For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ‘గ్యాంగ్’ రివ్యూ: సూర్య నుండి ఇలాంటి సినిమా ఎక్స్‌‌పెక్ట్ చేయలేదు!

  By Bojja Kumar
  |

  Rating:
  2.0/5
  Star Cast: సూర్య, కీర్తి సురేష్, కార్తీక్, రమ్యకృష్ణ
  Director: విఘ్నేష్ శివన్

  సూర్య ‘గ్యాంగ్’ మూవీ రివ్యూ..!

  హీరో సూర్య అంటే మనకు వెండి తెరపై పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రే గుర్తుకు వస్తుంది. 'సింగం' 1, 2, 3 ఇలా ఆయన నటించిన మూడూ సినిమాల్లో సూర్య పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. సూర్య తాజాగా 'గ్యాంగ్' సినిమా ద్వారా సంక్రాంతి బరిలో దూకారు. గత సినిమాల్లో పోలీసుగా నటించిన ఆయన ఈ చిత్రంలో డిపార్టుమెంటునే ముప్పతిప్పలు పెట్టించే కేడీ పాత్ర పోషించారు. 2013లో బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన 'స్పెషల్ 26' చిత్రం ఆధారంగా 'గ్యాంగ్' రూపొందింది. మరి నాలుగేళ్ల క్రితం స్టోరీ ఇప్పుడు వర్కౌట్ అయిందా? అసలు అయ్యే అవకాశం ఉందా? నకిలీ సీబీఐ ఆఫీసర్‌గా సూర్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో రివ్యూలో చూద్దాం.

  కథలోకి వెళితే...

  తిలక్ (సూర్య), బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా, నకిలీ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి రైడ్స్ చేస్తూ అవినీతి పరులకు వద్ద ఉండే బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అవినీతి సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీరి ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక్) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు? అనేది తెరపై చూడాల్సిందే.

  సూర్య పెర్ఫార్మెన్స్

  నకిలీ సీబీఐ ఆఫీసర్ పాత్రలో సూర్య ఆకట్టుకునే నటన ప్రదర్శించాడు. అయితే ఇది కన్నింగ్, డూప్లికేట్ పాత్ర కావడంతో పవర్ ఫుల్ డైలాగులు, ఎమోషన్స్ లాంటివి చూపించే అవకాశం లేకుండా పోయింది. అయితే పాత్రకు తగిన విధంగా సూర్య పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అనేలా ఉంది.

  రమ్యకృష్ణ

  సినిమాలో సూర్య తర్వాత గ్యాంగ్‌లో ముఖ్య సభ్యురాలిగా రమ్యకృష్ణ నటించింది. కుటుంబాన్ని నడిపించే అమాయకమైన ఇల్లాలుగా, సూర్యతో పాటు కన్నింగ్ పనులు చేసే కేడీగా ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది.

  పాపం కీర్తి సురేష్

  ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్....హీరో లవ్ ఇంట్రస్టుగా నటించింది. వాస్తవానికి సినిమాలో ఆమె పాత్ర అవసరం కూడా లేదు. ఏదో హీరోకు లవ్ సీన్లు ఉండాలి, సాంగులు ఉండాలి కాబట్టి ఆమె పాత్రను ఇరికించారు. పరిమితమైన పాత్ర కావడంతో పాపం నటనకు కూడా అవకాశం లేకుండా పోయింది.

  పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటుడు కార్తీక్

  నకిలీ సీబీఐ ‘గ్యాంగ్' ఆటకట్టించడానికి ప్రయత్నించే పవర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్ శివ శంకర్ పాత్రలో సీనియర్ నటుడు కార్తీక్ అదరగొట్టాడు. ఇక ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఓ సీన్లో బ్రహ్మానందం ఇలా కనిపించి అలా మాయం అవుతాడు. సినిమా ఎడిటింగులో బ్రహ్మీ ఒక సీన్ కాస్త అర సీన్ అయిపోయింది.

  దర్శకుడి పని తీరు

  దర్శకుడు విఘ్నేష్ శివన్ హిందీలో హిట్టయిన ‘స్పెషల్ 26' కథనే సౌత్ నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసాడు. అయితే ప్రదేశాలు, ప్రాంతాలు మార్చడం తప్ప సినిమాలో అతడు చేసిన మార్పు అయితే పెద్దగా ఏమీ లేదు. సినిమాలో తనదైన ప్రత్యేకత చూపించడంలో విపలం అయ్యాడు.

  స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు

  ‘గ్యాంగ్' సినిమా స్క్రీన్ ప్లే అస్సలు ఆకట్టుకోలేదు. ఇలాంటి సినిమాల్లో ఉత్కంఠ భరితమైన స్క్రీన్ ప్లే ఉండాలి. సీట్లో నుండి లేస్తే కనెక్షన్ ఎక్కడ మిస్సవుతామో? అనే ఒక ఆతృత ప్రేక్షకుడికి కలగాలి. ఇలాంటి ఎమోషన్ ఆడియన్స్‌లో రేకెత్తించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.

  టెక్నికల్ అంశాలు

  సినిమా టెక్నికల్ అంశాల పరంగా కూడా అంత గొప్పగా ఏమీ అనిపించదు. అనిరుధ్ అందించిన సంగీతం వహ్వా అనే స్థాయిలో అయితే లేదు. ఒక రెండు పాటలు సూర్య అభిమానులకు నచ్చుతాయి. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ ఎబో యావరేజ్. ఇతర టెక్నికల్ విభాగాలు కూడా ఎక్స్ ట్రార్డినరీ రేంజిలో కాకుండా ఆర్డినరీ రేంజిలోనే పనితీరు కనబరిచాయి.

  ఆ ఫీలింగ్ కలగదు

  అవినీతి మూలంగా ఉద్యోగం రాకుండా నష్టపోయిన ఒక వ్యక్తి.... అవినీతి పరులను దోచేయాని ప్లాన్ చేయడం.... తనలా ఎవరూ కాకుండా వారికి చదువు విషయంలో, ఉద్యోగాలు సంపాదించే విషయంలో డబ్బు సాయం చేయడం, చట్టపరంగా ఇది తప్పే అయినా.... హ్యూమన్ యాంగిల్‌లో ఇది రైటే అని భావించి వారు కూడా ‘గ్యాంగ్' డబ్బుదోచేయడంలో సహాయం చేయడం.... ఇలాంటి కథలు సౌత్‌లో ఇప్పటి వరకు చాలా వచ్చాయి. అందుకే ప్రేక్షకులకు కొత్త కథ అనే ఫీలింగ్ కలగదు. ఇక ‘స్పెషల్ 26' ఆల్రెడీ చూసిన వారికైతే సీట్లో కూర్చోవడం ఇంకా కష్టం

  ఫస్టాఫ్

  సినిమా ఫస్టాఫ్ అంతా అవినీతి తిమింగళాలను టార్గెట్ చేయడం, వారి వద్ద నుండి డబ్బు కొట్టేయడం లాంటి సీన్లతో పాటు మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ సీన్లతో సరదాగా సాగుతుంది.

  సెకండాఫ్
  సెకండాఫ్‌లో తమను పట్టుకోవడానికి పోలీసులు వేసిన ప్లాన్‌ను తిప్పికొట్టడానికి హీరో అండ్ గ్యాంగ్ ప్రయత్నించడం, వారికే మస్కాకొట్టి ఊడాయించడం లాంటి కౌంటర్ సీన్లుతో సినిమా రోటీన్‌గా సాగుతుంది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ‘గ్యాంగ్' విఫలమైంది. మూవీ ఫెస్టివల్‌గా పేరు గాంచిన సంక్రాంతికి అభిమానులు కూడా సూర్య నుండి ఇలాంటి రోటీన్, ఆర్డినరీ సినిమా ఊహించి ఉండరు. 2013లో ‘స్పెషల్ 26’ వచ్చిన వెంటనే సూర్య ఈ సినిమా చేసి ఉంటే వర్కౌట్ అయుండేదేమో? కానీ ఇప్పుడు ఈ స్టోరీ, కాన్సెప్టు చాలా ఓల్డ్ అవ్వడంతో ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమే.

  గ్యాంగ్

  గ్యాంగ్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.ఇ. జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. తెలుగులో ‘యువి క్రియేషన్స్' వారు ఈచిత్రాన్ని విడుదల చేశారు.

  యాక్టర్స్, టెక్నీషియన్స్

  తారాగణం: సూర్య, కీర్తి సురేష్, కార్తీక్, రమ్యకృష్ణ, ఆర్జే బాలాజీ, నంద, కలైయరసన్, యోగి బాబు, సెంథిల్, తంబి రామయ్య తదితరులు.

  దర్శకత్వం: విఘ్నేష్ శివన్
  నిర్మాత: జ్ఞానవేల్ రాజా
  సంగీతం: అనిరుధ్
  సినిమాటోగ్రఫీ: దినేష్ క్రిష్ణన్

  English summary
  Surya 'Gang' movie review. Directed by Vignesh Shivan and produced by K. E. Gnanavel Raja. The film is an adaptation of the 2013 Hindi film Special 26. The film stars Suriya and Keerthy Suresh in the lead roles, with a supporting cast including Karthik, Ramya Krishnan, Senthil and Suresh Chandra Menon.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more