twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sridevi Soda Center Review and Rating : ఊహించని క్లైమాక్స్ తో రా అండ్ రస్టిక్ సినిమా

    |

    Rating : 3/5

    శ్రీదేవి సోడా సెంటర్ అనే పేరుతో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు అని ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు పలాసలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో సినిమా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. దానికి తోడు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్స్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ముందు ఉండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

    కచ్చితంగా స్టార్స్ ప్రమోషన్లు ఈ సినిమా కోసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేశాయి అని చెప్పవచ్చు. మరి ధియేటర్ల దాకా వచ్చిన ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా? లేదా అనేది సమీక్ష లో తెలుసుకుందాం.

    కథ ఏమిటంటే

    కథ ఏమిటంటే

    సినిమా మొత్తం అమలాపురం నేపథ్యంలో సాగుతుంది. అక్కడ అ లోకల్ గా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ జాతర్లకు, తిరునాళ్లకు, ఫంక్షన్లకు లైటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ బిగిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు సూరిబాబు(సుధీర్ బాబు), తల్లి చిన్నప్పుడే చనిపోగా తండ్రి రఘు బాబుతో కలిసి అక్కడే జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఊరి పెద్దలతో ముందు నుంచి కాస్త దూకుడు వ్యవహారం కారణంగా గొడవలు పడాల్సి వస్తుంది.

    ఒక జాతరలో సోడాల శ్రీదేవి(ఆనంది)తో ప్రేమలో పడతాడు. అయితే ఇద్దరిదీ ఒకే కులం కాకపోవడం సూరి బాబుది తక్కువ కులం కావడంతో శ్రీదేవి తండ్రి నరేష్ ఎలా అయినా వీళ్ళిద్దరినీ విడదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉంటే అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని సూరి బాబు జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది ? శ్రీదేవి, సూరిబాబు కలిశారా ? అనేది కథ.

    సినిమాలో ట్విస్టులు

    సినిమాలో ట్విస్టులు

    అసలు శ్రీదేవి, సూరిబాబు మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వీరిద్దరి ప్రేమకు కాశి(పవేల్ నవగీతన్) ఎలా అడ్డు పడ్డాడు? మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ అవ్వాల్సిన శివ హాస్పిటల్ లో ఎలా చనిపోయాడు? జైల్లో ఉన్న సూరి బాబు శ్రీదేవి కోసం ఎలా తప్పించుకున్నాడు? దుర్గారావు(సత్యం రాజేష్) బంధువుల ఇంటికి శ్రీదేవి సూరిబాబు వెళ్లి ఏం చేశారు? సూరిబాబు పోలీసులకు దొరికిపోయాక శ్రీదేవి ఏం చేసింది? ఇక శ్రీదేవి తమ మాట వినదు అనుకున్న శ్రీదేవి తండ్రి ఏం చేశాడు ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కథ. అయితే కథలో చివరి వరకు పెద్దగా ట్విస్టులు లాంటివి ఏమీ కనిపించవు.

    సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే

    సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే

    అసలు సూరిబాబు నేపథ్యం, సూరి బాబు ఏం చేస్తాడు అనే విషయాలను ఫస్టాఫ్ లో చూపించారు. శ్రీదేవితో ప్రేమలో పడటం, ఆ తర్వాత వారిద్దరూ కలిసి బయట తిరుగుతూ ఉండటంతో ఎలా అయినా వీరి ప్రేమను విడదీయాలని శ్రీదేవి తండ్రి ప్రయత్నించడం వంటి విషయాలను చూపించారు. అయితే ఈ ఫాస్ట్ హాఫ్ లో సినిమా కథాకథనం అంత వేగంగా సాగినట్లు అనిపించలేదు.

    ముఖ్యంగా శ్రీదేవి, సూరిబాబు మధ్య ప్రేమ ఏర్పడిన సంఘటన, అలాగే వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఇంకొంచెం బాగా చూపించి ఉంటే బాగుండేది. అయితే ఈ ఇద్దరిని విడదీయడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుసుకుని ఊరు నుంచి వెళ్లి పోవడానికి నిర్ణయించుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. మొత్తం మీద ఫస్టాఫ్ మాత్రం కాస్త సాగతీత ధోరణిలో సాగుతుంది.

    ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే

    ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే

    సూరి బాబు, శ్రీదేవి పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేయడం, మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న సూరిబాబును పోలీసులు వెతుక్కుంటూ రావడం, అరెస్టు చేయడంతో ఆ తర్వాత సూరిబాబు జైల్లోనే మగ్గాల్సి రావడం అంతా సెకండ్ హాఫ్ లో చూపించారు. అయితే ఎవరూ ఊహించని ట్విస్ట్ తో ఫైనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు.. శ్రీదేవి మనసు చంపుకుని కాశీని పెళ్లి చేసుకుంటుందని అందరూ భావిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ముగించి ప్రేక్షకులందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు దర్శకుడు.

    దర్శకుడు కరుణ కుమారు టేకింగ్ గురించి చెప్పాలంటే

    దర్శకుడు కరుణ కుమారు టేకింగ్ గురించి చెప్పాలంటే

    నిజానికి దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా పాతదే. ఇప్పటిదాకా పెద్ద కులం అమ్మాయి తక్కువ కులం అబ్బాయి మధ్య లవ్ అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. సాధారణ లవ్ స్టోరీకి కులం యాంగిల్ తీసుకురావడమే కాక పరువు హత్యలు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సాధారణంగా పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు, వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఇలాంటి చిన్న విషయాలను కూడా పాయింట్ ఔట్ చేసి చూపించాడు.

    అయితే ప్రేమ కధ, కులం గొడవలు రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో తడబడ్డాడు. మరీ ముఖ్యంగా కొన్ని సీన్లలో వచ్చిన డైలాగులు అలాగే ఎవరూ ఊహించని కొన్ని విషయాలు సినిమాటిక్ గా చూపించడంలో సఫలమయ్యాడు. అయితే అయితే సదరు చాలా బలంగా రాసుకున్న దర్శకుడు కథనాన్ని మాత్రం వేగంగా నడిపే విషయంలో కాస్త పట్టించుకోలేదు ఏమో అనిపించింది.

     సుధీర్ బాబు యాక్టింగ్ ఎలా ఉందంటే

    సుధీర్ బాబు యాక్టింగ్ ఎలా ఉందంటే

    మొత్తం సినిమాను సుధీర్ బాబు సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసాడు అనిపించింది. మొదటి నుంచి కూడా సైలెంట్ లవర్ బాయ్ క్యారెక్టర్లకు పరిమితమైన సుధీర్ బాబు ఈ సినిమాతో ఒక మాస్ హీరో అనిపించుకునే ప్రయత్నం చేశారు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించాడు. కానీ కొన్ని సీన్లలో మాత్రం తడబడినట్లు అనిపించింది.

    ఇక కావాలనే బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టారు కానీ ఈ పాత్రకు అయితే బాడీ బిల్డింగ్ అవసరం లేదు అనిపించింది. ఇక మొత్తంగా చెప్పాలంటే సుధీర్ బాబు నటన ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పక తప్పదు. హీరోయిన్ గా నటించిన ఆనంది కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. సినిమా ఎమోషనల్ సీన్స్ లో తెలుగు అమ్మాయి కావడంతో ఆ సీన్స్ పండడానికి కారణమైంది.

    వీకే నరేష్, రఘుబాబు మిగతా వారి పరిస్థితి

    వీకే నరేష్, రఘుబాబు మిగతా వారి పరిస్థితి

    ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్ ల విషయానికి వస్తే విలన్ పాత్ర పోషించిన తమిళ నటుడు నవగీతన్ తనదైన శైలిలో నటించి మెప్పించాడు. నిజానికి తెలుగు ఏమాత్రం రాకపోయినా నిజంగా మన పల్లెటూర్లలో ఉండే వ్యక్తిలాగే అనిపిస్తూ ప్రతి సీన్లో కూడా ఆయన తనదైన నటనతో మెప్పించాడు. ఆ తరువాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నరేష్ నటన గురించి.. పరువు కోసం పరితపిస్తూ కన్న కూతుర్ని కూడా ఎక్కడ వదలని, కుల ముద్ర వేసుకున్న తండ్రిగా నరేష్ నటన అత్యద్భుతం.

    సినిమా మొత్తం మీద నరేష్ నటన మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అజయ్ తనకు తగిన పాత్ర చేయలేదు అనిపించింది కేవలం రెండు మూడు సీన్లలో మాత్రమే కనిపించాడు. ఇక రఘు బాబు, కత్తి మహేష్, హర్షవర్ధన్, రోహిణి చిన్న చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ కాలం తర్వాత సత్యం రాజేష్ కి ఒక ఫుల్ లెన్త్ క్యారెక్టర్ పడింది.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    ఈ సినిమా మొత్తం కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే క్రమంలో సినిమాటోగ్రాఫర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన ఎలివేషన్ షాట్లు మామూలుగా లేవు. కొన్ని డ్రోన్ షాట్స్ అలాగే ప్రకృతి ఈ విషయంలో ఆయన చూపించిన శ్రద్ధ సినిమాను మంచి కలర్ఫుల్ గా మార్చింది.

    మణిశర్మ అందించిన పాటలు బాగున్నాయి కానీ వాటికంటే కూడా ఆయన అందించిన ఆర్ ఆర్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయింది.. మొదటి హాఫ్ మీద కూడా ఎడిటర్ దృష్టి పెట్టి ఉంటే బాగుండు అనిపించింది. ఇక విజయ్ జిల్లా, శశిదేవిరెడ్డి నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు. ఎక్కడ తగ్గకుండా నిర్మాణ విలువలు పాటించారు.

    ఇక ఫైనల్ గా ఎలా ఉంది అంటే

    ఇక ఫైనల్ గా ఎలా ఉంది అంటే

    శ్రీదేవి సోడా సెంటర్ సినిమా అటు కామెడీ మరోపక్క ఎమోషన్స్ కలగలిపి సత్తా ఉన్న నటీనటులతో రూపొందించిన సినిమా. కాస్త సాగతీత ధోరణిలో సాగిందనే మాట తప్ప సినిమా మీద పెద్దగా వంక పెట్టాల్సిన విషయాలు ఏవీ లేవు. కచ్చితంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. సుధీర్ బాబుకి ఒక రకంగా మాస్ హిట్ పడే సూచనలు ఉన్నాయి.. రా అండ్ రస్టిక్ గా చూపించడంతో A సర్టిఫికెట్ వచ్చింది కానీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా ఇది.

    పరువు హత్యలను నేపథ్యంగా చేసుకున్నా దాని వెనుక ఉన్న పెయిన్ సినిమా థియేటర్ వదిలి వచ్చేశాక కూడా వెంటాడుతూ ఉంటుంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళ్లిన వారు కచ్చితంగా సినిమాను ఎంజాయ్ చేస్తారు.

    Recommended Video

    Real Secret Behind Sudheer Babu Six Pack
    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు


    నటీనటులు : సుధీర్ బాబు. ఆనంది, పావెల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్షవర్ధన్
    దర్శకుడు : కరుణ కుమార్
    నిర్మాతలు : విజయ్ చిల్లా , శశి దేవిరెడ్డి
    సంగీత దర్శకుడు : మణిశర్మ
    ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్

    English summary
    Actor Sudheer Babu’s action entertainer ‘Sridevi Soda Center’ is released today. here is exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X