»   » విశ్వరూపమే: శభాష్ ...సల్మాన్!! ('సుల్తాన్' రివ్యూ)

విశ్వరూపమే: శభాష్ ...సల్మాన్!! ('సుల్తాన్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

సూర్య ప్రకాష్ జోశ్యుల

'ఈ సినిమాలో ఫైట్లు ఓ మహిళ రేప్‌కు గురైనంత నొప్పి కలిగించాయి' అంటూ చిత్రం ప్రమోషన్‌ లో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశం మొత్తం సంచలనం కలిగించాయి. ఆ వ్యాఖ్యలు చేయటం తప్పు అన్నవారే కాక..ఇంతలా చెప్తున్నాడు, . ఇంత బిల్డప్ ఇస్తున్నాడు సినిమా ఎలా ఉంటుందో.. అని ఎదురుచూసినవారు సైతం ఉన్నారు.

వివాదాలు, వ్యాఖ్యలు వంటివి ప్రక్కన పెడితే .. సల్మాన్ మాత్రం ఈ సినిమా కోసం తన శక్తి మొత్తం ఖర్చు పెట్టి కష్టపడ్డాడని తెలుస్తుంది. ఒళ్లు హూనం చేసుకున్నాడని అర్దం అవుతుంది. కొన్ని సన్నివేశాలు చూస్తూంటే...ఇంత కష్టం ఓ నటుడుగా సల్మాన్ ఎలా పడ్డాడా అని మెచ్చుకోకుండా ఉండలేం. ఇది వన్ మ్యాన్ షో. ఇది ప్యూర్ సల్మాన్ షో. అయితే ఈ స్పోర్ట్స్ బేసెడ్ బయోపిక్....స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లేనివారికి ఆసక్తి కలిగిస్తుందా. సామాన్య సల్మాన్ అభిమానిని అలరిస్తుందా.. ? అంటే...

హర్యానాలోని ఓ చిన్న పట్టణంలో... ఉన్న రెజ్ల‌ర్ ప్రముఖ మల్లయోధుడు సుల్తాన్ అలీ ఖాన్ (సల్మాన్)... కథ ఇది . కామ‌న్ వెల్త్, ఒలింపిక్స్ ల‌లో పాల్గొని దేశానికి ప‌త‌కాలు అందించిన అతను యువకుడుగా ఉన్నప్పుడు ఫిమేల్ రెజ్లర్ ఆర్ఫా(అనుష్క శర్మ) తో ప్రేమలో పడతాడు. ఆమెతో పరిచయం అతని జీవితానికి కొత్త గోల్స్ ఏర్పడేలా చేస్తుంది. ఆ తర్వాత వివాహానంతరం ఎంతో సక్సెస్ చూస్తాడు. కానీ అతని జీవితంలో ఊహించని సంఘటన జరిగి ఎంతో అన్యోనంగా ఉండే భార్య, భర్తలు విడిపోయే సిట్యువేషన్ ఏర్పడుతుంది.

ఆ విషాద సంఘటన తర్వాత అతను జీవితానికి ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకుంటాడు. ఆ లక్ష్యం నెరవేర్చుకునేందుకు చాలినంత డబ్బు ఉండదు. ఓ ప్రక్క వయస్సు అయిపోతోంది. అటువంటి సమయంలో అతను తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో తన సమస్యలను అన్నిటినీ ప్రక్కకు నెట్టగలుగుతాడు. లైఫ్ అండ్ డెత్ అనే స్దాయికి వెళ్లి విజయం సాధిస్తాడు. ఇంతకీ సుల్తాన్ జీవితంలో జరిగిన విషాద సంఘటన ఏమిటి..అతను తీసుకున్న ఆఖరి నిర్ణయం ఏమిటి..వంటి విషయాలతో కూడిన ఆసక్తికరమైన కథనం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ లు, మైనస్ లు స్లైడ్ షోలో

గొప్ప విషయం

గొప్ప విషయం

ఈ సినిమాలో అతి గొప్ప విషయం ఏమిటంటే... సల్మాన్ తన మాస్ ఇమేజ్, స్టార్ డం అన్నీ ప్రక్కన పెట్టి సినిమాను చేసారు. అంత అద్బుతంగా పాత్రలో లీనమైపోయారు.

డ్యూరేషన్ ఎక్కువ అయినా

డ్యూరేషన్ ఎక్కువ అయినా

దాదాపు మూడు గంటలు సినిమా అయినా ఎక్కడో కానీ డైవర్షన్ అనిపించదు. ఎపిసోడిక్ గా ఉన్న బయోపిక్ సినిమాను ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా అంతసేపు కూర్చేనేలా చేయటం డైరక్టర్ గొప్పతనమే.

ప్రేరణ ఇస్తుంది

ప్రేరణ ఇస్తుంది

ఈ సినిమాలో మరో మంచి విషయం ఏమిటీ అంటే పెట్టుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఏ విధంగా ఎలా కష్టం ఏ స్దాయిలో పడాలి అనేది స్పష్టంగా చెప్తూ ప్రేరణ ఇస్తుంది.

పిచ్చి కామెడీ, సాంగ్స్

పిచ్చి కామెడీ, సాంగ్స్

కమర్షియల్ కోసం పిచ్చి కామెడీలు, అనవసరమైన సాంగ్స్ ఎక్కడా పెట్టలేదు. ప్రతీది సినిమాలో ఇమిడిపోయాయి. దర్శకుడు నిబద్దత ఈ విషయంలో కనపడుతుంది.

ప్రత్యేకంగా చెప్పేదేముంది

ప్రత్యేకంగా చెప్పేదేముంది

సినిమా సినిమాకూ తానేంటో , తనలోని నటి ద్వారా చూపిస్తూ వస్తున్న అనుష్క.. మల్లయోధురాలిగా రింగులో ప్రత్యర్థులను ఓడించే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

అదే కాస్త ఇబ్బంది

అదే కాస్త ఇబ్బంది

ఫస్టాఫ్‌లోని సీన్స్ ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా మనలను సీటు నుంచి కదలకుండా చేస్తాయి. సెకండాఫ్‌లో పైట్ సీన్స్ ఎక్కువగానే ఉండి, కాస్త సాగిన ఫీలింగ్ వస్తుంది.

క్లైమాక్స్ కేక

క్లైమాక్స్ కేక

ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ లలో ఇది ఒకటి అనే చెప్పాలి. ఊహించే విషయమే అయినా చాలా ఇంటిన్సెటితోనూ, అంతకు మించి భావోద్వేగాలతోనూ నింపి పండిచాడు.

మంచి క్యారక్టర్ పడింది

మంచి క్యారక్టర్ పడింది

సుల్తాన్‌కు రెజ్లింగ్‌ కోచ్‌గా రణ్‌దీప్‌ హుడాకి మంచి క్యారక్టర్ పడింది. అతను తన పరిధిలో బాగా నటించాడు. ఎంతలా అంటే...రణ్‌దీప్‌ పాత్ర ప్రాధాన్యతను మరింత పెంచితే బాగుండేదనిపించేటంత.

టెక్నికల్ గా...

టెక్నికల్ గా...

ఈ సినిమాలో టెక్నీషియన్స్ కు పెద్ద పీట వేసారు. ముఖ్యంగా సినిటోగ్రాఫర్ ..ప్రతీషాట్ ని గ్రాండియర్ గా అద్బుతంగా చూపించాడు. దర్శకుడు ఈ భారీ చిత్రాన్ని ఏ ఒక్క సీన్, షాట్ కూడా వృధా అననీయకుండా తీర్చి దిద్దాడు

సాంగ్స్, ఎడిటింగ్

సాంగ్స్, ఎడిటింగ్

ఇక శిశాల్-శేఖర్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా అందించారు. ఎడిటింగ్ వర్క్ కూడా బాగానే ఉంది. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి .

సల్మాన్ షోనే

సల్మాన్ షోనే

ఈ సినిమాలో నిజమైన మల్లయోధుడిగా కనిపించేందుకు సల్మాన్‌.. ప్రముఖ హాలీవుడ్‌ ఫైట్‌మాస్టర్‌ లార్నెల్‌ స్టోవల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకశిక్షణ తీసుకుని పది కిలోల బరువు కూడా పెరిగి, అంతుకు మించి నటనలోనూ అద్బుతంగా చేసిన సల్మాన్ వన్ మ్యాన్ షో ఇది.

ఎవరెవరు..

ఎవరెవరు..

బ్యానర్ : యశ్‌రాజ్ ఫిల్మ్స్
నటీనటులు : సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ, రణ్‌దీప్ హూడా, టైరన్ ఊడ్లీ, తదితరులు
సినిమాటోగ్రఫీ : ఆర్తుర్ జురాస్కీ
సంగీతం : విశాల్-శేఖర్
ఎడిటర్ : రామేశ్వర్ ఎస్. భగత్
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం : అలీ అబ్బాస్ జఫర్
నిర్మాత : ఆదిత్య చోప్రా
విడుద‌ల‌ : 06-07-2016

ఫైనల్ గా ఇది జీవితానికి ప్రేరణ ఇచ్చే చిత్రం. స్పోర్ట్స్ పర్శన్స్ జీవితాన్ని దగ్గరగా చూపిన చిత్రం. ఇటువంటి అరుదుగా వచ్చే చిత్రాలను మిస్ కావద్దు.

English summary
Sultan, it is basically a sports based film but with a pinch of all factors of 'paisa-vasool' entertainment i.e, romance, songs, power-packed dialogues & action! So gear up to get the answers to all your questions; How is the film? Is it worth watching or not? Does Salman deliver his career best performance?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu