్టపడే శివాయ్ హిమాలయ పర్వతాలను అధిరోహించే పనిలో ఉంటాడు.

అప్పటి నుండి కూతురే ప్రాణంగా

అప్పటి నుండి కూతురే ప్రాణంగా

హిమాలయ పర్వతారోణలో ఉన్న శివాయ్ కి బల్గేరియా యువతి ఓల్గా(ఎరికా కార్‌) తారస పడుతుంది, ఆను ప్రమాదం నుండి రక్షిస్తాడు. సన్నిహితులవుతారు, ఈ క్రమంలో శారీరకంగా కలుస్తారు. దీంతో ఓల్గా గర్భం దాల్చుతుంది. పిల్లలు, అతడితో కలిసి జీవించడం ఇష్టం లేని ఓల్గా ఓ పాపకు జన్మనిచ్చి అనంతరం బల్గేరియా వెళ్లిపోతుంది. అప్పట్నుంచి కూతురు(అబిగేల్‌ ఏమ్స్‌) ప్రాణంగా జీవిస్తుంటాడు శివాయ్‌.

ఓల్గాను వెతికేందుకు బల్గేరియా

ఓల్గాను వెతికేందుకు బల్గేరియా

శివాయ్ కూతురు పెద్దయిన తర్వాత అమ్మకావాలని కోరడంతో ఓల్గాను వెతికేందుకు కూతురుతో కలిసి బల్గేరియా వెళతాడు శివాయ్. అయితే అక్కడ పాపను కొందరు చేస్తారు. తన కూతురును శివాయ్ ఎలా రక్షించుకున్నాడు?... శివాయ్ పోస్టర్లలో ప్రముఖంగా ఫోకస్ చేసిన సాయేషా సైగల్ కు, ఈ శివాయ్‌కి సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

సినిమా మొత్తం అజయ్ దేవగన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ న్యూ లుక్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన అజయ్ ఈ సినిమాలోనూ ఆకట్టుకున్నాడు. పోలండ్ నటి ఎరికా కార్...తన పాత్ర పరంగా ఓకే. సాయేషా సైగల్ పాత్ర చాలా చిన్నదే అయినా కీలకమైన పాత్ర. ఆమె కనిపించేది తక్కువ సమయమే అయినా ఆకట్టకుంది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

ఈ సినిమాకు ఆసీమ్ బజాబ్ సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా ఆయన సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. మంచు పర్వతాల అందాలను అద్భుతంగా చూపెట్టారు. బల్గేరియా, పోలండ్,
ఉత్తరాఖండ్‌ల్లోని ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. తనే నిర్మాత, దర్శకుడు, హీరో కావడంతో నిర్మాణ విలువల పరంగా అజయ్ దేవగన్ ఎక్కడా రాజీ పడలేదు. గ్రాఫిక్స్ కూడా బావున్నాయి. ఈ సినిమాకు సందీప్ శ్రీవాత్సవ, రాబిన్ బట్ కథ అందించారు... కథ పెద్దగా ఏమీ లేదు. కథ పరంగా చూస్తే సినిమాకు ఇది మైనస్సే.

దర్శకత్వం

దర్శకత్వం

ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన అజయ్ దేవగన్.....మంచి పనితీరు కనబర్చాడు. కథలో బలం లేక పోయినా సినిమా బోర్‌ కొట్టకుండా స్క్రీన్‌ప్లేతో హ్యాండిల్ చేసాడు. అయితే సినిమా నేరేషన్ కాస్త స్లోగా ఉండటం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోక పోవచ్చు. యాక్షన్ పార్టు మొతాదు కూడా కాస్త ఎక్కువగానే ఉంది.

చివరగా...

చివరగా...

శివాయ్ మూవీ..... ఒక యాక్షన్, అడ్వంచరస్ ఫిల్మ్. సాధారణ కమర్షియల్ ఎంటర్టెన్మెంట్ అంశాలను ఆశించి వెళితే నిరాశ తప్పదు. సాహసాలు, యాక్షన్ లాంటి సినిమాలు ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది.

English summary
Watch Shivaay only if you are a sucker for action scenes and don't mind spending huge bucks to witness a scene in the film where a random girl describes Ajay's character as 'hot and sexy' to Erika!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X