»   » పదునైన క్రైమ్ థ్రిల్లర్ ..“తల్వార్”

పదునైన క్రైమ్ థ్రిల్లర్ ..“తల్వార్”

Posted By: Lakshmisurya
Subscribe to Filmibeat Telugu
Rating:
3.5/5

చిత్రం : తల్వార్
జోనర్ : క్రైమ్ థ్రిల్లర్
నటీనటులు : ఇర్ఫాన్ ఖాన్,కొంకన్ సేన్ శర్మ,నీరజ్ కబీ,సోహమ్ శర్మ
దర్శకత్వం : మేఘన గుల్జార్
సంగీతం : విశాల్ భరద్వాజ్
నిర్మాత : వినీత్ జైన్, విశాల్ భరద్వాజ్

రివ్యూ : లక్ష్మీ S కుకునూర్

2008 లో నోయిడా లో జరిగిన 14 ఏళ్ళ ఆరూషీ తల్వార్ హత్య కేసు నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం "తల్వార్". దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్య ఆధారంగా మహిళా దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది.రియల్ సంఘటనతో తెరకెక్కిన ఈ చిత్రం రీల్ పై ఎలా ఉందో చూద్దాం.

talwar film review

అసలు విషయం :

సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ స్పెక్టర్ అశ్విన్ కుమార్ (ఇర్ఫాన్ ఖాన్ )కు శృతి టాండన్ హత్య కేసు విచారణ బాధ్యతలు అప్పగించటంతో కధ మొదలవుతుంది.2008 మార్చి15 న నోయిడాలోని సమీర్ విహార్ ప్రాంతంలో శృతి టాండన్ (అయేషా ప్రవీణ్) హత్యకు గురయిందన్న సమాచారాన్ని ఆమె తల్లిదండ్రులు రమేష్ (నీరజ్ కబీ),నూతన్ ( కొంకణా సేన్ శర్మ)లు పోలీసులకు సమాచారం అందిస్తారు. దర్యాప్తులో పోలీసులు శృతిని ఆమె తల్లితండ్రులే హత్య చేసారని వారిని అరెస్ట్ చేస్తారు. ఈ నేపధ్యంలో కేసు విచారణ బాధ్యతలు తీసుకున్న అశ్విన్ ఆ హత్య కేసును తనదైన శైలిలో ఎలా పరిష్కరించాడన్నదే సినిమా కథ.

చెప్పుకోదగినవి :

దాదాపు సినిమా అంతా కనిపిస్తూ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తన నటనతో కట్టిపాడేసాడు. ప్రొఫెషనిలిజమ్ ఇన్ యాక్టింగ్ అంటే ఏమిటో చూపిస్తూ సినిమాకి పెద్ద ఎస్సెట్ గా నిలిచాడు. మిగిలిన పాత్రల్లో ఎవరి పరిధి మేరకు వారు బాగానే నటించినా శృతి తల్లి పాత్రలో నటించిన కొంకణా సేన్ శర్మ గురించి చెప్పుకోవాలి. కూతురు చనిపోయిందనే బాధ, తామే కూతురుని చంపిన ఆరోపణల మధ్య సంఘర్షణలో నలిగిపోయే తల్లిగా చాలా బాగా నటించింది. సంచలనం సృష్టించి ఇప్పటికీ మిస్టీరియస్ గా ఉన్న ఓ హత్య కేసును దర్శకురాలు మేఘన గుల్జార్ ఎంతో సమర్ధవంతంగా తెరకెక్కించింది.వివాదాలకు తావివ్వకుండా కధనంలో తీసుకున్న జాగ్రత్తలు,పాత్రల ఎంపికలో ఆమె కృషి అభినందనీయం. నిర్మాణ బాధ్యతలతో పాటు సంగీతం అందించిన విశాల్ భరద్వాజ్ సినిమాకు తమ సంగీతంతో మరింత లైఫ్ ఇచ్చారు. పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ,శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఫలితం :

వివాదమైన అంశాన్ని మర్డర్ మిస్టరీ సినిమాను కమర్షియల్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కించి దర్శకురాలు మేఘనా గుల్జార్ మంచి విజయం సాదించింది. థ్రిల్లింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ ను అద్భుతంగా తెరకెక్కించిన మేఘన,సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త స్లో అయినట్లుగా అనిపిస్తుంది. కానీ అప్పటికే ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వటంతో స్క్రీన్ ప్లే స్లో అయినా బోర్ అనిపించదు.పాత్రకు తగిన నటీనటుల "పదునైన" నటనతో పాటు ఇతర సాంకేతిక నిపుణుల "పదునైన" పనితనంతో తల్వార్ (కత్తి) కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డులు రివార్డులు అందుకునే కత్తి లాంటి చిత్రంగా రూపొందింది. ఈ వీకెండ్ లో ఒక మంచి సినిమాని చూసిన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది "తల్వార్" .

English summary
talwar film review
Please Wait while comments are loading...