twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సత్యం శివం సూరి

    By Staff
    |

    Suri
    -జలపతి గూడెల్లి

    చక్రవర్తి కొత్త సినిమా సూరిని చూస్తుంటే ఒక్కసారి రాంగోపాల్‌ వర్మ చిత్రాలన్నీ కళ్ళముందు కనిపిస్తాయి. ముఖ్యంగా గాయం, శివ, సత్య చిత్రాల్లోని దృశ్యాలు సాక్షాత్కారిస్తాయి. వర్మ స్కూల్‌ లో ఓనమాలు దిద్దుకున్న చక్రవర్తి స్వయంగా ఈ చిత్రకథ అందించడం విశేషం. అందుకే పాపం అన్నీ సీన్స్‌ వర్మ సినిమాల్లో లాగా ఉన్నాయి. వర్మ చిత్రాలకు ఎడిటర్‌ గా పనిచేసి మూడు నందులను సంపాదించుకున్న శంకర్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కొత్తగా ఏదో చూపించడం ఎందుకు దండగ అని గురువుగారి స్టైల్లోనే హాయిగా తీసాడీ చిత్రాన్ని. కథ పాతదే. అరిగిపోయిన రికార్డు. దాదాల చేతిలో చిక్కుకున్న ఓ ప్రేమజంట కథ.

    సూరి(చక్రవర్తి) పేరుమోసిన దాదా రాందాస్‌ కొడుకు. కానీ సూరికి ఈ గుండాగిరీ, కొట్టుకోవడాలు నచ్చవు. అందుకనీ తండ్రికి దూరంగా ఉంటూ ఇంజనీరింగ్‌ చదువుకుంటాడు. గాయత్రి(ప్రియాంక)ని చూసి ప్రేమలో పడుతాడు. కాసేపు అలకలు, తిరిగి కలుసకోవడాలు, పాటలు పాడుకోవడాలు జరిగాక అసలు నిజం తెలుస్తుంది. సూరి ఓ గుండా కొడుకని. సో అక్కడ్నుంచి ప్రాబ్లెమ్‌ మొదలవుతుంది వీరికి. గాయత్రి తండ్రి ఓ సినిమా థియేటర్‌ మేనేజర్‌. ఆయనకు ఇలాంటివి నచ్చవు. సూరి అంటే అసహ్యం. వీరిని వదిలి వెళ్ళమని సూరి తండ్రి రాందాస్‌ బెదరిస్తాడు.

    మరోవైపు రాందాస్‌ వ్యతిరేక గ్యాంగ్‌ పాండు గ్యాంగ్‌ సూరిని చంపి రాందాస్‌ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటుంది. అందుకోసం ముందు గాయత్రిని చంపాలని ప్లాన్‌ చేస్తారు. హీరో సూరి వచ్చి వీరిని కాపాడి పాండును దెబ్బతీస్తాడు. కానీ చంపడు. ''ఎందుకురా ఒకర్నొకరు చంపుకుంటారు. నీకు చేతకాదు. మా అయ్యకు చేతకాదు. కానీ మిగతా వాళ్ల ప్రాణాల్ని తీస్తారు. దమ్ముంటే నాతో ఢీకొనండి'' అంటూ సూరి పాండును వదిలేస్తాడు. మనందరం సీట్లోనుంచి లేవాలి.

    ఒక సినిమా జర్నలిస్ట్‌ మాటల్లో చెప్పాలంటే ఇది సత్యం శివం సూరి. అంటే సత్య, శివలను కలిపి తీసిన ఈ చిత్రమని ఆమె అభిప్రాయం. నిజంగానే ఈ మాత్రం కథకు చివర్లో ఎటర్నల్‌ ట్రూత్స్‌ పలికించడం ఎందుకో తెలియదు. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ, విద్యాసాగర్‌ సంగీతం రెండే చెప్పుకోదగ్గ అంశాలు. ఒక్క పాట మినహా అన్ని పాటలు బావున్నాయి. పిక్చరైజేషన్‌ కూడా చాలా బావుంది. ఇక చక్రవర్తి నటన షరా మామూలే. కొత్త హీరోయిన్‌ ప్రియాంక ఫర్వాలేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X