»   »  సోది ఫర్ సేల్ ('మన్మథన్ ఫర్ సేల్' రివ్యూ)

సోది ఫర్ సేల్ ('మన్మథన్ ఫర్ సేల్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
కొద్దిగా మసాలా ఉండి, కాస్తంత తెలిసున్న మొహాలు ఉంటే ఆ సినిమా ఎలా ఉన్నా, ఎప్పటిదైనా డబ్బింగ్ చేసి జనాలు మీదకు విసిరేయటం మన డబ్బింగ్ నిర్మాతలకు అలవాటు. కాకపోతే ప్రేక్షకులు కూడా తెలివి మీరారు అనే సంగతి వారు గుర్తించాల్సిన సమయం వచ్చేసింది.

ఎంత సుబ్రమణ్యం ఫర్ సేల్ ని గుర్తు చేసే టైటిల్ పెట్టినా, మన్మధ అంటూ శింబు సూపర్ హిట్ చిత్రం గుర్తు చేసినా, అసలు దీని ఒరిజనల్ సినిమా ఏంటి, దాని రిజల్ట్ ఏమిటి అని ఒకటికి నాలుగు సార్లు నెట్ లో చెక్ చేసి మరీ ధియోటర్ కు వెళ్తున్నారు.

కాబట్టి ఇలాంటి పాతకాలం టైటిల్ తో మాయ చేద్దాం అనే డబ్బింగ్ ఐడియాలు వదిలేస్తే ఆ ఖర్చులైనా మిగులుతాయి. శాటిలైట్ తో వాటిని గిట్టుబాటు చేసుకుంటాం అంటారా.. అయితే అక్కడే డైరక్ట్ గా రిలీజ్ చేసుకోవటం మేలు.

యానిమేటర్ అర్జున్ (శింబు) లండన్‌లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా బండి లాగిస్తూంటాడు. అంతేకాకుండా పనిలోపనిగా ఆ దగ్గరలో ఉండే నిషా (వరలక్ష్మి శరత్‌కుమార్) తో ప్రేమలో పడతాడు. లండన్ లో ప్రెస్టీజియస్ డాన్స్ కాంపిటేషన్ లో గెలవటం ఆమె జీవితాశయం. అయితే మన అర్జున్ కు ఇలాంటివి అంటే గిట్టదు. అయితే ఒకరితో మరొకరు డీప్ గా ప్రేమలో పడిపోవటంతో ఓ ఎగ్రిమెంట్ రాసుకుని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలతో వాళ్లు విడిపోయే సిట్యువేషన్ వస్తుంది. ఏమిటా సంఘటనలు..అసలు ఆ ఎగ్రిమెంట్ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Simbhu's Manmadhan for Sale Review

పాయింగ్ సినిమా ఆకట్టుకున్నా, సినిమా బోరింగ్ గా సాగుతుంది. ముఖ్యంగా రెండే పాత్రల చుట్టూ తిరగటం విసుగు అనిపిస్తుంది. ఇక సినిమాలో వరలక్ష్మి నటన కోసం ఓ సారి చూడవచ్చు. అలాగే సినిమాలో ఇంటర్వెల్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు తప్ప పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేవు.

శింబు నటనకు వంక పెట్టేదేమీ లేదు. తనకు అలాంటి పాత్రలు కొట్టిన పిండి అన్నట్లు చేసిపారేసాడు. కాకపోతే సినిమాలో డెప్త్ లేకపోవటం ఇబ్బందైంది. సినిమాలో బలమైన ఎమోషన్ లేకపోవటంతో కథ బలంగా వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ ఓకే అనిపించినా సెకండాఫ్ లో ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది. క్లైమాక్స్ గురించి అయితే పూర్తిగా జారిపోయింది.

టెక్నికల్ గా సినిమా బాగుంది. ముఖ్యంగా లండన్ ని, సినిమా మూడ్ ని కాప్చర్ చేస్తూ సినిమాటోగ్రాఫర్ అదరకొట్టారు. సంగీతం బాగున్నా సినిమాలో ప్లేస్ మెంట్ సరిగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఎడిటింగ్ కూడా ఓకే.

నటీనటులు : శింబు, వరలక్ష్మి శరత్ కుమార్, విటేజే గణేష్, శోభన, సామ్రాట్ సూరజ్, నిక్ ధామస్, సంతానం,ప్రేమ్ జీ అమరన్ తదితరులు
దర్శకత్వం : విజ్ఞేష్ శివన్
సంగీతం : ధరణ్ కుమార్
నిర్మాత : 4 స్టార్స్ ఫిల్మ్స్ గ్రూప్
విడుదల తేదీ : 11, మార్చ్ 2016

ఫైనల్ గా ఎంతో అద్బుతంగా ఉంటే తప్ప డబ్బింగ్ సినిమాలు వర్కవుట్ కావు. అంతే తప్ప ఏదో పోస్టర్ లో చూపెట్టి, టైటిల్ తో మిస్ లీడ్ చేసి డబ్బులు చేసుకోవాలనుకోవటం ఇబ్బందికరమైన వ్యవహారమే.

English summary
Mr Manmadhan For Sale Movie has been written and directed by Vignesh Shivan and Produced by 4 stars film group. Earlier the trailer of the Mr Manmadhan For Sale movie unveiled by Shreyas media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu