»   » మధ్యలోనూ ఏమీ లేదు... ('అంతకు ముందు ఆ తరువాత' రివ్యూ)

మధ్యలోనూ ఏమీ లేదు... ('అంతకు ముందు ఆ తరువాత' రివ్యూ)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  1.5/5
  ----సూర్య ప్రకాష్ జోశ్యుల
  బ్యానర్ : శ్రీ రంజిత్ మూవీస్
  నటీనటులు : సుమంత్‌ అశ్విన్‌ , ఈషా, రవిబాబు, రావు రమేష్‌, అవసరాల శ్రీనివాస్‌, రోహిణి, మధుబాల, తాగుబోతు రమేష్‌ తదితరులు.
  ఛాయాగ్రహణం: పి.జి.విందా,
  కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,
  కళ: ఎస్‌.రవీందర్‌,
  సంగీతం: కల్యాణి కోడూరి,
  సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్మోహన్‌రెడ్డి వి.,
  నిర్మాత : కె.ఎల్. దామోదర్ ప్రసాద్
  కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

  ప్రేమలో పడేటప్పుడు ఎంత ఉత్సాహంగా, అంతా తమదే లోకం అన్నట్లు ప్రవర్తించే ప్రేమికులు.....ఆ తర్వాత నిజ జీవితంలో సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చినప్పుడు...భాద్యతలు చేపట్టాల్సివచ్చినప్పుడు ఎలా తప్పించుకోవటానికి చూస్తారో, ఎదుటివారి లోపాల్ని ఎలా భూతద్దంలో చూసి ప్రేమని చంపేసుకుని విడిపోవటానికి ట్రై చేస్తారో, వినోదాన్ని మేళవించి చెప్పాలనుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆలోచన వరకూ అద్బుతమే. అయితే ఏదో చెప్పాలన్న తపనతో డైలాగులతో సీన్స్ మొత్తం నింపేసి, దాన్ని మెల్లిగా నడపటం మాత్రం ప్రేక్షకుల పరంగా క్షమించరాని అంశం. ప్రధాన పాత్రల మధ్య కాంఫ్లిక్ లేని ఫస్టాప్ బోర్ కొట్టిస్తే..సెకండాఫ్ పూర్తి టీవీ సీరియల్ గా సాగుతూ...సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో మెచ్చుకోతగ్గ అంశం ఏమిటీ అంటే...అక్కడక్కడ పేలే డైలాగులు, ఎత్తుకున్న కాన్సెప్ట్ మాత్రమే.

  ట్రైలర్ మొదట చూసి తర్వాత సినిమా చూడాలి అనే కాన్సెప్టు తో వచ్చిన ఈ కథలో ...రాజమండ్రికి చెందిన కుర్రాడు అనీల్(సుమంత్ అశ్విన్) ...హైదరాబాద్ ఓపెళ్లికి వచ్చి అక్కడ అనన్య(ఈషా)తో ప్రేమలో పడతాడు. అప్పటికే అనన్య తల్లితండ్రులు(మధుబాల,రవిబాబు)...విభేధాలతో విడాకులకు సిద్దంగా ఉండి..రోజూ తగువులాడుకుంటారు. మరో ప్రక్క అనీల్ కు తన తల్లి ఎప్పుడూ చూసినా షాపింగ్ చేస్తూ గడిపేయటం నచ్చదు. ఈ నేపధ్యంలో తమ ప్రేమ..పెళ్లిగా మారితే ఎలా ఉంటుందో అని ఇద్దరూ సహజంగానే భయపడతారు. దాంతో ఇద్దరూ సహజీవనం చేసి...తాము...ఒకరికొకరు సరి అయిన జంటో కాదో...తేల్చుకోవాలనుకుంటారు. అప్పటి నుంచి ఏం జరిగింది..ఇద్దరూ లివింగ్ రిలేషన్ షిప్..మునగకుండా పెళ్లి దాకా వెళ్లిందా లేదా అన్నది మిగతా కథ.

  సున్నితత్వం, సృజనాత్మక అంశాలతో సినిమాల్ని తీయడం మోహనకృష్ణ ఇంద్రగంటి శైలి అని ఆయన గత చిత్రాలు ప్రూవ్ చేసాయి. దాంతో ఎత్తుకున్నది సీరియస్ అంశమైనా..అష్టాచెమ్మా తరహాలో ఎంటర్టైన్మెంట్ తో లాగిస్తాడు అనుకున్నారు. అయితే ఈ రొమాంటిక్ కామెడీ (అనొచ్చా) సినిమాలో అదే లోపించింది. అలాగే...ఎమోషన్ పండాల్సిన సీన్స్ లో తేలిపోయింది. ఇక ప్లాట్ బాగ్ చిన్నది కావటంతో ఎక్కువ సబ్ ప్లాట్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. హీరో తండ్రి ప్రేమ కథ, హీరోయిన్ తల్లి కెరీర్ కథ, హీరో పనిచేసే ఆఫీసులో కథ ఇలా..ఎక్కడ పడితే అక్కడ సబ్ ప్లాట్ లాగే ప్రయత్నం చేసాడు. ఎన్ని చేసినా ఎత్తుకున్న కథ లో మొదటి మలుపు (హీరో,హీరోయిన్ ...సహజీవనానికి సిద్దం అవటం) ఇంటర్వెల్ దాకా రాకపోవటంతో క్లాప్లిక్ రైజ్ కాలేదు. దాంతో కథ,కథనం నత్త నడక నడిచింది. పోనీ సెకండాఫ్ లో అయినా... పరుగెట్టిస్తాడు అనుకుంటే అటువంటి సిట్యువేషన్సే ఎదురుకావు.. ప్లీ క్లైమాక్స్ లో ఇద్దరూ విడిపోయాక...మళ్లీ కలవటానికి ప్రేమే కారణమనేది స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దాంతో క్లైమాక్స్ వీక్ అయ్యిపోయి.. రొటీన్ అయ్యిపోయింది.

  నటీనటుల్లో... సుమంత్ అశ్విన్...తన తొలి చిత్రానికి ఈ చిత్రానికి చాలా వేరియేషన్ కనిపించేలా మెరుగయ్యాడు. కొత్తమ్మాయి ఈషా కూడా చాలా ఈజ్ తో సీన్స్ కొత్తతనం లేకుండా చేసుుకంటూ పోయింది. ముఖ్యంగా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా పండించటం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మధుబాల(మాజీ హీరోయిన్),రావు రమేష్ , రవిబాబు, ఝాన్సీ ల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఉన్నతంలో అవసరాల శ్రీనివాస్ దే ఎంటర్టైన్మెంట్ రోల్. దాన్ని అతను సమర్ధవంతంగా పండించాడు.

  టెక్నికల్ గా పి.జి. విందా కెమెరా వర్క్ అద్బుతం కాకపోయినా వంక పెట్టలేని విధంగా సాగింది. కళ్యాణి కోడూరి(కళ్యాణ్ మాలిక్) పాటలు సోసోగా ఉన్నాయి. మెలోడీతో సాగే రెండు సాంగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ చేయాలి. చాలా లాగ్ లు ఉన్నాయి. ప్రొడక్షన్ విలువలు కూడా చిన్న సినిమాకు పెద్ద లుక్ తెచ్చిపెట్టాయి. దర్శకుడుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్టైయిట్ గా చెప్పాలనుకునే ప్రయత్నం బాగుంది కానీ ...స్లో నేరేషన్ (ఎంత ఫీల్ కోసమైనా) చాలా ఇబ్బంది పెట్టింది. అయితే డైలాగు రైటర్ గా ఆయన మంచి మార్కులే వేయించుకున్నారు.

  పైనల్ గా...సినిమా చూడకముందు..సినిమా చూసాక ...ప్రేక్షకుడు పరిస్ధితి ఏమిటన్న విషయమై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పక్కా మాస్ మసాలా చిత్రాలు,ప్యూర్ కామెడీలు వస్తున్న ఈ టైమ్ లో ఈ ప్రయత్నం మంచిదే కానీ...అది కొన్ని వర్గాలకే పరిమితం అయ్యేలా ఉంది. కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమా చూడాలనుకునే వారికి ఈ చిత్రం ఓ మంచి ఆప్షన్.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Due to Current Political situations many high budget films were postponed and the small budget films are getting ready to release in this gap. But only one film that is making buzz is “Anthakumundu AaTaruvatha” (AMAT) starring Sumanth Ashwin and Eesha.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more