For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
2.5/5

బలం, బలహీనతలు:

అజయ్ ఫెర్ఫార్మెన్స్

బలమైన కథ, ట్విస్టులు

డైరెక్షన్

మైనస్ పాయింట్స్:

ప్రొడక్షన్ వ్యాల్యూస్

నాసిరకంగా తెరకెక్కించడం

సాంకేతిక విభాగం పనితీరు

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభావంతులైన నటుల్లో అజయ్ ఒకరు. ఆయన పోషించిన పాత్రలు, పెర్ఫార్మెన్స్ పలు చిత్రాలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గత కొన్నేళ్లుగా కీలక పాత్రలతో ఆకట్టుకొన్న అజయ్ స్పెషల్ అనే థ్రిల్లర్ మూవీతో హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాస్తవ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అజయ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Special Movie Review and Rating

రంగ ఓ మైండ్ రీడర్. అజయ్ మైండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. కరడు గట్టిన నేరస్థుల ఆటకట్టించడం ఆయన నైజం. అలా ఎన్నో మర్డర్ మిస్టరీలను సులభంగా ఛేదించి నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. కానీ కొన్ని కారణాలు, అనుకొని పరిస్థితుల వల్ల సస్పెండ్ అవుతాడు. సిన్సియర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన అజయ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఆ తర్వాత ఆయన జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులేంటి? ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? మైండ్ రీడర్ రంగాకు ఈ సినిమాకు ఎలాంటి న్యాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే స్పెషల్.

అజయ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడని చెప్పవచ్చు. భవిష్యత్ బలమైన పాత్రలకు అజయ్ సరైనోడు అనే ఫీలింగ్ కలిగించేలా నికార్సైన పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసి నిలబెట్టాడు. అజయ్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు మరో ఎసెట్. రంగా సినిమా పరిశ్రమకు తొలి పరిచయమైనప్పటీకీ.. తన ప్రతిభతో ఆకట్టుకొన్నాడు. అజయ్, రంగా ఇద్దరు ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక అక్షత పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. అయితే తన పాత్రను ప్రభావవంతంగా తెరమీద చూపించలేకపోయింది. నటన, గ్లామర్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హీరోయిన్‌కు తండ్రిగా నటించిన చక్రపాణి ఆనంద పాత్ర చిన్నదైనప్పటికీ.. ఆకట్టుకొన్నాడు.

స్పెషల్ సినిమాకు ప్రధానమైన బలం కథ. అనేక ట్విస్టులు, ఊహించని సంఘటనలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్‌ను దర్శకుడు వాస్తవ్ అద్భుతంగా డిజైన్ చేశారు. డైలాగ్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ సీన్లు ప్లస్ పాయింట్. లవ్ స్టోరి కూడా సెన్సిబుల్‌గా ఉంటుంది. స్పెషల్ ఓ న్యూ జెనరేషన్ సినిమా. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. తొలిభాగంలో సుమారు ఓ 20 నిమిషాల సినిమా గాడితప్పినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లు నాసిరకంగా ఉంటాయి. బలమైన కథకు బడ్జెట్, నటీనటుల ఎంపిక, నాసిరకమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్, సాంకేతిక విలువలు ఓ శాపంగా మారాయి.

Special Movie Review and Rating

కొత్తరకమైన కథ, దర్శకుడి ఆలోచనలను సరైన రీతిలో ప్రజెంట్ చేసి ఉంటే స్పెషల్ సినిమా తప్పకుండా ఓ న్యూ జనరేషన్ మూవీ అయ్యేది. మంచి కథను తెరపైన చూపించడంలోనూ, ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలో ఓ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. థ్రిల్లర్, సస్పెన్స్, సైన్స్ తరహా నేపథ్యం ఉన్న ఈ సినిమాలను చూసే ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా చేరువైతే కమర్షియల్‌గా వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మూవీ: స్పెషల్

నటీనటులు: అజయ్, రంగ, అక్షత, సంతోష్, చక్రపాణి ఆనంద

బ్యానర్: నందాలాల్ క్రియేషన్స్

డైరెక్టర్: వాస్తవ్

రిలీజ్: 2019-06-21

English summary
Ajay is one of the most versatile actors in the Telugu Film Industry. He has got many accolades for his incredible performances in many movies. Now, he turned a hero for a low budget "Super" thriller movie. This movie hit the screens today and let us find out how Ajay did it as a hero.The main story revolves around the mind-reading technique. The story is about one man who avenges traitors by touching them to read their minds and a ruthless police officer (Ajay) who wants to solve this mysterious murder cases. Ranga (Debut) acted in the Mind reader role. They both nailed it in their respective roles.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more