»   » ధ్రిల్లర్ ఫ్యాన్స్ కే యార్...(టెర్రర్ రివ్యూ)

ధ్రిల్లర్ ఫ్యాన్స్ కే యార్...(టెర్రర్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

అప్పట్లో మళయాళంలో సురేష్ గోపి నటించిన పోలీస్ ఇన్విస్టిగేషన్ సినిమాలు వరసపెట్టి రిలీజయ్యి ఇక్కడ డబ్బులు చేసుకునేవి. ఇక్కడ ఆ తరహా సినిమాలు బాగా ఆడుతున్నాయి కదా అని ఒకరిద్దరు అలాంటివి చేద్దామని ప్రయత్నించినా సక్సెస్ కాలేదు.


కానీ ఆ సీజన్ వెళ్లిపోయిన చాలా కాలం తర్వాత తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సతీష్ కాసెట్టి ..అటువంటి ఇన్విష్టిగేషన్ తరహా థ్రిల్లర్ చిత్రంతో మన ముందుకు వచ్చారు. అయితే ఇలాంటి జానర్ చిత్రాలు అందరికీ అంతగా నచ్చుతాయని చెప్పలేం. కాబట్టి ధ్రిల్లర్స్ ఇష్టపడేవారు వెళితే మాత్రం ..వారికి ఇది పైసావసూల్ సినిమా.


ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే ,మేకింగ్ ప్రధానంగా హైలెట్ గా ఉండాలి. ఈ విషయం గుర్తించిన దర్శకుడు ఆ విషయంపైనే దృష్టి పెట్టే ప్రయత్నం చేసారు. అక్కడక్కడా తడబడినా, ఫస్టాఫ్ లో కొంత, క్లైమాక్స్ సాగతీసినట్లు ఉన్నా...టోటల్ గా తను అనుకున్న కాన్సెప్టు నుంచి ప్రక్కకు వెళ్లకుండా... దర్శకుడు నిబద్దతతో, నిజాయితీతో తీసే ప్రయత్నం చేసారు. అందుకు ఆయన్ని అభినందించాలి.


అలాగే కమర్షియాలిటీ కోసం కక్కుర్తిపడి కథలో ఇమడని కామెడీ ట్రాక్ లు, పాటలు పెట్టకపోవటంలోనే.... దర్శకుడు తను నమ్మిన విషయంపై ఎంత కమాండ్ తో ముందుకు వెళ్లారో అర్దమయ్యేలా చేస్తుంది. ఇక చాలా కాలం తర్వాత శ్రీకాంత్ తనలోని నటుడుని పూర్తి స్దాయిలో ఆవిష్కరించాడని చెప్పాలి.


ధ్రిల్లర్ జానర్ లో చెప్పబడ్డ సినిమా కాబట్టి కథని ఎక్కువ వివరంగా చెప్పదలచుకోలేదు. టూకీగా... సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (శ్రీకాంత్) కు సిటీలో బాంబ్ బ్లాస్ట్ లు జరగనున్నాయనే విషయం తెలుస్తుంది. దాన్ని ఆపటానికి బయిలు దేరిన అతనికి తన డిపార్టమెంట్ నుంచే అడ్డంకులు ఎదురౌతాయి. అంతేకాదు..బ్లాస్ట్ ప్లానింగ్ వెనక భారీగా పొలిటికల్ హస్తాలు ఉన్నాయని క్రమంగా అర్దమవుతుంది. పై నుంచి వచ్చే ప్రెజర్స్ ని తట్టుకుంటూ... అసలు ఎవరు దాడి చేయబోయే ముష్కరులు ఎవరు...వారు ఎక్కడ దాక్కుని ఉన్నారు...ఏ రోజు బ్లాస్టింగ్స్ జరగబోతున్నాయి...అనేవి ఎలా ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకున్నాడు... వాటిని ఎలా ఆపాడు అనేది ఉత్కంఠ మిళితం చేసిన కథనంతో చెప్పిన కథ. ఈ చిత్రం లో కథ ఉందని అనటం కన్నా కథనం ఉందని చెప్పాలి.


వాస్తవానికి టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథలు ఇండియన్ స్క్రీన్ కు కొత్తేమీ కాదు..అలాగే సక్సెస్ రేటు కూడా అతి తక్కువ. టెర్రరిజం మీద ఎవర్షనో మరేమో కానీ జనం పెద్దగా ఆసక్తి చూపరు. కానీ దర్శకుడు ఇలాంటి రొటీన్ కథలోనే కొత్తదనం చూపాలని ప్రయత్నం చూపాడు. దానికి రెండున్నర గంటలు సేపు కూర్చోబెట్టే కథనం రాసుకోవటం కత్తి మీదే సామే. ఆ విషయం దర్శకుడు నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడని చెప్పలేం కానీ బాగానే స్కోర్ చేసాడు.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ...


అదే మైనస్

అదే మైనస్

నిజానికి థ్రిల్లర్ సినిమాల్లో ఊహించని ట్విస్ట్ లు, థ్రిల్స్ ఎక్కువగా ఉంటాయి. అవే కథని మలుపు తిప్పుతాయి. అయితే ఇందులో హైలెట్ అనుకున్న ట్విస్ట్ రెగ్యులర్ సినీ గోయిర్ ఊహించేదే. ఆ ట్విస్ట్ తప్పితే సినిమాలో ఇంకేమీ లేవు. సెకండాఫ్ లో ఖచ్చితంగా రెండు మూడు థ్రిల్లింగ్ అనిపించే ట్విస్టింగ్ సీన్స్ పెట్టుకుంటే బాగుండేది.


సెటప్ కే ఎక్కువ టైమ్

సెటప్ కే ఎక్కువ టైమ్

ఫస్టాఫ్ లో గంటన్నర సేపు ఏం జరిగిందీ అని ఇంటర్వెల్ దగ్గర చూసుకుంటే...కేవలం హీరో కు టెర్రరిస్ట్ దాడి జరగబోతోందని, తన డిపార్టమెంట్ హస్తం ఉందని తెలుస్తుంది. ఈ విషయం చెప్పటానికి ఇంటర్వెల్ దాకా టైమ్ తీసుకున్నారు. అంటే సెటప్ కే ఎక్కువ సమయం పట్టింది. దాన్ని ఓ అరగంట తగ్గిస్తే బాగుండేది.


సబ్ ప్లాట్స్

సబ్ ప్లాట్స్

దర్శకుడు ఎందుకనో సబ్ ప్లాట్స్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. భార్య వైపు నుంచి...తండ్రి వైపు తీసుకున్నా అవి లేకపోయినా కథకు వచ్చే సమస్య ఏమీ లేదు.నో రిలీఫ్

నో రిలీఫ్

కథ ప్రక్కకు వెళ్లకూడదని దర్శకుడు సింగిల్ ట్రాక్ లో వెళ్లటం వరకూ బాగానే ఉంది కానీ ...రిలీఫ్ లేకుండా అంత సేపు అదీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని డైజస్ట్ చేసుకుంటూ చూడటం కాస్త ఇబ్బంది కరమే.


విలన్ ని ఎదుర్కోవటం

విలన్ ని ఎదుర్కోవటం

సినిమాలో బలమైన విలన్ అంటూ ఎవరూ లేదు..అతన్ని ఎదుర్కోవటమూ లేదు..కేవలం స్టెప్ స్టెప్ ఛేదించుకుంటూ విలన్ ఎవరో తెలుసుకునే సరికే స్క్రీన్ టైమ్ సరిపోయింది.తుపాకికి, దీనికి తేడా

తుపాకికి, దీనికి తేడా

మురగదాస్ తుపాకీ చిత్రానికి, దీనికీ తేడా ఏమిటీ అంటే అక్కడ దర్శకుడు విలన్ ఎవరో తెలిసిపోయాక..ఆ విలన్ ని తుదముట్టించే సీన్స్ చాలా ఉత్కంఠంగా నడిపాడు. నిజానికి అవే సినిమాకు హైలెట్ అవుతూంటాయి. ప్రేక్షకుడుని తృప్తి పరుస్తాయి.డౌట్

డౌట్

ఈ కథలో టెర్రరిస్ట్...బాంబ్ పెట్టడానికి హైదరాబాద్ వచ్చి నాలుగేళ్లపాటు...సరైన టైమ్ కోసం ఎదురుచూడటం దాకా ఓకే. కానీ ఇక్కడ పొలిటీషన్స్ తో చేతులు కలపటమేమిటో అర్దం కాదు. ఎందుకంటే ఇక్కడ బాంబులు పెట్టమని ప్రోత్సహించే సంస్దలు, దేశాలు ఏమిటో మనకు తెలుసు.దర్శకుడుగా

దర్శకుడుగా

దర్శకుడుగా సతీష్ కాసెట్టి తన బలం...రియలిస్టిక్ సినిమా తీయటం అని ప్రూవ్ చేసారు ఈ సినిమాతో. కమర్షయల్ ప్రవాహంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకుటెక్నికల్ గా..

టెక్నికల్ గా..

ఈ సినిమాకు హైలెట్ కెమెరా వర్క్ అని చెప్పాలి. చాలా సీన్స్ ని తన విజువల్స్ తో కట్టిపారేసాడు సినిమాటోగ్రాఫర్. సంగీతం అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. డైలాగులు ఈ సినిమాకు ఇంకా బాగుంటే మరింత ప్లస్ అయ్యేవి. సోసోగా ఉన్నాయి.ఎవరెవరు

ఎవరెవరు

బ్యానర్: అఖండ భారత్ క్రియేషన్స్
నటీనటులు: శ్రీకాంత్, నికిత ధుక్రల్, నాజర్, కోట శ్రీనివాసరావు, పృద్వీ, రవివర్మ, సుధ తదితరులు.
మాటలు: లక్ష్మీ భూపాల్,
ఎడిటర్: బసవ పైడి రెడ్డి,
ఆర్ట్: మురళి కొండేటి,
ఫైట్స్: రన్ జాషువా,
మ్యూజిక్: సాయి కార్తీక్,
సినిమాటోగ్రఫీ: శ్యామ్ ప్రసాద్,
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: షేక్ జైన్ లాబ్దీన్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి అయినీడి,
సమర్పణ: షేక్ కరీమా,
ప్రొడ్యూసర్: షేక్ మస్తాన్,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సతీష్ కాసెట్టి
విడుదల తేదీ: 26-02-2016.ఫైనల్ గా ఈ తరహా సినిమాలు ఇతర భాషల్లో వచ్చి మనకు డబ్బింగ్ అవుతూంటే చూసి మెచ్చుకుంటూంటాం. మన దర్శకుడు తీసిన సినిమానూ అదే స్దాయిలో ఆదరిస్తే..మరిన్ని ధ్రిల్లర్స్ మనకూ వచ్చే అవకాసం ఉంది.

English summary
Srikanth-starrer Terror released today.The film is directed by Satish Kasetty. Also starring in this film are Nikitha, Kota Srinivas Rao, Nazar, Sudha, Vinay Varma, Ravi Varma, Uttej. Srikanth is playing a powerful and intelligent police officer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu