»   » సూర్య ‘సింగం 2’ సారీ.... ‘సింగం3’(రివ్యూ)

సూర్య ‘సింగం 2’ సారీ.... ‘సింగం3’(రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5
సాధారణంగా కొన్ని సినిమాలు చూస్తూంటే ఎక్కడో ఇంతకు ముందు చూసిన ఫీలింగ్ వస్తూంటుంది. అయితే అదే హీరోతో అదే దర్శకుడుతో చేసిన సినిమా గుర్తుకు వస్తుందా...వస్తే అదే సింగం 3 అవుతుంది. అదేంటో 'సింగం3' సినిమా చూస్తూంటే..'సింగం2' మరోసారి చూసినట్లు అనిపిస్తుంది. అందుకు కారణం 'సింగం2'లోని సెటప్ లాంటిదే యాజటీజ్.. విదేశాల్లో విలన్, అదే తరహాలో ఆవేశంగా ఎప్పుడు మీద పడి కొట్టేద్దామా అన్నంత ఎమోషన్ గా తిరిగే హీరో కథే 'సింగం 3'కూడా ఉండటం కావచ్చు.

తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ సీరీస్ సింగం. రేసీ స్క్రీన్ ప్లే, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఓ బ్రాండ్ గా మారిందంటే అతిశయోక్తి కాదు. ఈ సీరీస్ లో ఇప్పటికే రెండు భాగాలు ఘనవిజయం సాధించగా.., ఇప్పుడు మూడో భాగం ఈ రోజు రిలీజ్ అయ్యింది.

అఫ్ కోర్స్ తెలుగు వెర్షన్ ఇక్కడ అవలేదనుకోండి. నిజానికి చాలా రోజుల క్రితమే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న సింగం 3, రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ముహూర్తం ఫిక్స్ చేసి వదిలారు.

సూర్య ఫ్యామిలీ బ్యానర్ స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన హరి దర్శకుడు. ఇదే సీరీస్ లో రిలీజ్ అయిన గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్ తో మరింత స్టైలిష్ గా సింగం 3ని తెరకెక్కించారు. అయితే సింగం మొదట చిత్రం యముడులో ఉన్నంత బ్యూటీ ఈ రెండు చిత్రాల్లోనూ కనిపించదు పొరపాటున కూడా. ఇంతకీ ఈ చిత్రం కథేంటి, సూర్య సింగంలా మరోసారి కలెక్షన్ల వేట కొనసాగిస్తాడా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

 ఈ సారి మర్డర్ కేసు పనిపై

ఈ సారి మర్డర్ కేసు పనిపై

ఏపీ కేడర్ కు చెందిన నరసింహ (సూర్య) సీబీఐ కు ప్రమోట్ అయ్యి...మంగుళూరు కు ఓ ఎస్సైన్ మెంట్ పనిమీద డెప్యుటేషన్ మీద వెళ్తాడు . అలా నరసింహం ను పిలిపించేది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు..కర్ణాటక హోం మంత్రి (శరత్ బాబు) . ఇంతకీ అంత పనేంటి మన నరసింహంతో అంటారా... మంగుళూరు సిటీ పోలీస్ కమీషనర్ మర్డర్ అవుతారు. ఆ కేసుని ఇన్విస్టిగేట్ చేయటానికి అన్నమాట.

 క్లోజ్ చేద్దామనుకుంటే..

క్లోజ్ చేద్దామనుకుంటే..

ఈ ఇన్విస్టిగేషన్ లో సూర్య తెలుసుకునేది ఏమిటీ అంటే... లోకల్ మాఫియా డాన్ ఎఎస్ రెడ్డి (శరద్ సక్సేనా) పోలీస్ కమీషనర్ ని మర్డర్ చేసారని తెలుస్తుంది. ఈ కేసుని తనదైన శైలిలో విచారించి క్లోజ్ చేద్దామనుకునే సమయంలో అతనికి కొన్ని ఊహించని నిజాలుతెలుస్తాయి. కమీషనర్ హత్య కు మించిన పెద్ద క్రైమ్ అందులో ఇన్వాల్స్ అయ్యిందని గ్రహిస్తాడు.

 పెద్ద మాఫియా నెట్ వర్క్

పెద్ద మాఫియా నెట్ వర్క్

మరింతగా తవ్వుకుంటూ వెళ్తే...మైనింగ్ కు చెందిన పెద్ద వ్యాపారస్తుడు విఠల్ ప్రసాద్ (అనూప్ సింగ్) ఈ హత్య వెనుక ఉన్నాడని రివీల్ అవుతుంది. అతను ఆస్ట్రేలియాలో ఉంటూంటాడు. అతను ఓ పెద్ద మెడికల్ వేస్ట్ కు చెందిన మాఫియా నెట్ వర్క్ ని ఆపరేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. అది తెలుసుకున్న నరసింహ పూర్తి యాక్షన్ లోకి దిగుతాడు.

 ఆస్ట్రేలియా వెళ్లి మరీ..

ఆస్ట్రేలియా వెళ్లి మరీ..

అక్కడనుంచి ఈ మాఫియాను అంతమొందించటానికి మన హీరో సూర్య కంకణం కట్టుకుంటాడు. ఈ కేసును పూర్తి చేయడం తన పర్సనల్ మిషన్‌గా పెట్టుకున్న నరసింహ ఏం చేశాడు? ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍పై ఎలా పోరాడాడనే విషయమై సెకండాఫ్ రన్ అవుతుంది. అసలు అంత పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా కి లోకల్ గా ఉండే మంగళూరు మాఫియా కి మధ్య కనెక్షన్ ఏమిటి... విఠల్ ని ఎలా శిక్షించాడు. ఈ కథలో అగ్ని (శృతి హాసన్) ఎవరు? నరసింహ, తన భార్య కావ్య (అనుష్క)కు దూరంగా ఉన్నట్లు ఎందుకు నటిస్తాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 అక్కడ నుంచే మొదలు

అక్కడ నుంచే మొదలు

ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు వరకూ పెద్దగా కథ,సీన్స్ కదలవు. అక్కడ నుంచే థ్రిల్‌ కలిగించే సీన్స్ మొదలవుతాయి. దాంతో ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్స్ అలరిస్తాయి. సెకండాఫ్ ప్రారంభంలో సీన్స్ పరుగులు పెట్టించాడు దర్శకుడు. అలాగే సిడ్నీ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ సీన్స్ ఆకట్టుకుంటాయి.

 బోరింగ్ ఉండదు కానీ లౌడ్

బోరింగ్ ఉండదు కానీ లౌడ్

ఈ సినిమా లో స్పెషాలిటీ ఏమిటంటే సూపర్ ఫాస్ట్ గా నడిచే స్క్రీన్ ప్లే. ఏం జరుగుతోందో అర్దమయ్యే లోగా చాలా సీన్స్ గడిచిపోతాయి. ఎక్కడా లాగ్ కానీ, చిన్న బోరింగ్ మూవ్ మెంట్ కానీ ఉండదు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్స్, చాలా లౌడ్ గా ఉండే బ్యాగ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ ఆడియన్స్ కు కాస్త ఇబ్బంది పెడతాయి. అయితే సింగం సీరిస్ నిలబెట్టాలంటే ఆ మాత్రం ఉండాలనకున్నట్లున్నాడు దర్శకుడు హరి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.

 ఎయిర్ పోర్ట్ చేసింది

ఎయిర్ పోర్ట్ చేసింది

మొదటి రెండు భాగాల్లో ముఖ్యంగా మొదటి భాగంలో దర్శకుడు ఎక్కువగా బాగా ఛార్జ్ చేసిన ఎలివేషన్ సీన్స్ ఉండేటట్లు చూసుకుని సక్సెస్ అయ్యాడు. కానీ మూడో పార్ట్ కు వచ్చేసరికి కేవలం కొన్ని సీన్స్ లోనే ఆ ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఎయిర్ పోర్ట్ లో చేసిన సీన్ చాలా హైలెట్ గా నిలిచింది. ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఫస్టాఫ్ కన్నా సెకండాప్ పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించి గ్రిప్ ఈ సినిమాలో చూపించలేకపోయాడు.

ఆ సీన్స్ లేకుండా ఇంకా బాగుండేది

ఆ సీన్స్ లేకుండా ఇంకా బాగుండేది

ఇక కమిడియన్ సూర్ చేసిన కామెడీ సీన్స్ సినిమాకు స్పీడు బ్రేకర్స్ లాగ అనిపిస్తాయి. అనవసరంగా ఇరికించారే ఈ కామెడీ సీన్స్ అనిపిస్తాయి. యముడు - 1, యముడు -2 సినిమాల్లోలాగే ఇక్కడ కూడా సిట్యుయేషనల్ కామెడీని పండించే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాక కామెడీ సీన్స్ వచ్చినప్పుడల్లా బయిటకు వెల్లిపోవాలనిపిచింది.

 లావు బాగా ఉంది...

లావు బాగా ఉంది...

అంతేకాకుండా.. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్‌ కూడా కథలో ఇమడలేదు. దానికి తోడు అనుష్క మరీ లావుగా కనిపించింది. ఈ విషయంలో తాను ఇప్పటికైనా మేల్కొని పూర్తి స్దాయి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయినా ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. శ్రుతిహాసన్‌ది కేవలం గ్లామర్‌ డాల్ లాంటీ పాత్ర మాత్రమే. . ‘వైఫై..' పాట కోసం మాత్రమే శ్రుతిహాసన్‌ను తీసుకున్నారా.. అనిపిస్తుంది.

 కేవలం సూర్య కోసమే

కేవలం సూర్య కోసమే

కేవలం సూర్యని ఎలివేట్ చేయటానికి, ఆయనలోని యాక్షన్ స్టార్ ని మరోసారి చూపించటానికి మాత్రమే ఈ సినిమా తీశారా.. అనే డౌట్ వస్తుంది. మరోసారి పవర్ ఫుల్ పోలీసు పాత్రలో సూర్య దుమ్ము రేపారు. సూర్య గెటప్‌.. తను చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

 బాగున్నవి, బాగోలేనివి

బాగున్నవి, బాగోలేనివి

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలిస్తే..బోరింగ్ కామెడీ, ఎమోషన్ లేని యాక్షన్, అనుష్క సీన్స్ సినిమా టెంపోని క్రిందకు లాగే ప్రయత్నం చేసాయి. అలాగే అంత లౌడ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోతే మాస్ కు ఎక్కదనుకున్నారో ఏమో కానీ అదో ఇబ్బంది సినిమాకు.

 సినిమా టీమ్ వీళ్లే

సినిమా టీమ్ వీళ్లేసంస్థ: స్డూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌.
నటీనటుల: సూర్య, అనుష్క, శ్రుతిహాసన్‌, రాధిక, క్రిష్, సూరి, నీతూచంద్ర తదితరులు
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
ఛాయాగ్రహణం: ప్రియన్‌
కూర్పు: విటి విజయన్‌, టి.ఎస్‌.జయ్‌
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌
రచన.. దర్శకత్వం: హరి
విడుదల తేదీ: 09-02-2017

పైనల్ గా మరీ గొప్పగానూ లేదు, అలాగని చెత్తగానూ లేదు. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సింగం 3 నచ్చుతుంది. అలాగే సింగం 2 ని చూడనివారికి మరీ నచ్చుతుంది. మాస్ సెంటర్లను టార్గెట్ చేసిన ఈ చిత్రం అక్కడ బాగా వర్కవుట్ అయ్యేటట్లు కనపడుతోంది.

English summary
After several rounds of postponements due to various reasons, superstar Suriya’s S3, the third outing from the successful Singam franchise, is released today with average talk. Singam-3 is a non-stop action movie which may work for Suriya Fans.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu