»   » యావరేజే కానీ ఫీల్ గుడ్..(‘తను నేను’ రివ్యూ)

యావరేజే కానీ ఫీల్ గుడ్..(‘తను నేను’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
హైదరాబాద్: ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయమై తర్వాత వరస హిట్స్ తో దూసుకుపోతున్న అవికాగోర్ నటించిన మరో చిత్రం ‘తను నేను'. మహేష్ బాబుతో బాబి చిత్రం చేసిన దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరో పరిచయం అవుతున్నాడు. అమెరికా వెళ్లాలనే కోరిక, జీవితాశయం ఉన్న అమ్మాయికి, విదేశాలు అంటే పడని కుర్రాడికి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది.

కథలోకి వెళితే.. కిరణ్ (సంతోష్ శోభన్)కి యూఎస్ వెళ్లడం అంటే అసహ్యం. లైఫ్ ను తనదైన రీతిలో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో కీర్తి(అవికా గోర్)తో ప్రేమలో పడతాడు. అమెరికా వెళ్లాలనేది కీర్తి డ్రీమ్. తన కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. మొత్తానికి విసా సంపాదిస్తుంది. అసలు కిరణ్‌కు యూఎస్ అంటే నచ్చక పోవడానికి కారణం ఏమిటి? కీర్తి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ.

పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే... సంతోష్ శోభన్ కు ఇది తొలి సినిమానే అయినా పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. సినిమాలో పైట్లు, డాన్సులు పెద్దగా లేకున్నా తన ఎక్స్ ప్రెషన్స్‌తో మెప్పిచాడు. మరింత కాన్సన్ట్రేషన్ పెడితే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అవికా గోర్ పెర్పార్మెన్స్ పరంగా ఓకే కానీ... గతంతో పోలిస్తే ఇపుడు మరింత లావుగా కనిపించింది. ఇలాగే బరువు పెరిగితే ఫ్యూచర్లో కష్టమే. హీరోయిన్ తండ్రి పాత్రలో రవిబాబు అదరగొట్టాడు. తల్లి పాత్రలో సత్యకృష్ణన్ ఓకే. ఇతర నటీనటులు వారి పాత్రలకు న్యాయం చేసారు.

Tanu Nenu movie review

ఇతర అంశాలు పరిశీలిస్తే...దర్శకుడు రామ్మోహన్ ఎంచుకున్న కథనం యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫస్టాఫ్ ఓకే కానీ, సెకండాఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ కూడా సినిమాకు మైనస్ అయింది. సినిమాలో ఎంటర్టెన్మెంట్ పాళ్లు కూడా తక్కువే. సంగీతం గొప్పగా లేక పోయినా ఫర్వాలేదు. ఓవరాల్ చెప్పాలంటే యావరేజ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.

అయితే ఈ సినిమాకు మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ లాంటి వారు ప్రమోట్ చేయడం ఓపెనింగ్స్ పరంగా కలిసి రావచ్చు.

బ్యానర్స్: సన్ షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్
నటీనటులు: సంతోష్ శోభన్, అవికా గోర్, అల్లరి రవిబాబు, రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్కే, రాజశ్రీనాయుడు
సంగీతం: సన్నీ ఎం.ఆర్‌
ఛాయాగ్రహణం: సురేశ్ సారంగం
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్
నిర్మాత, దర్శకత్వం: రామ్మోహన్ .పి
సమర్పణ : డి.సురేష్ బాబు
విడుదల తేదీ : 27, నవంబర్ 2015.

English summary
Thanu Nenu, introducing late director Shobhan's son, Santhosh Shobhan, co-starring Avika Gor, directed by Ram Mohan created a good buzz among moviegoers, with stars like Mahesh Babu, Prabhas, Ravi Teja etc promoting the film extensively. Read the review to know if the film lived up to the positivity.
Please Wait while comments are loading...