»   » ప్రేత(త్మ) కళ ఉంది కానీ...(‘కళావతి’ రివ్యూ)

ప్రేత(త్మ) కళ ఉంది కానీ...(‘కళావతి’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

తక్కువ బడ్జెట్ లో స్టార్ డమ్ తగ్గిన హీరోయిన్స్ ని తీసుకుని యావరేజ్ హీరోతో లాగించేగల ఫార్ములానే హర్రర్ కామెడీ. చూసేవాళ్లు ఈ కథ ఇలాగే జరుగుతుందని తెలిసినా మరోసారి నవ్వుకుని, ఆ భయం, ధ్రిల్ అనుభవించేసి వద్దామనే ధియోటర్స్ దగ్గర క్యూ కట్టడం ప్లస్ అవుతూంటుంది. దాంతో తమిళంలో వస్తున్న హర్రర్ కామెడీలు సైతం అదే రోజున ఇక్కడ బాగా తెలిసున్న ఫేస్ లను పెట్టుకుని రిలీజ్ చేసి ఓపినింగ్స్ పట్టేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు అదే స్కీమ్ లో వచ్చిన మరో హర్రర్ కామెడీ ఏ స్ధాయిలో అలరించిందో చూద్దాం.

ఊరి జమీందార్ (రాధారవి) తమ గ్రామంలో అమ్మవారికి కుంభాభిషేకం ప్లాన్ చేసి ఎన్నాళ్లగానో ఉంటున్న అమ్మవారి విగ్రహాన్ని తీసి ప్రక్కన పెడతారు. దాంతో ఊరిని కాపాడుతున్న అమ్మవారు అడ్డు తొలగగానే ప్రేతాత్మ ఒకటి ఆ ఊళ్లోకి ప్రవేశించి..జమీందార్ గారి ఇంట్లో కి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ జమీందారునే చంపటానికి ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆయన కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పుడు సిటీలో ఎంజాయ్ చేస్తున్న ఆయన కొడుకు మురళి(సిద్దార్) ఊళ్లోకి దిగుతాడు. అతనితో పాటు గర్ల్ ఫ్రెండ్ అనిత(త్రిష) కూడా ఆ భవంతికి వస్తుంది.


అప్పటినుంచీ జమిందారి భవంతిలో ఎన్నో విచిత్రమైన ఎక్సపీరియన్స్ ఎదురౌతాయి మురళికి. అంతేకాదు ఒక వ్యక్తి మర్డర్ కూడా అవుతాడు. దాంతో ఆ మర్డర్ కేసు మురళిపై పడుతుంది. అప్పుడు రంగంలోకి దిగుతాడు అనిత అన్నయ్య...వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అయిన రవి (సుందర్ .సి).అతను వచ్చి అసలు ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని సీసి కెమెరాలు పెడతాడు. వాటిలో కళావతి (హన్సిక) కనిపిస్తుంది. అంతా షాక్.


Siddardha's Kalavathi movie review

ఎందుకంటే కళావతి చనిపోయి చాలా కాలం అయ్యింది. ఈలోగా కళ ఆత్మ...సిద్దార్ధని, త్రిషను కూడా చంపటానికి ప్రయత్నిస్తుంది... ఇంతకీ కళ ఎవరు...ఆమె ఎందుకు చనిపోయింది..కుంభాభిషేకం జరిపారా అనేది మిగతా సినిమా . మురళి ప్రాణాలు దక్కాయా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


చంద్రకళ హిట్ కావటంతో దీనికి సీక్వెల్ ప్లాన్ చేసి వదిలాడు డైరక్టర్. నిజానికి కథ పరంగా సీక్వెల్ అనేది కాకపోయినా అదే దర్శకుడు, హన్సిక ఉండటం, జానర్ అదే కావటంతో సీక్వెల్ గా ప్రచారం చేసి లబ్ది పొందాలనుకుంటున్నారు నిర్మాత.


ఫార్ములాని నమ్మి దర్శకుడు కథ తయారు చేసి, కథనం కూడా అలాగే రాసుకుని తెరకెక్కించారు దర్శకుడు. అయితే దర్శకుడుకు ఉన్న ప్లస్ పాయింట్ అయిన కామెడీ అనేది సీన్స్ కు బాగా ప్లస్ అయ్యింది. చంద్రకళ సినిమా ఫెరఫెక్ట్ గా ప్యాక్ చేసిన కమర్షియల్ హర్రర్ ధ్రిల్లర్ అయితే ఇది..చాలా ఊహకు అందే సినిమా ఇది.


ఫస్టాఫ్ బాగనే సాగినా సెకండాఫ్ ప్రెడిక్టుబుల్ గా నడిచి దెబ్బ కొడుతుంది. అయితే కొన్ని ఎపిసోడ్స్ తో కామెడీ బాగా పండటంతో సెకండాఫ్ పెద్ద బోర్ అనిపించదు. ముఖ్యంగా కోవై సరళ, సూరి మధ్య వచ్చే కామెడీ బాగా రిలీఫ్ ఇస్తుంది.


ఇది సిద్దార్ద సినిమా అని పబ్లిసిటీ చేస్తున్నా వాస్తవానికి ఈ కథలో ఆయన కనపడే సీన్స్ తక్కువే. హీరోగా నిజానికి కథను డ్రైవ్ చేస్తూ...కథలో వచ్చే సమస్యను సాల్వ్ చేసే భాధ్యత మాత్రం సుందర్ .సి తీసుకున్నాడు. అంటే దాదాపు అతని పాత్ర చంద్రముఖిలో..రజనీ టైప్ వంటిదన్నమాట. దాంతో సిద్దార్ద కథ అని ఊహించి వెళ్తే మాత్రం దెబ్బ తింటారు.


డబ్బింగ్ సినిమా అయినా కళావతి..స్టార్ కాస్ట్ అంతా తెలిసిన వారు ఎక్కువగా ఉండటంతో స్టైయిట్ సినిమా అనిపిస్తుంది. హర్రర్ కథ కావటంతో పెద్దగా నేటివిటీ సమస్య కూడా అనిపించదు. దాంతో ఈ సినిమా సాధారణ ప్రేక్షకుడుని కూడా ఈ విభాగంలో ఇప్రెస్ చేస్తుంది.


టెక్నికల్ గా ఓకే అనిపించే ఈ చిత్రం కెమెరా పరంగా మంచి మార్కులు వేయించుకుంటుంది. సినిమాలో బీచ్ సాంగ్, టెంపుల్ సాంగ్ బాగున్నాయి. డైలాగులు నీట్ గా కామెడీ తో సాగాయి. వీటికి తోడు 103 అడుగుల అమ్మవారి విగ్రహం ..కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నిరాశపరుస్తుంది.


ఫైనల్ గా.. ఈ సినిమా నిరాశపరచదు. అలాగని అద్బుతం అనిపించదు. ఫెరఫెక్ట్ టైం పాస్ హర్రర్ చిత్రం ఇది అని చెప్పాలి.


నటీనటులు : సిద్ధార్థ్‌, త్రిష, హన్సిక, పూనమ్‌ బజ్వా, వైభవ్‌ రెడ్డి, సుందర్‌ సి, రాధారవి, రాజ్‌కపూర్‌ తదితరులు.
ఎడిటింగ్: శ్రీకాంత్‌
సంగీతం : హిప్‌ఆప్‌ తమీజా
కెమెరా :సెంథిల్‌ కుమార్‌
నిర్మాణం : గుడ్‌ ఫ్రెండ్స్‌ గ్రూప్‌
రచన- దర్శకత్వం: సుందర్‌.సి
విడుదల తేదీ : 29-01-2016

English summary
Sundar C. came up with the sequel to Chandrakala film, Kalavathi starring Siddharth, Trisha and Hansika released today with ok talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X