twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    ------ సూర్య ప్రకాష్ జోశ్యుల

    ఫ్లాపులతో సతమతమవుతున్న సిద్దార్ద... హిట్ కోసం ఇప్పటి కామెడీ ట్రెండ్ ని పట్టుకునే ప్రయత్నం 'జబర్దస్త్' తో చేసాడు... 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' తో సక్సెస్ అయ్యాడు. తమిళంలో వరస విజయాలు సాథిస్తున్న సుందర్.సి (ఖుష్బు భర్త) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియోటర్ లో నాన్ స్టాఫ్ నవ్వులే పూయించింది. సిద్దార్ధ రెగ్యులర్ స్టైల్స్ ని ప్రక్కన పెట్టి పూర్తి లైటర్ వీన్ లో చేసిన ఈ చిత్రం ఫస్టాఫ్ సోసో గా ఉన్నా సెకండాఫ్ పరుగెత్తి...కంటిన్యూ గ్యాగ్స్ తో ఫన్ చేసి,టిక్కెట్ డబ్బులు గిట్టుబాటయ్యేలా చేసింది. సినిమా చూసిన ప్రేక్షకుడుకే కాదు... సిద్దార్ద కి వరస ఫ్లాఫ్ ల నుంచి రిలీఫ్ ఇచ్చింది. అలాగే బ్రహ్మానందమే ప్రస్తుత తెలుగు సినిమాకు యు.ఎస్ పి అని ప్రూవ్ చేసింది.

    సాఫ్ట్ వేర్ ఎంప్లాయి కుమార్ (సిద్దార్ద)కి చిన్నప్పటినుంచి ప్రేమ అంటే విముఖత..అయితే తను పనిచేసే కంపెనీలో కొత్త ఉద్యోగినిగా వచ్చిన సంజన(హన్సిక)ను చూసాక తొలి ప్రేమ చిగురిస్తుంది. అయితే ఆమెని ఎప్రోచ్ అవటానికి భయపడుతూ...సలహాల కోసం ప్రేమ్ జీ(బ్రహ్మానందం)ని ఆశ్రయిస్తాడు. అక్కడ నుంచి ప్రేమ్ జీ ఇచ్చే సలహాలతో ఆమె ప్రేమను పొందే ప్రయత్నం చేస్తాడు. అంతా సెట్ రైట్ అవుతోంది అనుకునే సిట్యువేషన్ లో ...ఊహించని విధంగా విధంగా. ....అతని ప్రేమ కథలోకి విలన్ లా....జార్జి(గణేష్ వెంకట్రామన్) ప్రవేసించి...కుమార్ ని ఓవర్ టేక్ చేసి, ఆమెను ఇంప్రెస్ చేస్తాడు..అప్పుడు కుమార్ ఏం చేసాడు...ఆమె ప్రేమను ఎలా పొందాడు...అనేది మిగతా కథ.

    క్లాసిక్ నేరేషన్ లో ఏ ప్లాష్ బ్యాక్ లేకుండా చక్కగా నేరేట్ చేసిన ఈ చిత్రంలో ఫస్టాప్, సెకండాఫ్ విభజన సరిగ్గా జరగలేదనిపిస్తుంది. బ్రహ్మానందం పాత్ర ట్విస్ట్ మీద ఇంటర్వెల్ ఇస్తే బాగా పండేది. అలా కాకపోవటంతో కొంత లాగిన ఫీలింగ్ వచ్చింది. అయితే సెంకండాఫ్ లో జోక్స్ బాగా పేలటంతో వర్కవుట్ అయ్యింది. గణేష్ వెంకట్రామన్ పాత్ర కేవలం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైపులో వాడుకున్నారు తప్ప..అతనికి కథలో పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు. వేణుమాధవ్ వంటి సీనియర్ కమిడియన్ ని అసలు వాడుకోకుండా ఒక సీన్ కే పరిమితం చేసి,ప్యాడింగ్ ఆర్టిస్ట్ ని చేసారు.

    అలాగే బ్రహ్మానందం లేకపోతే ఈ సినిమా లేదు. అతని సెకండ్ హీరో కాకుండా అసలు హీరోకు ఉన్నంత సీన్ ఇచ్చి నడిపించారు. అయితే బ్రహ్మి కూడా దాన్ని భారం అని పీలయ్యేలా కాకుండా లాక్కెళ్లాడు. సిద్దార్ధ ..కథకు తగ్గట్లు ఎక్సప్రెషన్స్ బాగానే మార్చాడు కానీ హన్సిక మాత్రం కేవలం అందాల బొమ్మలాగే బిహేవ్ చేసింది తప్ప పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. సాంకేతికంగా పెద్ద ఉన్నతంగా లేకపోయినా కామెడీ సినిమా కాబట్టి కొట్టుకుపోయింది.

     నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    చెప్పుకోవటానికి పెద్ద కథ,ట్విస్ట్ లు లేని ఈ చిత్రం పూర్తిగా దర్శకుడు ట్రీట్ మెంట్ మీదే ఆధారపడి చేసారు...సింగిల్ లైన్ మీద అల్లిన ఈ కథలో...సీన్స్ పండటమే హైలెట్ అయ్యింది.

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    ఒక్క ఫైట్ కూడా లేని ఈ సినిమాలో బ్రహ్మానందం చేసే కామెడీ,ముఖ్యంగా...సలహా కోసం ఎటిఎం కార్డ్ లాక్కుని డబ్బులు లాక్కునే సీన్స్ బాగున్నాయి.

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    ఫస్టాఫ్ లో లవ్ గురుగా బ్రహ్మానందం...చెప్పే సలహాలు,వాటిని సిద్దార్ద ఆచరించి దెబ్బ తినే తీరు నవ్వించింది..కానీ కథ పెద్దగా కదలలేదు. ఇంటర్వెల్ సరైన ప్లేస్ లో రాలేదు.

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    హీరో ఇమేజ్ ని బట్టి కాకుండా ఓ కామెడీ సినిమా అని దర్శకుడు ఫిక్స్ అయ్యి డీల్ చేయబట్టే సినిమా నవ్వించింది.

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    ఈ సినిమాతో అయినా సిద్దార్ధ...తన టైప్ కేన్సర్ కథలకు ఫుల్ స్టాఫ్ పెట్టి...ఇలాంటి కామెడీలతో నవ్విస్తే బాగుంటుంది.

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    దర్శకుడు సీనియర్ కావటంతో అనుభవంతో కూడిన డైరక్షన్ తో.. పంచ్ లు కరెక్టు గా పేలాయి... చిన్న పంచ్ కూడా పెద్ద రిజల్ట్ ఇచ్చింది. డైలాగులు కూడా బాగా పేలాయి.

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    హన్సిక మళ్లీ పూర్తిగా బొద్దుగా తయారైంది. తమిళం వాళ్లకు ఆమె బొద్దు వస్తుందేమో కానీ మనకు కష్టమే...

    నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    కెమెరా వర్క్ అద్బుతంగా లేకపోయినా ఓకే. ఎడిటింగ్ మాత్రం ..సినిమాని మరింత ట్రిమ్ చేస్తే లాగ్ లు తగ్గి...మరింత బాగా తయారవుతుంది. సంగీతం మాత్రం సినిమాకు మైనస్. డాన్స్ లు కూడా అంతంత మాత్రమే.

     నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    హీరో,హీరోయిన్స్ మద్య రొమాన్స్ సీన్స్ పెద్దగా లేకపోయినా....ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాలతో నిలబెట్టేసారు.

     నవ్వులతో ఎవ్రిథింగ్... ( 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌'  రివ్యూ)

    బ్యానర్ :శ్రీ లక్ష్మీగణపతి పిక్చర్స్
    నటీనటలు: సిద్దార్ధ, హన్సిక, బ్రహ్మానందం,సుధ, వేణుమాధవ్‌, గౌతంరాజు, గణేష్‌ వెంకటరామన్‌ తదితరులు
    ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్‌,
    సంగీతం: సత్య,
    పాటలు: వనమాలి.
    కళ: గురురాజ్‌,
    రచన: వెలిగొండ శ్రీనివాస్‌.
    నిర్మాతలు : బి.సుబ్రహ్మణ్యం, ఎన్.సురేష్‌
    విడుదల తేదీ: జూన్ 14,2013

    ఫైనల్ గా ఈ చిత్రం వీకెండ్ లో ఫ్యామిలీస్ తో వెళ్లి కాస్సేపు నవ్వుకోవటానికి పనికొస్తుంది...సిద్దార్ధ గత చిత్రాల్లా నిరాసపరచదు. అలాగే బ్రహ్మానందం అభిమానులు కూడా ఈ సినిమాలో ఆయన సెకండ్ హీరో కాబట్టి...కాగితాలు,పూలు వంటివి పట్టుకెళ్లి థియోటర్ లో హంగామా చేయవచ్చు.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Siddarth is back at his familiar genre ‘love stories’. This Friday he is came up with hilarious love story ‘Something Something’. Popular Tamil director Sundar C directed this romantic comedy. Bubbly beauty Hansika is paired opposite lover boy Siddarth. Comedy Brahma Brahmi is appearing in an important role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X