twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వేకావాలి(ఓహ్ మై ప్రెండ్ రివ్యూ)

    By జోశ్యుల సూర్య ప్రకాష్
    |

    సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
    నటీనటులు:సిద్ధార్థ్‌,శ్రుతి హాసన్‌, హన్సిక, నవదీప్‌, తనికెళ్ల భరణి, రఘుబాబు, అలీ, లక్ష్మీ రామకృష్ణన్‌, వినయప్రసాద్‌ తదితరులు.
    పాటలు:సీతారామశాస్త్రి,కృష్ణచైతన్య
    ఛాయాగ్రహణం:విజయ్ కె. చక్రవర్తి
    డాన్స్: రాజు సుందరం,దినేశ్,రఘు,సుచిత్ర
    కళ: ఎస్.రవీందర్
    కథ, స్క్రీన్‌ప్లే,మాటలు,దర్శకత్వం: వేణు శ్రీరామ్
    లైన్ ప్రొడ్యూసర్:అశోక్
    నిర్మాత: దిల్‌ రాజు

    కథలు ఎక్కడనుంచో ఊడిపడవు..నిజ జీవితంలోంచి వస్తాయని చాలామంది అంటూంటారు.అది నిజమో కాదో కానీ చాలా సినిమా కథలు మాత్రం సినిమాల నుంచే పుడతాయని చాలా సార్లు రుజువైన సినీ సత్యం.సూపర్ హిట్ 'నువ్వే కావాలి'సినిమాని టీవీల్లో చూసినప్పుడు క్లైమాక్స్ మార్చి ఇప్పటి యంగ్ జనరేషన్ కి తగినట్లు మారిస్తే ఎలా ఉంటుందనే ఐడియా దర్శకుడుకి వచ్చినట్లుంది.వెంటనే అమలుపరిచి తీసినట్లున్నఈ చిత్రం యూత్ ని,మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసారు.అయితే కథలో
    లో సంఘర్షణ తగ్గి సీన్స్ ప్లాట్ గా వెళ్లటం,ఎంటర్టైన్మెంట్ బాగా తక్కువుగా ఉండటం,స్లోగా నడవటం వంటివి ఉండటంతో సినిమా సగటు ప్రేక్షకుడుని నిరాశపరిచిందనే చెప్పాలి.


    ఒక అబ్బాయి ఒక అమ్మాయి జీవితాంతం స్నేహుతులగా ఉండగలా అనే పాయింట్ ని బేస్ చేసుకుని వచ్చిన ఈ చిత్రంలో గిటారిస్టు చందు (సిద్ధార్థ్‌),డాన్సర్ సిరి (శ్రుతి హాసన్‌)చిననాటి ప్రెండ్స్.వయస్సు వచ్చినా వీరు కలిసి తిరగటం,చనువుగా ఉండటం చూసి ఎప్పటిలాగే వీళ్లిద్దరూ ప్రేమికులేమో అని వీళ్ల తల్లి తండ్రులతో సహా ప్రపంచం మొత్తం ఆపార్దం చేసుకుంటుంది .ప్రపంచంతో మనకేమి పని అనకున్న వీళ్లు విడివిడిగా వేరే వేరే వ్యక్తులతో(రీతు (హన్సిక)తో చందు,ఉదయ్‌ (నవదీప్‌)తో సిరి) ప్రేమలో పడతారు.అయితే వీళ్ళని ప్రేమించి వాళ్లిద్దరు కూడా సదరు ఆ ప్రపంచంలోని వ్యక్తులే కాబట్టి...చందు,సిరిల స్నేహానుభంధం చూసి ఈ సారి రీతు,ఉదయ్ లు అపార్దం చేసుకుంటారు.అంతేగాక మీ స్నేహ బంధం విడిపోతేనే మన వివాహాలు జరుగుతాయని ఖచ్చితంగా చెప్పేస్తారు.అటువంటి సమయంలో క్లోజ్ ప్రెండ్స్ అయిన చందు,సిరిలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.


    నువ్వే కావాలి,వసంతం,ఇద్దరు మిత్రులు వంటి ఇలాంటి కథలు ఎన్నో తెలుగు ప్రేక్షకుడు చూసేసి ఉన్నాడు.వారికి ఈ కథ కొత్తేమీ కాదు.అలాగే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే..హీరో,హీరోయిన్స్,వారి స్నేహాన్ని, వారు ప్రేమించే మరో రెండు పాత్రలను,వారి మధ్య ప్రేమ బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసి వారిని సమస్యల్లోకి తోలేసే సరికే సినిమా ఇంటర్వెల్ తో సహా అన్ని దాటేసుకుని ప్రీ క్లైమాక్స్ కి చేరువైంది.దాంతో కథలో పాత్రల మధ్య సంఘర్షణకు సమయం లేకుండా పోయింది.అలాగే ఈ కథ హీరో ఓరియెంటెడ్ కథ కాదు.హీరో,హీరోయిన్స్ ఇద్దరి కథ.అయితే అది పట్టించుకోకుండా హీరో వైపు నుంచి కథ చెప్పే ప్రయత్నం చేసారు.అతను గిటారిస్టు అవటానికి చేసే ప్రయత్నాలు,అతని తండ్రి దాన్ని ఒప్పుకోకపోవటం,అతను కాంపిటేషన్ లో పాల్గొని విజయం సాధించటం వంటి ఎలిమెంట్స్ కు ఎక్కువ సమయం కేటాయించారు.అస్సలు కథలోని కీలకాంశమైన ప్రధాన పాత్రల స్నేహాన్ని వార్ని ప్రేమించిన పార్టనర్స్ ఒప్పుకోకపోతే ఏం చేయాలి...ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్న దాన్ని ఒక్క సీన్ తో తీసి ప్రక్కన పడేసారు.అంటే సమస్యలోకి కథ ప్రవేశించగానే దానికి పరిష్కారం చెప్పకుండా కప్పదాటులా చేసి ముగించేసారు.అలాగే తండ్రితో హీరో తమది పవిత్రమైన స్నేహం అని ఎమోషన్ గా చెప్పి ఒప్పించగలుగుతాడే కానీ,అస్సలు ఒప్పుకోవాల్సిన తమ పార్టనర్స్ ని ఒప్పించే ప్రయత్నం చేయకపోవటం కూడా వెలితిగా అనిపిస్తుంది.వీటిన్నట్టికి తోడు కథలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ లేకుండా పోయింది.ఆ లోటు తీర్చటానికి అలీ పాత్రను కథకు సంభందం లేకుండా ఇరికించి తింగరి కామెడీతో నవ్వించే ప్రయత్నం చేసారు.

    ఇక హైలెట్స్ సినిమాలో లేవా అంటే నటన రాదేమో అనుకున్న శృతిహాసన్ చేత చాలా బాగా నటింపచేసాడు దర్సకుడు.ఆమె తెలంగాణా యాసలో ..చంపుతా బిడ్డా అనటం బావుంటుంది.ఇక డైలాగులు కూడా సందేశాలు చెప్పినప్పుడు తప్ప చాలా చోట్ల న్యాచురల్ గా ఉండి ప్లో లో కలిసిపోయి ఆకట్టుకుంటాయి.తణికెళ్ల భరిణి పాత్ర ఆడువారి మాటలకు అర్దాలు వేరులే చిత్రంలో కోట క్యారెక్టర్ ని గుర్తు చేసినా సగటు తండ్రిగా జీవించాడనే చెప్పాలి.హన్సిక మాత్రం బాగా ఒళ్లు చేసింది.దానికి తగ్గట్లుగానే కెమెరాని ఆమె అందాలమీదే ప్రత్యేకంగా కాన్సర్టేట్ చేసారు.సిద్దార్ధ ఎప్పటిలాగే బాగా చేసాడు.కానీ హన్సిక చేయాల్సిన డైటింగ్ అతను చేస్తున్నట్లున్నాడు...బాగా చిక్కిపోయి చిత్రంగా తయారయ్యాడు.ఇక కెమెరా,ఎడిటింగ్,నిర్మాణ విలువలు వంక పెట్టలేని దిల్ రాజు సినిమాల స్ధాయిలోనే ఉన్నాయి.పాటలు మాత్రం అనుకున్నంతగా కిక్ ఇవ్వలేకపోయాయి.ఎందుకంటే ఇలాంటి సినిమాలకు సంగీతమే ప్రాణం కాబట్టి అది పెద్ద వెలితే.ఉన్నంతలో చైతన్య కాలేజి పాట మాత్రం యూత్ కి పట్టేటట్లు ఉంది.


    పైనల్ గా ఈ సినిమా టార్గెట్ అయిన కాలేజ్ యూత్,మల్టిప్లెక్స్ ప్రేక్షకులు ఎలా దీనిని రిసీవ్ చేసుకుంటారనే విషయం మీద విజయం ఆధారపడిన చిత్రం ఇది.అసభ్యత,హింస లేవు కాబట్టి ఫ్యామిలీలు కూడా వెళ్లై ధైర్యం చేయవచ్చు.తమకూ ఈ కథలోలాంటి చిననాటి ప్రెండ్ ఉంటే వాళ్ల ని తీసుకుని వెళ్లితే ఇంకా బెస్ట్.ఎక్కడన్నా బోర్ కొడితే చిన్నప్పుడు కబుర్లు నెమరేసుకుంటూఎంజాయ్ చేయొచ్చు.

    English summary
    Oh My friend is a simple love story and also a story of friendship. The director has succeeded in portraying this in an effective manner in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X