For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైరా నర్సింహరెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
3.5/5
Star Cast: చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా
Director: సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి 12 ఏళ్ల కలకు తెరరూపం సైరా నర్సింహారెడ్డి. తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాను విజువల్ ఫీస్ట్‌గా మలిచారనే విషయం రిలీజ్‌కు ముందే విస్తృతంగా ప్రచారం జరిగింది. చిరంజీవి, మరికొందరి నటజీవితంలో మైలురాయిగా నిలిచే చిత్రంగా రూపొందిందనే విషయంతో భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి అంచనాల మధ్య అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అంచనాలు చేరుకొన్నదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

సైరా నర్సింహరెడ్డి కథ

సైరా నర్సింహరెడ్డి కథ

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అలియాస్ మజారి నర్సింహారెడ్డి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన స్వాతంత్ర్య సమరయోధుడు. పాలెగాళ్ల సమంత రాజుల నుంచి శిస్తు వసూలు చేయడాన్ని నర్సింహరెడ్డి వ్యతిరేకించి రైతులు, ప్రజల పక్షాన నిలుస్తాడు. బ్రిటీష్ పరిపాలకులకు కప్పం కడుతున్న సామంత రాజుల ఏకం చేసి భరత మాత స్వేచ్ఛ కోసం పోరాడుతాడు. ఈ క్రమంలో నాట్యతార లక్ష్మీ (తమన్నా)ని ప్రేమించి, సిద్దమ్మ (నయనతార)ను పెళ్లి చేసుకొంటాడు.

సైరా నర్సింహరెడ్డి ట్విస్టులు

సైరా నర్సింహరెడ్డి ట్విస్టులు

ఇక సైరా కథలో గురువు గోసాని వెంకన్న (అమితాబ్), వీరా రెడ్డి (జగపతిబాబు), అవుకు రాజు (సుదీప్) ఇతర పాత్రలు ప్రాధాన్యమేమిటి? నయనతారతో పెళ్లి వెనుక ట్విస్ట్ ఏమిటి? లక్ష్మీని ప్రేమించిన నర్సింహరెడ్డి ఆమెకు ఎందుకు దూరం కావాల్సి వస్తుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో సైరా పన్నిన వ్యూహాలేమిటి? భారత మాత సంకెళ్లను తెంచడం కోసం సాగించే పోరాటంలో ఆయన ఎలా అమరుడయ్యారు అనే ప్రశ్నలకు సమాధానమే సైరా నర్సింహారెడ్డి చిత్ర కథ.

సైరా ఫస్టాఫ్

సైరా ఫస్టాఫ్

సైరా నర్సింహారెడ్డి కథను ఝాన్సీ లక్ష్మీభాయ్ (అనుష్క) కథతో ప్రారంభించడంతో సినిమా బలమేమిటో తెలిసి పోయింది. ఇక అక్కడ నుంచి సైరా నర్సింహారెడ్డి బాల్యంలో చిన్న ట్విస్టును పెట్టి కథను ఎమోషనల్‌గా మార్చాడు. ఇక లక్ష్మీతో ప్రేమ కథ, సిద్దమ్మతో పెళ్లి అనేవి కథను ఫ్యామిలీ ఎమోషన్స్‌గా మార్చింది. ఇక తొలి భాగంలో రైతులను పీడించే బ్రిటీష్ అధికారిపై రైతులతో కలిసి పోరాటం సినిమాను మరో మెట్టు ఎక్కిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు సంబంధించిన ఎపిసోడ్ రోమాలు నిక్క బొడిచే విధంగా ఉంటుంది.

సైరా సెకండాఫ్

సైరా సెకండాఫ్

ఇక సెకండాఫ్‌లో కథ పూర్తిగా భావోద్వేగంతో సాగుతుంది. అవుకురాజు, వీరారెడ్డి మధ్య వచ్చే సన్నివేశాలు కథకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. అలాగే విజయ్ సేతుపతి ఎంట్రీ.. కథలో ఆయన భాగం మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక నయనతారను ఉద్యమంలోకి లాగే సీన్, అలాగే తమన్నా ఆత్మాహుతి సన్నివేశం తెరపైన అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సాగే పోరాటాలైనా.. ఇంకా ఉరికొయ్య వద్ద నుంచి నర్సింహారెడ్డి చెప్పే డైలాగ్‌లు దేశభక్తి స్ఫూర్తిని కలిగిస్తాయి. అలాగే నర్సింహరెడ్డి తల్లి చెప్పే భావోద్వేగమైన సన్నివేశాలు స్వరాజ్య స్ఫూర్తిని రగిలిస్తాయి. నర్సింహరెడ్డి అమరుడయ్యే సీన్ కంటతడి పెట్టించేలా ఉంటుంది.

సైరా అనిపించిన సురేందర్ రెడ్డి

సైరా అనిపించిన సురేందర్ రెడ్డి

సైరాను అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా మలచడంలోను, అలాగే కథను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువ చేసే విధంగా రాసుకొన్న కథనం, కథలో ట్విస్టులను జొప్పించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీరారాడ్డి కొడుకు ఎపిసోడ్, తమన్నా ప్రాణత్యాగం, అలాగే రైతులకు సంబంధించిన సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా చేశారు. యాక్షన్, ఎమోషన్స్, సెంటిమెంట్ అంశాలను కలబోసి తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచేలా సైరాను రూపొందించారడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తొలిభాగంలోను, ద్వితీయ భాగంలోను కొన్ని సన్నివేశాలు స్లోగా నెరేట్ చేసినట్టు అనిపించిని సినిమా గమనానికి అడ్డుకాకపోవడం పాజిటివ్ అంశంగా మారింది.

చిరంజీవి మెగా ఫెర్ఫార్మెన్స్

చిరంజీవి మెగా ఫెర్ఫార్మెన్స్

చిరంజీవి నటన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. యాక్షన్, ఎమోషన్స్ పండించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక సైరా నర్సింహారెడ్డి లాంటి ఉద్యమవీరుడి పాత్రలో ఒదిగిపోయాడు. భూమి శిస్తును వ్యతిరేకించే సీన్లలో, నయనతారతో కూడిన సీన్లు, తమన్నా సీన్లలో భావోద్వేగాన్ని పండించారు. అమితాబ్‌తో ఉండే సీన్లలో తనదైన శైలిలో రాణించారు. ఇక క్లైమాక్స్ ఆయన ఫెర్ఫార్మెన్స్ నభుతో నభవిష్యత్ అనే రేంజ్‌లో ఉంటాయి. హావభావాలు, డైలాగ్ డెలవరీతో కేక పెట్టించారు.

నయనతార యాక్టింగ్

నయనతార యాక్టింగ్

ఇక నయనతార పలు రకాల షేడ్స్, ఎమోషన్స్ పలికించే పాత్రలో కనిపించారు. గృహిణిగా, పెళ్లి చేసుకొన్నప్పటికీ ఓ కారణంగా దశాబ్దాలపాటు దూరంగా ఉండే భార్యగా, భర్త కార్యాచరణలో భాగస్వామిగా, ఇలా పలు రకాల కోణాలున్న రోల్‌లో మెప్పించారు. ఇక చివర్లలో తనదైన నటనతో భావోద్వేగానికి గురిచేస్తారు.

తమన్నా పెర్ఫార్మెన్స్

తమన్నా పెర్ఫార్మెన్స్

తమన్నా లక్ష్మీ పాత్రలో చాలా కీలకమైన రోల్‌లో నటించారు. నాట్యతారగా నర్సింహారెడ్డిని ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడిన భగ్న ప్రేమికురాలిగా నటించారు. స్వాతంత్య్ర ఉద్యమనారిగా దేశం కోసం ప్రాణాలర్పించే వీర వనితగా ఇలా అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెస్మరైజ్ చేశారు. ఇటీవల కాలంలోనే కాదు.. కెరీర్‌లోను ఇంత గొప్ప పాత్రను పోషించిన దాఖలాలు లేవనే చెప్పాలి.

రైతు పాత్రలో సాయిచంద్

రైతు పాత్రలో సాయిచంద్

ఇక సైరా సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర సుబ్బయ్య (సాయిచంద్). రైతుగా తనకు లభించిన అద్భుతమైన పాత్రలో జీవించాడు. గుర్రంతో పరుగెత్తే సన్నివేశాల్లోనూ.. అలాగే చివర్లో యాక్షన్ సన్నివేశాల్లోనూ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా రాణించారు. ఇక ఈ సినిమాలో గొప్పగా అనిపించే పాత్ర సుదీప్. అవుకు రాజుగా కనిపించిన కొన్నిసీన్లైనా తన మార్కును వదిలివెళ్లాడు.

విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి

విజయ్ సేతుపతి తమిళ ఉద్యమ వీరుడిగా నటించి తనదైన శైలిలో మెప్పించాడు. పాత్ర పరిధి తక్కువగా ఉన్నప్పటికీ.. ఆయన ఫెర్ఫార్మెన్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇక సర్‌ప్రైజ్ అప్పీయరెన్స్‌తో అనుష్క అదరగొట్టేసింది. సినిమా ఆరంభంలోను, ముగింపులోనూ తెర మీద మెరిసింది. కొణిదెల నిహారిక అతిథి పాత్రకే పరిమితమైంది.

రత్నవేలు సినిమాటోగ్రఫి

రత్నవేలు సినిమాటోగ్రఫి

సాంకేతిక వర్గాల పనితీరులో రత్నవేలు సినిమాటోగ్రఫి అదుర్స్. జార్జియాలోని పోరాటాలు, యాక్షన్ సీన్లను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక అమిత్ త్రివేది సంగీతం కూడా ఆకట్టుకొంటుంది. రీరికార్డింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. క్యాస్టూమ్ డిజైన్స్ విషయంలో పిరియాడిక్ మూడ్‌ను తీసుకురావడంలో సుస్మిత కొణిదెల, ఉత్తర మీనన్ పనితీరు ఆకట్టుకొంది.

రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

సైరా నర్సింహారెడ్డి చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా మలచడంలో నిర్మాత రాంచరణ్ నిర్మాణ విలువలు ఫెంటాస్టిక్. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో సైరా మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నటీనటులు ఎంపిక, టెక్నిషియన్లను సమకూర్చిన విషయంలో ఎక్కడా రాజీ కనిపించదు. నిర్మాతగా రాంచరణ్ సైరాతో తెలుగు సినిమా ప్రతిష్టను పెంపొందించే రూపొందించారని చెప్పవచ్చు.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంగా తెలుగు తెరపై వచ్చిన చిత్రాల్లో సైరా నర్సింహారెడ్డి మొదటి వరుసలో ఉంటుంది. ఇక బ్రేవ్ హార్ట్ రేంజ్‌లో సైరాను రూపొందించడంలో సురేందర్ రెడ్డి సఫలమయ్యాడు. చిరంజీవి నటన సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక బిగ్‌బీ, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్నివర్గాలను ఆకర్షించే అంశాలతో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ ఏ రేంజ్ అనేది నిర్ణయించాల్సి ఉంటుంది.

బలం, బలహీనత

బలం, బలహీనత

ప్లస్ పాయింట్స్

కథ, కథనాలు

డైరెక్టర్ టేకింగ్

చిరంజీవి ఫెర్ఫార్మెన్స్

మైనస్ పాయింట్స్

కొన్ని చోట్ల స్లోగా నెరేట్ చేయడం

తొలిభాగంలో కొన్ని సన్నివేశాలు

Chiranjeevi Speech @ Sye Raa Narasimha Reddy Pre Release Event Kerala
తారాగణం

తారాగణం

స్క్రీన్ ప్లే, దర్శకుడు: సురేందర్ రెడ్డి

నిర్మాత: రాంచరణ్

కథ: పరుచూరి బ్రదర్స్

మ్యూజిక్: అమిత్ త్రివేది

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జూలియస్ పాకియమ్

సినిమాటోగ్రఫి: రత్నవేలు

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్, బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

డిస్ట్రిబ్యూషన్: యూవీ క్రియేషన్స్ (తెలుగు), ఎక్సెల్ ఎంటర్టైన్‌మెంట్, ఏఏ ఫిల్మ్స్ (హిందీ)

రిలీజ్ డేట్: 2019-10-02

బడ్జెట్: 270 కోట్లు

English summary
Sye Raa movie Produced By Ram Charan And directed By Surender Reddy. This Movie Releasing On 2nd October. In this occassaion, Telugu filmibeat brings exclusive review.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more