»   » మహేష్ బాబును కిడ్నాప్ చేయాలని....(సూపర్ స్టార్ కిడ్నాప్ రివ్యూ)

మహేష్ బాబును కిడ్నాప్ చేయాలని....(సూపర్ స్టార్ కిడ్నాప్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
హైదరాబాద్: ఎ.సత్తిబాబు సమర్పణలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మాతగా రూపొందిన చిత్రం 'సూపర్ స్టార్ కిడ్నాప్'. నందు, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ నటీనటులు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే కథతో ఈ సినిమా సాగుతుంది.

కథ విషయానికొస్తే...
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ కుమారుడు జై(ఆదర్ష్ బాలకృష్ణ), ఖుషి సినిమా చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చిన భూపాల్(భూపాల్), తను ప్రేమించిన అమ్మాయిని(పూనం కౌర్) దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న నందు(నందు).... తమ తమ ఇబ్బందుల నుండి బయట పడటానికి రూ. 50 లక్షల కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది తెరపై చూడాల్సిందే.

 Super Star Kidnap movie Review, Rating

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే...
ఆదర్శ్ బాలకృష్ణ డ్రగ్స్‌కి అలవాటు పడిన నిర్మాత కొడుకుగా తనదైన నటన కనబరిచాడు. నిజాయితీగల ప్రేమికుడి పాత్రలో నందు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డైరెక్టర్ కావాలని కలలుకనే వ్యక్తి పాత్రలో భూపాల్ బాగా నటించాడు. పూనమ్ పాండే రోల్ చిన్నదే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. లేడీ డాన్ ఫరా ఖాన్ పాత్రలో శ్రద్ధా దాస్ సర్‌ప్రైజ్ చేసింది. వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వా లేదు. తాగుబోతు రమేష్, పోసాని కృష్ణ మురళి వారి వారి పాత్రల మేరకు నటించారు. అల్లరి నరేష్, నాని, మంచు మనోజ్, తనీష్ అతిథి పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ అతిథి పాత్రలు సినిమాకు ప్లస్సయ్యాయి.

టెక్నికల్ అంశాల పరంగా...
సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ సినిమా ప్లస్సయింది. సెకండాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుడనిపిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

దర్శకుడు పనితీరు గురించి మాట్లాడుకుంటే స్క్రిప్టు వర్క్ పక్కాగా చేయాల్సింది. ఇలాంటి క్రైం, కామెడీతో సాగే ఇలాంటి కథలకు ట్విస్టులు చాలా కీలకం. అవి సినిమాలో చాలా తక్కువ ఉన్నాయి. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే బానే ఉన్నప్పటికీ సెకండాఫ్ స్లోగా, సాగదీసినట్లు ఉంది.

ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే....జస్ట్ ఓకే అనే విధంగా ఉంది.

English summary
Check out Super Star Kidnap movie Review, Rating.
Please Wait while comments are loading...