For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జో బోర్ వహీ... ( 'సికిందర్‌' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5
  --సూర్య ప్రకాష్ జోశ్యుల

  చిన్న స్టోరీ లైన్ తీసుకుని దాన్ని తన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్దాడని తమిళ దర్శకుడు లింగు స్వామికి పేరు ఉంది. అలాగే ఈ చిత్రానికి తీసుకున్నది కూడా థిన్ లైనే... అయితే అనుకున్నట్లుగా మ్యాజిక్ జరగలేదు...సినిమా చివరిదాకా చూసిన వాడే సికిందర్ అనేటట్లు తయారైంది. కథలో మినిమం కాంప్లిక్ట్ లేకుండా కథనం నడపటం, విలన్ ఎవరో హీరోకి చివరి వరకూ తెలియకపోవటం వంటి అంశాలతో యాక్షన్ కి స్కోప్ లోకుండా తయారైందీ యాక్షన్ చిత్రం. సూర్య వంటి స్టార్, సమంత గ్లామర్, టీజర్స్ ఓపినింగ్స్ వరకూ తేగలిగాయి కానీ..అంతకు తగ్గ మెటీరియల్ లేకపోవటంతో విసుగ్గా అనిపిస్తుంది.

  మాఫియా డాన్ రాజు భాయ్(సూర్య)ని వెతుక్కుంటా అతని తమ్ముడు కృష్ణ(సూర్య) వైజాగ్ నుంచి ముంబైకు వస్తాడు. అతన్ని అన్వేషించే క్రమంలో రాజు భాయ్...ముంబైలో మాఫియాని శాసించిన జీవితం. ప్రాణ స్నేహితుడు చందు(విద్యుల్ జమాల్) తో ఉన్న అనుభంధం,కమీషినర్ కుమార్తె సమంతతో ప్రేమయాణం వంటివి తెలుస్తాయి. అంతేకాదు రాజు భాయ్, చందు కలిసి ...ఇమ్రాన్(మనోజ్ బాప్ పేయ్) అనే మరో పెద్ద మాఫియా డాన్ చేతిలో చనిపోయాడని తెలుస్తోంది. ఈ లోగా రాజు భాయ్ సోదరుడు వచ్చి అతని గురించి ఎక్వైరీ చేస్తున్నాడని తెలుసుకున్న రాజుభాయ్ శత్రువులు అతన్ని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు.ఈ లోగా ఓ ట్విస్ట్ వచ్చి కథని మలుపు తిప్పుతుంది. ఏమిటా ట్విస్ట్... తన అన్నని చంపిన వారిపై కృష్ణ పగ తీర్చుకున్నాడా...సమంత...లవ్ స్టోరీ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  స్నేహితుడు మరణానికి పగ తీర్చుకునే కథతో సూర్య వచ్చారు. అయితే ఆ మరణానికి కారణమైన వారిని వెతకటం లోనే స్క్రీన్ టైమ్ మొత్తం సరిపోయింది. అలాగే హీరోనే దందాపు చేసే మాఫియా డాన్...అతని స్నేహితుడు కూడా అలాంటి వాడే...అయినప్పుడు అతను తన స్నేహితుడు మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి బయిలుదేరినప్పుడు ప్రేక్షకులు అతనితో ఐడెంటిటీ అయ్యి..అతని ప్రక్క ఉండటం కష్టమనే విషయం కథ రాసుకున్న దర్శకుడు మర్చిపోయారు. అలాగే ఇంట్రవెల్ ట్విస్ట్ ని నమ్ముకున్నారే కానీ విలన్ ఎవరో హీరోకి ప్రీ క్లైమాక్స్ దాకా తెలియకపోతే ఆ పాత్ర ప్యాసివ్ పాత్రగా మారి యాక్షన్ లేకుండాపోతుందనే సంగతి పట్టించుకోలేదు. ఇక హీరోయిన్ తండ్రి పాత్రను పోలీస్ కమీషినర్ అంటూ భారీ బిల్డప్ తో చూపించారు కానీ ఆ తర్వాత దాన్ని ఏకంగా మర్చిపోయారు. ఇలా తప్పుల తడకగా మారిన స్క్రీన్ ప్లేతో బోర్ సినిమాగా మారింది. ఇక ఎంటర్టైన్మెంట్ అంటారా శూన్యం.

  మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

  హైలెట్

  హైలెట్

  సినిమా హైలెట్ లలో కెమెరా వర్క్ చెప్పుకోవాలి. సంతోష్ శివన్...తనదైన మార్కు కలర్స్ స్కీమ్ లతో బాగా చేసారు. ఏమీలేకపోయినా చివరి వరకూ అయినా కూర్చోగలిగామంటే కెమెరా వర్క్ కారణమని చెప్పుకోవాలి.

  పెద్ద మైనస్

  పెద్ద మైనస్

  ఈ సినిమాకు పెద్ద మైనస్.. రెండు గంటల యాభై నిముషాల లెంగ్త్. ఈ రివేంజ్ సినిమాకు అంత లెంగ్త్ అనవసరం అనిపిస్తుంది. దర్శకుడు...ఎడిటర్ తో కలిసి మరింత ట్రిమ్ చేసి ఉంటే కొద్దిగా ఫలితం బాగుండేదేమో. అలాగే కామెడీ అనేది మచ్చుకైనా లేకపోవటం కూడా చాలా ఇబ్బంది కలిగించే అంశం.

  సూర్య

  సూర్య

  సూర్య ఎప్పటిలాగే ఎనర్జీతో ప్రతీ ఫ్రేమ్ నీ పండించే ప్రయత్నమైతే చేసాడు. అలాగే మాఫియా డాన్ గా మ్యానరిజంతో ఆకట్టుకోవాలనీ అనుకున్నాడు. కానీ అతని కష్టానికి కథ కలిసిరాలేదు.

  సమంత

  సమంత

  లింగు స్వామి సినిమాల్లో హీరోయిన్స్ క్యారక్టరైజేషన్ బాగా డిజైన్ చేస్తారు. కానీ ఈ చిత్రంలో అనవసరం అనుకున్నట్లున్నారు. అలాగే తెలుగులోనూ మార్కెట్ కోసం అని సమంతను తీసుకున్నారు కానీ ఆమె డేట్స్ తక్కువ తీసుకున్నారో ఏమో కానీ సెకండాఫ్ లో అసలు ఆమె పెద్దగా కనపడదు. కనిపడిందంటే ఓ పాటేసుకునే పరిస్ధితి.

  బ్రహ్మానందం

  బ్రహ్మానందం

  ఈ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడని ప్రోమోలలో దుమ్ము దులిపారు. అయితే ఆయన ఉన్నది ఒక్క సీనే. అదీ ప్రాధాన్యత లేనిదే. అలాగే కామెడీ కూడా పండిని సీనే.

  దర్శకుడుగా...

  దర్శకుడుగా...

  దర్సకుడుగా లింగు స్వామి తనదైన స్టైలిష్ టేకింగ్ తో ఫ్రేమ్ లను బాగానే డిజైన్ చేసాడు. అయితే కథ,కథనాల రచనలోనే పొరపాటు దొర్లింది.

  సంగీతం

  సంగీతం

  రీరికార్డింగ్, రెండు పాటలు బాగా ఇచ్చారు యువన్ శంకర్ రాజా. ముఖ్యంగా టైటిల్ సాంగ్, ఏక్ దో తీన్ అంటే సాగే సెకండాఫ్ లో వచ్చే పాట బాగున్నాయి. వాటి కొరియోగ్రఫీ సైతం బాగున్నాయి.

  ఎవవెరరు

  ఎవవెరరు  సంస్థ: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌
  నటీనటులు: సూర్య, సమంత, విద్యుత్‌ జమాల్‌, బ్రహ్మానందం, మనోజ్‌బాజ్‌పాయ్‌, మురళీశర్మ తదితరులు.
  సంగీతం: యువన్‌ శంకర్‌రాజా
  ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
  CBFC రేటింగ్: U
  రన్ టైమ్: 170 నిముషాలు
  నిర్మాతలు: లగడపాటి శిరీష, శ్రీధర్‌
  సమర్పణ : యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లింగుస్వామి
  విడుదల తేది: 15 ఆగస్టు,2014.

  English summary
  Dubbed version of Surya’s Anjaan...telugu titeld Sikindar released today and got negitive talk. producer Lagadapati sreedhar bought this into telugu which is directed by Lingu swamy . Samantha beside Surya stand for a absoulte telugu movie feel with her presence in the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X