Just In
- 8 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 9 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యాక్షన్....యాక్షన్ (‘సింగం' రివ్యూ)
----సూర్య ప్రకాష్ జోశ్యుల
ప్రస్తుతం అంతటా ట్రెండీగా మారిన సీక్వెల్స్ స్క్రీమ్ ని కంటిన్యూ చేస్తూ...హిట్ సినిమా 'యముడు' కి కొనసాగింపు గా 'సింగం'ని థియోటర్ లోకి దింపారు. అయితే ఫైట్స్ మీద పెట్టిన దృష్టి కథమీద పెట్టకపోవటంతో ఫైట్స్ కి ఫైట్స్ కి మధ్యే ప్రేక్షకుడు రిలీఫ్ వెతుక్కోవాల్సి వచ్చింది. మొదటి సినిమాలో ఉన్న కిక్ ఈ చిత్రంలో లేకపోయినా చూసినంతసేపూ ఎంగేజ్ చేస్తూ పోయింది. యాక్షన్ అభిమానులకు, సూర్య ఫ్యాన్స్ కు ఈ చిత్రం నచ్చుతుంది. లెంగ్తీ స్క్రీన్ ప్లే, రొటీన్ సీన్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం, అనుష్క గ్లామర్, విలన్ పూర్ క్యారెక్టరైజేషన్ మాత్రం నిరాశపరిచాయి.
'యముడు' చిత్రానికి క్లైమాక్స్ నుంచి మొదలయ్యే ఈ చిత్రంలో సూర్య ...నరసింహం గా అదే గెటప్ లో అంతకు మించిన పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడు. అయితే ఈ సారి కాకినాడ పోర్ట్ లో అక్రమ ఆయుధాలు రవాణా అవుతున్నాయని తెలిసి దానిని పట్టుకోవటానికి ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు నాటకమాడి..అక్కడ స్కూల్లో ఎన్.సి.సి ఇన్ ఛార్జ్ గా జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో అక్కడ ఆయుధాల స్మగ్లింగ్ కాదు జరుగుతోంది డ్రగ్స్ రవాణా అని తెలుస్తోంది. దానికి డాని (డానీ సపాని ) అనే డాన్ హెడ్ అని తెలుస్తోంది. కాకినాడ లో దీనికి సపోర్ట్ గా లోకల్ విలన్స్ భాయ్(ముఖేష్ రుషి) - త్యాగరాజు(రెహమాన్) సాయిం చేస్తూంటారు. ఈ విషయాలను నరసింహం ఎలా ఛేధించాడు...ఛాలెంజ్ చేసి మరీ..ఆఫ్రికా విలన్ ఎలా మట్టికరిపించాడు అనేది...తెరపై చూడాల్సిందే.
సీక్వెల్స్ వచ్చినప్పుడు హిట్ అయిన మొదటి సినిమాతో పోలిక తప్పని సరిగా వస్తుంది. మొదటి సినిమాకు ఏ మాత్రం తగ్గినా రుచించదు. ఇక అంజలి ఐటం సాంగ్ తో మొదలయ్యే ఈ సినిమాలో... హీరో వన్ మ్యాన్ షో లా తయారు చేసారు. మొదటి చిత్రం యముడులో ప్రకాష్ రాజ్,సూర్య మధ్య వచ్చే సీన్స్ సినిమాకు ప్రాణమై నిలిచాయి. అలాగే ఫస్టాఫ్ లో వచ్చే సూర్య ఉండే గ్రామీణులు అతనికి సపోర్ట్ ఇవ్వటం వంటివి హైలెట్ గా మారి సినిమాని ఎక్కడికో తీసుకువెళ్లాయి. అదే .. ఈ సీక్వెల్ లో మిస్సైంది. విలన్స్ ని ముగ్గురుని పెట్టారు...వారిలో మెయిన్ విలన్ కి, హీరో కి మధ్య పోరుని సరిగ్గా నడపలేకపోయారు. కేవలం క్లైమాక్స్ లో మాత్రమే..మెయిన్ విలన్ పై పోరాటం మొదలెట్టారు. అంతేగానీ మెయిన్ విలన్ ..హీరోకి ...ట్విస్ట్ లు ఇవ్వడం...వాటిని హీరో చిత్తు చేయటం వంటివి మిస్ చేసారు. దాంతో కేవలం చిత్రాన్ని పూర్తిగా ... ఫైట్స్ తో కథనం నింపాల్సి వచ్చింది.
దానికి తోడు హీరోయిన్స్ ఇద్దరు..అనుష్క,హన్సిక సినిమాలో కేవలం కనపడి వెళ్లిపోతారు..తప్ప కథలో పెద్దగా కలవలేదు. ముఖ్యంగా అనుష్క ని నిర్లక్ష్యం చేసారు. ఫస్టాఫ్ లో .. హైలెట్ గా నిలిచిన అనుష్క,సూర్య ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. హన్సికతో అలాంటి ట్రాక్ ట్రై చేసారు కానీ ఆ క్యూట్ నెస్ రాలేదు. రొమాంటిక్ ఏంగిల్ కూడా బాగా మిక్స్ చేస్తే బాగుండేది. అలాగే యముడు లో వివేక్ ..జమదగ్నిగా కామెడీనీ ఓ రేంజిలో పండించాడు. ఈ సీక్వెల్ లో ...సంతానం, వివేక్ ఉన్నా...పెద్దగా ఫలితం కామెడీ పండలేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా చెప్పుకోదగ్గ స్ధాయిలో లేదు. రీ రికార్డింగ్ మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ ..చాలా ట్రిమ్ చేయాలి...ముఖ్యంగా ఎడిటింగ్ ర్యాంప్ లు ఎక్కవ అవటం విసిగిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేసారు. డైలాగ్స్ కూడా చాలా చోట్ల పేలాయి.
మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

ఫస్ట్ హాఫ్ లో చాలా పాస్ట్ పెసెడ్ గా నడిచింది.. అయితే ఫస్టాఫ్ మొత్తం కథని సెటప్ చేయటానికే సరిపోయింది. దాంతో కొద్ది సేపు అసహనం అనిపించింది. అయితే ఈ లోగా దర్శకుడు ట్విస్ట్ తో కథని పరుగెత్తించే ప్రయత్నం చేసాడు.

ఇంటర్వెల్ ట్విస్ట్ థ్రిల్లింగ్ గా బాగుంది. కానీ సెకండాఫ్ చాలా ప్రెడిక్టిబుల్ గా నడిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ వీక్ గా ఉండటం యావరేజ్ గా మారింది.

ఎప్పటిలాగానే... సూర్య బ్రిలియెంట్ ఫెరఫార్మెన్స్ కనపరిచారు. యాక్షన్, కామెడీ, డాన్స్, రొమాన్స్ సీన్స్ లలు బాగా చేసారు.

సింగంలో ...అనుష్క కి అసలు స్కోప్ లేదు. అయితే ఆమె ఉన్న సీన్స్ అన్నీ జస్టిస్ చేసారు. ఉన్న సీన్స్ లు నాలుగు...సూర్యతో ..ఆమె కెమిస్ట్రీ బాగా పండింది. హన్సిక మాత్రం బాగా ఒళ్లు చేసింది.

ఈ సినిమాలో దర్శకుడు చేసిన పెద్ద పొరపాటు ఎక్కువ క్యారెక్టర్స్ ని పెట్టి గజిబిజి చెయ్యటమే.. హీరోయిన్స్ ఇద్దరు ఉంటారు. వారికి సరైన క్యారెక్టరైజేషన్స్ ఉండవు. విలన్స్ ముగ్గురు ఉంటారు. వాళ్లు ఎప్పుడూ హీరోని ఇరుకునే పెట్టే సాహసం చెయ్యరు. వస్తూంటారు..పోతూంటారు...కానీ సంఘటనలు సృష్టించరు. పక్కా ప్యాసివ్ గా హీరో పాత్ర తయారవ్వటానికి విలన్స్ యాక్టివ్ కావటం కారణం. ఈ ముగ్గురు విలన్స్ కలిసినా ... యముడులో ప్రకాష్ రాజ్ పాత్రకు సరిపడరు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ ... సినిమాలో బాగా రిచ్ గా ఉన్నాయి. టెక్నికలప్ గా బాగా సౌండ్ గానే ఉన్నాయి. కానీ దేవిశ్రీప్రసాద్ ఆడియోలో తన మార్క్ వేయలేకపోయాడు. పాటలు కిక్ ఇవ్వలేదు.

సినిమాకి మరో పెద్ద మైనస్ ..ప్రెడిక్టిబుల్ స్క్రీన్ ప్లే. తరువాత వచ్చే సీన్స్ ఏమిటో ముందే గెస్ చేసేయ్యగలుగుతూంటాం. కాసేపు వేగంగా వెళ్లిన సినిమా..ఆగుతుంది..మళ్లీ వేగంగా పరుగెడుతుంది..మళ్లీ ఆగుతుంది. ఇలా స్టాఫ్..రన్ టెక్నిక్ తో సాగుతూ కొన్ని సార్లు ప్రేక్షకులుకు సహన పరీక్ష పెడుతుంది.

అనుష్క, సూర్య పెయిర్ ని చూడటానికి థియోటర్ కి వెల్లినవారికి ఈ సినిమా నిరాసపరుస్తుంది.

సింగం సినిమా టిపికల్ హరి మార్క్ స్టైల్ సినిమా...చాలా రొటీన్ స్టోరీలైన్, రేసీ సీన్స్,అరుపులుతో ఉంటుంది.

సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్, స్టూడియో గ్రీన్
నటీనటులు: సూర్య, అనుష్క, హన్సిక, వివేక్, సంతానం, రాధా రవి, నాజర్, విజయ్‌కుమార్, ముఖేష్ రుషి, కె.విశ్వనాథ్ తదితరులు
ఎడిటింగ్: వి.టి.విజయన్,
మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
కెమెరా: ప్రియన్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్
దర్శకత్వం: హరి
విడుదల: 05,జూలై 2013.
ఫైనల్ గా ఈ చిత్రం యాక్షన్ అభిమానులకు నచ్చుతుంది. అనుష్క ని చూద్దామనో...వివేక్ కామెడీ ఎంజాయ్ చేద్దామనో వెళితే మాత్రం నిరాసపడుతారు. బి,సి సెంటర్లలలో ఈ సినిమా పైస్ వసూల్ గా మారే అవకాసం ఉంది.
(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)