twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెక్నికల్‌ దొంగ

    By Staff
    |

    Takkari Donga
    -జలపతి
    చిత్రం: టక్కరిదొంగ
    నటీనటులు: మహేష్‌ బాబు, లీసారే, బిపాసా బసు, రాహుల్‌ దేవ్‌
    రచన: సత్యనంద్‌
    సినిమాటోగ్రఫీ: జయనన్‌ విన్సెంట్‌
    యాక్షన్‌: విజయన్‌
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత, దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ

    కౌబోయ్‌ చిత్రం అంటే హాలీవుడ్‌ సినిమాలే గుర్తకువస్తాయి. వాస్తవికత పాలు తక్కువుండి, కేవలం వినోదం కోసం ఉద్దేశించిన ఈ film genre ఇప్పుడు హాలీవుడ్‌ లో కూడా ఛరిస్మాను కోల్పోయింది. ఇటువంటి తరుణంలో తెలుగులో ఓ కౌబోయ్‌ చిత్రం రావడం ఒక వెరైటీయే. అయితే జయంత్‌ అందించిన కౌబోయ్‌ చిత్రంలో వినోదం పాలు తక్కువ బోర్‌ ఎక్కువ. తెలుగు వాళ్ళు కూడా టెక్నికల్‌ గా అంతర్జాతీయ స్థాయిలో తీయగలమని నిరూపించడమే కోసం జయంత్‌ ఈ చిత్రం రూపొందించినట్లు కనిపిస్తుంది. టెక్నికల్‌ విషయాల మీద పెట్టిన దృష్టిలో కొంత భాగం స్క్రిప్ట్‌ మీద కూడా పెడితే ఈ చిత్రం మంచి వినోదాత్మక చిత్రంగా మారేది. సాంకేతికపరంగా ఈ చిత్రం హైస్టాండర్డ్‌. జయనన్‌ విన్సెంట్‌ ఫోటోగ్రఫీ, కళాదర్శకుడి ప్రతిభ, మణిశర్మ నేపథ్యసంగీతం ఈ చిత్రానికి హైలెట్‌.

    ముఖ్యంగా జయనన్‌ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మెకాన్నెస్‌ గోల్డ్‌ చిత్రం కోసం ఉపయోగించిన లోకెషన్స్‌ లోనే ఈ చిత్రంలోని కీలకమైన దృశ్యాలను చిత్రీకరించారు. ఆ చిత్రం ఫోటోగ్రఫీతో దీన్ని పోల్చలేం కానీ ఆ ఎర్రటి కొండలను, ఎర్ర దిబ్బలను జయనన్‌ చాలా బాగా చిత్రీకరించాడు. వీటిని సినిమా ఆరంభంలోనే వాడుకోవడంతో ఆ 'ఫీల్‌'వచ్చింది. ఇక మణిశర్మ అందించిన పాటల కన్నా రీరికార్డింగ్‌ బాగుంది. చాలా హాలీవుడ్‌ కౌబోయ్‌ సినిమాల్లో కనిపించే థీమ్‌ బిట్‌ నే వాడుకున్నా, నేపథ్య సంగీతం బాగుంది.

    ఇందులో కథ చాలా పాతది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, విలన్‌ కు వజ్రాల లోయ అడ్రెస్‌ కావాలి. హీరోకు తన తండ్రి చంపిన వాడు కావాలి. హీరోయిన్లకు పాడుకునేందుక పాటలు కావాలి. అంతే. ఎన్నో పాత సినిమాల్లో మనం చూశాం. ఇంతే. సో కథను పక్కన పెడితే.... ఇక ఈ సినిమాలో మరో ఆకర్షణ మహేష్‌ బాబు. కౌబోయ్‌ గా బాగా సూటయ్యాడు. రఫ్‌ గడ్డంతో ఛార్మింగ్‌ గా ఉన్నాడు. నటన కూడా బాగుంది. కానీ సినిమా స్క్రీన్‌ ప్లేలోనే పట్టులేదు. దానివల్ల మహేష్‌ పాత్ర ఎలివేట్‌ కాలేదు. మహేష్‌ తర్వాత విలన్‌ రాహుల్‌ దేవ్‌ చక్కగా నటించాడు. తలపండిన మాటల రచయిత సత్యానంద్‌ రాసిన మాటలు పేలవంగా ఉన్నాయి. ఓవరాల్‌ గా సాధారణ చిత్రం- ఒక్క సాంకేతిక డిపార్ట్‌ మెంట్‌ లో తప్ప.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X