»   » కష్టాష్టమి (సునీల్ 'కృష్ణాష్టమి' రివ్యూ)

కష్టాష్టమి (సునీల్ 'కృష్ణాష్టమి' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

తనకున్న కమిడియన్ ఇమేజ్ ని మార్చుకునే క్రమంలో సునీల్ తప్పడుగులు వేస్తున్నాడు. స్టార్ హీరోగా ఎదగాలనుకోవటం తప్పేమి కాదు కానీ అందుకోసం స్టార్ హీరోలు చేసిన కథలనే మళ్లీ ఫ్రీమేక్ తరహాలో చేయటమే తప్పు. తెలుగు తెరపై ఎన్నో సార్లు నలిగిపోయిన స్టోరీ పాయింట్ ని, అదే తరహా స్క్రీన్ ప్లే తో తీసుకొచ్చి అలరించాలని ప్రయత్నించి బోల్తా పడుతున్నాడు.


ఇలాంటి నాశిరకం ఆలోచనలతో ఉన్న సినిమాలతో ... సునీల్ కు ఉన్న అభిమానులు సంఖ్య తగ్గటం తప్ప పెద్ద ఉపయోగం లేదు...ఎందుకంటే మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం అదే స్ధాయిలో ఉండి ఉంటే ఈ పాటికి హిట్ టాక్ తో అదిరిపోయేది. దాంతో ఇది మరో మిస్టర్ పెళ్లి కొడుకు అనిపించింది.


అయినా సునీల్ సినిమా అంటే నవ్విస్తాడు అనుకుని ఆవేశపడి ధియోటర్ కు వెళితే... ఎక్కడా అటువంటి ఛాయిలే కనిపించకుండా సీరియస్ హీరోలా చేసుకుంటూ వెళ్లిపోవటం సినీ విషాదం. ఉన్నంతలో సప్తగిరి,బ్రహ్మానందం కాస్త రిలీఫ్ ఇచ్చారు. కాకపోతే ధియోటర్ లో ఉన్నంతసేపే అది..బయిటకు వస్తే అవీ గుర్తుండిపోయే ట్రాకులూ కాదు.


Also Read: త్రివిక్రమ్ నేను, డొక్కు స్కూటర్‌పై..., అవమానాలు


కృష్ణ (సునీల్) ఓ ఎన్నారై. చిన్నప్పుడే అమెరికా వెళ్లిపోయిన అతనికి ఎప్పటినుంచో ఇండియా రావాలని కోరిక. అయితే...ఇండియాకు వస్తానంటే అతని పెదనాన్న రామ చంద్రరావు(ముఖేష్ రుషి) అడ్డు పడుతూంటాడు. విసుగెత్తిపోయిన కృష్ణ ఓ రోజు చెప్పాపెట్టకుండా ఇండియాకు బయిలు దేరతాడు. ఆ జర్నీలో పల్లవి (నిక్కీ గల్రాని) తో పనిలో పనిగా ప్రేమలో పడి, ఆమెను లైన్ లో కూడా పెట్టేస్తాడు.


ఇదే జర్నీలో కృష్ణకి ..అజయ్ (అజయ్) అతని కొడుకు పరిచయమవుతారు. వాళ్లపై ఎటాక్ జరగటంతో వాళ్ళని రక్షించి తన కారులో తీసుకు వస్తూంటాడు. అయితే వాళ్లపై మరోసారి ఎటాక్ జరిగి. అజయ్ కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పుడు కృష్ణ ...అజయ్ కొడుకుని తీసుకుని అజయ్ అత్తారింటికి బయిలుదేరతాడు. ఆ పిల్లవాడిని ఆ ఇంట్లో అప్పచెప్దామని వెళ్ళీపోదామనుకుంటే.. వాళ్లంతా ..సునీల్ ని ..చాలా కాలం తర్వాత తమ ఇంటికి వస్తున్న అల్లుడు, మనవడు గా పొరబడతారు. తానెవరో చెప్పే అవకాసం రాదు.


దాంతో కొద్ది రోజులు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో అతనికో నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో వాళ్లు తను ఎవరో తెలియకుండా తనని చంపటానికి ప్రయత్నాలు చేస్తున్నారని. అది తెలుసుకున్న కృష్ణ ఏం చేసాడు... వారు చంపాలనుకోవటానికి కారణం ఏమిటి...తన పెదనాన్నే తనని ఇండియా ఎందుకు రానివ్వటం లేదు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఈ మధ్యకాలంలో వచ్చిన అతి పెద్ద కిచిడీ కథ ఇదే అని చెప్పాలి... ఈ సినిమాలో రకరకాలు సినిమాలు కనపడుతూంటాయి. ‘సంతోషం'..(అజయ్ ప్లాష్ బ్యాక్), ‘1' (నేనొక్కడినే)..(హీరోయిన్ పడేసే ఎత్తుగడ), హీరోయిన్ చెప్పే బెలూన్ ఫిలాసఫీ(బాద్షాలో కాజల్ క్యారక్టరైజేషన్), కీలకమైన మలుపు(బావగారూ బాగున్నారా), ఇంటర్వెల్ (మర్యాదరామన్న), సెకండాఫ్ లో విలన్స్ ని మార్చటం(రెడీ) ఇలా..అడుగడగుకీ ఎన్నో సినిమాలు కంటిక్రింద రాళ్లలా..జ్ఢాపకశక్తికి పరీక్షలా తగులుతూంటాయి. అలా జరగటమే ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ అని చెప్పాలి.


స్లైడ్ షోలో మిగతా రివ్యూ....


ఎప్పటిలాగే

ఎప్పటిలాగే

ఈ సినిమాలో ఇంటర్వెల్ కు కానీ కథ మొదలు కాదు..క్లైమాక్స్ దాకా విలన్స్ ..అసలు హీరో ఎవరనేది తెలియదు... దాంతో ఇలాంటి కథలు చూసిన ప్రేక్షకుడుకి మాత్రం మొదటి రీలుకే రిజల్ట్ అర్దమైపోతుంది.


రెడీ ఓకే

రెడీ ఓకే

సెకండాఫ్ రెడీ ఫార్మెట్ లో వెళ్లారు ఓకే... కానీ రెడీలో చివరి ఇరవై నిముషాలు...నిలబెట్టి బ్లాక్ బస్టర్ చేసింది. .బ్రహ్మానందం కామెడీ. అలాంటి మ్యాజిక్ ఏమీ లేదుఅల్లు అర్జున్ కేనా

అల్లు అర్జున్ కేనా

అల్లు అర్జున్ కు రాసుకున్న కథ అని చెప్పారు. ఇంత పరమ రొటీన్ కథను అల్లు అర్జున్ నిజంగా చేస్తాడా అనే సందేహం చూస్తూంటే మనకు వస్తుంది.పవర్ ఫుల్ విలన్ ఏడీ

పవర్ ఫుల్ విలన్ ఏడీ

హీరో సిక్స్ ప్యాక్ తో తిరుగుతూంటే..అతనికి తగ్గ పవర్ ఫుల్ విలన్ కనపడడు. రామ్ లాంటి హీరోకు మైండ్ గేమ్ లు కావాలి కానీ సునీల్ లాంటి సిక్స్ ప్యాక్ హీరో కు కూడా మైండ్ గేమ్ అని తనకు తోచినట్లు ఉంటే ఎలా..ఎమోషన్ ఏదీ

ఎమోషన్ ఏదీ

సినమాలో కామెడీ, ఫైట్స్, పాటలు అంటూ వరస పెట్టి వెళ్లిపోతూంటాయి. కానీ కనెక్ట్ అయ్యే మెయిన్ ఏమోషన్ ఎక్కడా కనపడదు.బ్రహ్మీ , సప్తగిరి,పోసాని

బ్రహ్మీ , సప్తగిరి,పోసాని

ఉన్నంతలో బ్రహ్మానందం, సప్తగిరి కామెడీ నే బాగున్నాయి. సునీల్ కామెడీ చేయలేదు. చేసిన చోట్ల పండలేదు.పోసాని...బ్లాక్ బెర్రీ కామెడీ కూడా బాగానే పండింది.టెక్నికల్ గా

టెక్నికల్ గా

సినిమా కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కంటికి ఇంపుగా ఉన్నాయి. పాటలు అద్బుతం కాదు కానీ రెండు బాగున్నాయి. క్యాచీ ట్యూన్స్ తో. ఎడిటింగ్ ఎంత షార్ప్ చేసారనుకున్నా...కథలో లాగ్ ఉంది...దాన్ని ఏం చెయ్యలేం.దర్శకుడు, నిర్మాత

దర్శకుడు, నిర్మాత

దర్శకుడుగా వాసు వర్మ...ఈ అవకాసాన్ని వినియోగించుకోలేకపోయాడు. తను బెస్ట్ అని చెప్పే కథ విభాగంలోనే బోల్తా పడ్డారు. దిల్ రాజు మాత్రం ఎక్కడా రాజీ పడని నిర్మాణ విలువలతో సినిమాని రూపొందించారు.ఓకే

ఓకే

హీరోగా సునీల్ ..కామెడీ కలగిపిన పాత్రలు చేస్తే బాగుంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. హీరోయిన్స్ లో డింపుల్ చోపడే బాగా చేసింది. నిక్కి గల్రాని..తెలుగులో కష్టం అనిపించేటట్లు ఉంది...అతి మేకప్ తో


ఎవరెవరు

ఎవరెవరు

నటీనటులు: సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితరులు.
దర్శకత్వం: స్క్రీన్‌ప్లే - వాసు వర్మ .
నిర్మాత: రాజు .
సహ నిర్మాతలు: శిరీష్ , లక్ష్మణ్ .
ఫోటోగ్రఫీ: చోటా కె. నాయుడు .
ఎడిటర్: గౌతం రాజు
సంగీతం: దినేష్
కథ: వెంకటేశ్వర యూనిట్
ఫైట్ మాస్టర్ : అనల్ అరసు.
ఆర్ట్ డైరెక్టర్: ఎస్. రవీందర్
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
విడుదల తేదీ: 19-02-2016.
ఫైనల్ గా... సునీల్ ..సిక్స్ ప్యాక్ తో కన్నా కామెడీ ప్యాక్ తో వస్తే ఉన్నంతలో అతని ప్రేక్షకులు సేఫ్ అవుతారు.

English summary
Sunil much expected film “Krishnashtami” released today with divide talk. Directed by Vasu Varma of “Josh” fame is all set to hit the big screens on Feb. 19th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu