For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సుబ్రహ్మణ్యపురం’ రివ్యూ, రేటింగ్

  |

  Rating:
  1.5/5
  Star Cast: సుమంత్, ఈషా రెబ్బ, సురేష్
  Director: సంతోష్ జాగర్లపూడి

  సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం . సుబ్రహ్మణ్య‌పురం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో సాగే రహస్యాలతో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందకు వచ్చింది.

  ఇప్పటికే ఇలాంటి కాన్సెప్టులతో తెలుగులో పలు చిత్రాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ద్వారా చెప్పే విషయాలు చాలా కొత్తగా ఉంటాయని, ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి అంటోంది చిత్ర బృందం. అసలు థ్రిల్లర్ సినిమాలు చేయడం ఇష్టం ఉండని సుమంత్ కథ నచ్చడం వల్లే చేశాను అని చెప్పడం కూడా సినిమాపై కొంత ఆసక్తిని పెంచింది. ఇంతకీ 'సుబ్రహ్మణ్యపురం' ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలోచూద్దాం.

  కథ ఏమిటంటే...

  కథ ఏమిటంటే...

  కార్తీక్(సుమంత్) పురాతన దేవాలయాల మీద రీసెర్చ్ చేసే ఒక పరిశోధకుడు. తన ప్రాజెక్టులో భాగంగా పూరి జగన్నాథ్ టెంపుల్‌తో పాటు వివిధ దేవాలయాలపై పరిశోధన చేస్తుంటారు. అయితే సుబ్రమ్మణ్యపురంలోని దేవాలయంలో జరిగే సంఘటనలు అతడిని విస్మయ పరుస్తుంటాయి. ఆ ఊరిలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిషేధం. అయితే ఓ వ్యక్తి స్వామికి అభిషేకం చేసి గుడిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అప్పటినుంచి ఆ ఊరిలో వరుస ఆత్మహత్యలు జరుగుతుంటాయి.

  అంతా దేవుడి మహిమేనా?

  అంతా దేవుడి మహిమేనా?

  చనిపోయే వారికి ఎలాంటి బాధలు ఉండకపోగా అంతకు ముందు వరకు చాలా సంతోషంగా ఉండేవారు. నిరక్షరాస్యలు కూడా ఆత్మహత్య ముందు అతిపురాతనమైన గాంధార లిపిలో నన్ను దేవుడు పిలుస్తున్నాడు అని ఓ పేపర్ మీద రాసి ఆత్మహత్య చేసుకుంటారు. వారు చనిపోయే ముందు నెమలి కనిపించి మామవవ్వడం కూడా గ్రామస్తులను భయాంధోళనలకు గురి చేస్తూ ఉంటుంది. అభిషేకం జరుగడం వల్లే సుబ్రహ్మణ్య స్వామికి కోపం వచ్చిందని, అందుకే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయని నమ్మిన గ్రామస్తులు మరిన్ని ఆత్మహత్యలు జరుగక ముందే ఊరి విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు.

  దేవుడిని నమ్మని కార్తీక్ ఏం చేశాడు?

  దేవుడిని నమ్మని కార్తీక్ ఏం చేశాడు?

  అయితే దేవుడు అంటే నమ్మకం లేని, దేవాలయాల మీద పరిశోధన చేసే కార్తీక్ ఈ ఆత్మహత్యల వెనక ఉన్న రహస్యాన్ని ఎలా చేధించారు? ఇది దైవం చేస్తున్న పనా? లేక మనుషులు చేస్తున్నదేనా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  పెర్ఫార్మెన్స్ పరంగా..

  పెర్ఫార్మెన్స్ పరంగా..

  సుమంత్ పెర్ఫార్మెన్స్ బావుంది. కార్తిక్ అనే పరిశోధకుడి పాత్రలో సహజంగా నటించాడు. అలా అని కొత్తగా కూడా అనిపించలేదు. రోటీన్‌గా సుమంత్‌ను తెరపై చూసిన ఫీలింగే కలుగుతుంది. ఈషా రెబ్బ అందంగా కనిపించింది. పెర్పార్మెన్స్ ప్రూవ్ చేసుకునే స్థాయి పాత్ర ఆమెకు దొరక్క పోయినా ఉన్నంతంలో చక్కగా నటించింది.

  ఇతర పాత్రల విషయానికొస్తే...

  ఇతర పాత్రల విషయానికొస్తే...

  సుబ్రహ్మణ్యపురం ప్రెసిడెంట్ పాత్రలో సీనియర్ నటుడు సురేష్ ఫర్వాలేదనిపించాడు. సాయికుమార్, ఆలి, స‌త్య సాయి శ్రీనివాస్, మిర్చి మాధ‌వి, సుర్య‌, ర‌ఘునాథ్ రెడ్డి, సారిక రామ‌చంద్ర‌రావు, జోష్ రవి, బ‌ద్రం, గిరిధ‌ర్, అమిత్ శ‌ర్మ‌, టి.ఎన్.ఆర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

  టెక్నికల్ అంశాలు

  టెక్నికల్ అంశాలు

  టెక్నికల్ అంశాల పరంగా చూస్తు... ఆర్‌కె ప్రతాప్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. శేఖర్ చంద్ర అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకు ప్లస్సయింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని చోట్ల సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులు ఉలిక్కపడేలా చేసింది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బావుండే అనే ఫీలింగ్ కలుగుతుంది.

   సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉంది...

  సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ ఎలా ఉంది...

  సినిమా ఫస్టాఫ్ సాదాసీదాగా సాగింది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు, సుబ్రహ్మణ్యపురం ఊరికి సంబంధించిన అంశాలతో సినిమాను బాగా సాగదీశారనే చెప్పాలి. సెకండాఫ్‌లో అసలు విషయం మొదలైనా క్లైమాక్స్‌ వరకు లాగిలాగి తీసుకెళ్లడం కాస్త బోర్ తెప్పిస్తుంది. క్లైమాక్స్‌‌లో వచ్చే సీన్లు కూడా అంత గొప్పగా ఏమీ లేవు.

  డైరెక్షన్, కథా విశ్లేషణ

  డైరెక్షన్, కథా విశ్లేషణ

  ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లపూడి స్వయంగా కథ రాసుకుని దర్శకత్వం వహించారు. డైరెక్షన్ పరంగా ఫర్వాలేదనిపించాడు. అయితే గుడి వెనక ఉన్న రహస్యాన్ని చెప్పేందుకు అల్లుకున్న స్క్రిప్టు, స్క్కీన్ ప్లే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. థ్రిల్లర్ సినిమా అని చెప్పిన ఈ కథలో ఆశించిన స్థాయిలో థ్రిల్లింగ్ అంశాలు లేవు. పదే పదే ఆత్మహత్యలు చూపించడమే తప్ప ప్రేక్షకుల్లో నెక్ట్స్ ఏంటి? అనే స్థాయిలో ఉత్కంఠ రేపడంలో విఫలం అయ్యాడు. అయితే గుడి వెనక ఉన్న పురాణాలు, కథలు యానిమేషన్ రూపంలో చెప్పే విధానం కాస్త ఫర్వాలేదని చెప్పొచ్చు.

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  • సుమంత్ పెర్ఫార్మెన్స్
  • బ్యాగ్కౌండ్ స్కోర్
  • అనవసరంగా పాటలు లేక పోవడం
  • మైనస్ పాయింట్స్

   • కథలో కొత్తదనం లోపించడం
   • ఆశించిన స్థాయిలో థిల్లింగ్ అంశాలు లేక పోవడం
   • చివరగా...

    చివరగా...

    ‘సుబ్రహ్మణ్యపురం' ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ‘కార్తికేయ' లాంటి సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. గుడివెనక రహస్యంలో చిన్న మార్పు తప్ప కొత్తగా ఏమీ కనిపించలేదు.

     నటీనటులు, తెరవెనక

    నటీనటులు, తెరవెనక

    తారాగణం: స‌మంత్, ఈషారెబ్బ‌, సురేష్, సాయికుమార్, ఆలి, స‌త్య సాయి శ్రీనివాస్, మిర్చి మాధ‌వి, సుర్య‌, ర‌ఘునాథ్ రెడ్డి, సారిక రామ‌చంద్ర‌రావు, జోష్

    ర‌వి, బ‌ద్రం, గిరిధ‌ర్, అమిత్ శ‌ర్మ‌, టి.ఎన్.ఆర్.
    సినిమాటోగ్ర‌ఫిః ఆర్.కె. ప్రతాప్
    ఎడిట‌ర్ః కార్తిక్ శ్రీనివాస్
    సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌
    క్యాస్టూమ్ డిజైన‌ర్ః సుమ త్రిపుర‌ణ‌
    ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
    కో డైరెక్ట‌ర్ః ఆర్.సురేష్
    ప్రొడ్యూస‌ర్: బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి
    రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ః సంతోష్ జాగ‌ర్లపూడి

  English summary
  Subramanyapuram movie review and rating. The film did not impress the audience. The novelty is not found in the story. Eesha Rebba is playing the leading lady opposite Sumanth in the film. The movie is directed by Santhossh Jagarlapudi and produced by Beeram Sudhakar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X