For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రాక్..(కేక రివ్యూ)

  By Staff
  |

  Keka
  -జోశ్యుల సూర్య ప్రకాష్
  తారాగణం:రాజా,ఇషానీ,అనూప్ కుమార్,రాళ్ళ పల్లి,ధర్మవరపు,
  దువ్వాసి మోహన్ మరియు కొత్త నటీనటులు.
  ఛాయా గ్రహణం పి.సి.శ్రీరామ్
  కథ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: తేజ
  ఎడిటింగ్: శంకర్
  పాటలు: సిరివెన్నెల,వేటూరి,చంద్రబోస్
  సంగీతం: చక్రి
  నిర్మాత: దిల్ రాజు
  రిలీజ్ డేట్: 23 అక్టోబర్ 2008

  ఈ సినిమా ప్రారంభం నుంచీ హీరోని హీరోయిన్ ముద్దుగా సన్నోసోడా అని పిలుస్తూంటుంది... సినిమా చివరకు వచ్చేసరకి హీరో కూడా పరిణితి చెంది హీరోయిన్ ని ప్రేమగా సన్నాసిదానా అని పిలుస్తాడు. ఇదంతా చూసిన ప్రేక్షకుడు కూడా ఏం చేయాలో అర్ధం కాక 'సన్నాసి సినిమా' అని అరుస్తాడు. క్లైమాక్స్ లో చిన్న ట్విస్టుని నమ్ముకుని చేసిన ఈ చిత్రంలో యూత్ ని రెచ్చగొట్టాలని కొన్ని సీన్లు అనుకున్నా ఫ్రధానంగా కథన లోపమై శాపమై నిలిచింది.దాంతో ఓవర్ పబ్లిసిటీ,తేజ కాంట్రావర్సీ స్టేట్ మెంట్స్,రెచ్చగొట్టే ప్రోమోలుతో ఓపినింగ్స్ వచ్చినా వారం కూడా నిలబడుతుందా అనే సందేహాన్నే మిగులించింది..

  స్టోరీ లైన్...
  అర్జున్(రాజా)తన పల్లెలో పరిచయమైన సుజాత(ఇషానీ)నే ప్రేమిస్తూంటాడు.కానీ సుజాత కి అర్జున్ క్లోజ్ ప్రెండ్ కిరణ్(అనూప్) తో మ్యారేజ్ సెటలవుతుంది. ఆ పరిస్ధితుల్లో ఆమె తన లవర్ అర్జున్ ని అసలు విషయం కిరణ్ కి చెప్పమని ఒత్తిడి చేయటంతో చెప్తాడు. అప్పడు కిరణ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు...అర్జున్ ప్రేమ ఏమయ్యింది అనేది చిన్న ట్విస్ట్ తో నడిచే మిగతా కథ.

  కొత్త నటీనటులు నటన
  హీరో,హీరోయిన్స్ గా చేసిన రాజా,ఇషానీ చూడ్డానికి ఓ మోస్తరు గా బాగానే ఉన్నారు. అయితే అంతా నటశూన్యం. ఉన్నంతలో అనూప్ బాగా చేసాడు. కన్నాంబ కటింగ్స్ అనే పేరుతో కామెడీ చేసిన కుర్రాడు అందరిలోకి బెటర్ .

  టెక్నికల్ గా...
  పి.సి.శ్రీరామ్ కెమెరా వర్క్ పై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ...డైరక్టర్,కథ ని బట్టే ఆయన ప్రతిభ అద్భుతంగా కనిపిస్తుందనిపిస్తుంది. ఇక తేజ అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యాడని,ప్రేక్షకుల పల్స్ పై గ్రిప్ కోల్పోయాడనీ స్పష్టంగా తేల్చి చెప్పిన చిత్రం ఇది. చక్రి పాటల్లో కేక టైటిల్ సాంగ్,హంటింగ్ చేసే మరో ట్యూన్ బాగున్నాయి.

  పిచ్చి పాత్రలు...
  పెళ్ళి చేసుకోబోయే వాడి భుజంపై చెయ్యి వేసి నడిచి వెళ్తూ...వెనకు వస్తున్న ప్రియుడి వంక తిర్గి తన ఎక్సపోజ్ అవుతున్న నడుముని చూపి ఎలా ఉంది అడిగే హీరోయిన్ క్యారెక్టర్. తన క్లోజ్ ప్రెండ్ తన ప్రేయసి తో మ్యారేజి సెటిల్ చేసుకున్నాడన్నా, తన కోసం బెల్ట్ దెబ్బలు తిన్నాడన్నా చలించని హీరో, తను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి కోసం ఓ దిక్కుమాలిన ప్లాన్ వేసి హీరో కి అప్పచెప్పి వాళ్ళి వెనక సీట్లో రొమాన్స్ చేసుకుంటూంటే గోళ్ళు గిల్లుకునే విలన్ ...ఇలా ఎవరి పాత్ర అర్ధం పర్ధం పరమార్ధం లేకుండా తీర్చిదిద్దాడు.

  రివర్స్ అయిన స్కీన్ ప్లే
  రివర్స్ స్కీన్ ప్లే అంటూ పెద్దగా పబ్లిసిటీ చేసిన తేజ స్కీన్ ప్లే లో ఓనమాలు కూడా తెలియనట్లు వ్రాసుకున్నాడు. అందరికి తెల్సిన మినిమం బేసిక్స్ ...అయిన అత్యవసరమైన సెటప్ సీన్స్ లేకుండా కథనం తయారు చేసుకోవటం మెయిన్ డ్రా బ్యాక్. దాంతో హీరో,హీరోయిన్స్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్స్ ఏంటో,ప్రేమకి దారి తీసిన పరిస్ధితులేంటో,ఎవరే సీన్ లో ఎలా బిహేవ్ చేస్తారో అర్ధం కాకుండా పోయింది. అందులోనూ తేజ తన రెగ్యులర్ పైత్యం(హీరో ...హీరోయిన్ ని టచ్ చేసే సీన్లు, షకీలా వ్యబిచారం సీన్లు) అయిన రొమాన్స్ డోస్ పెంచే ప్రయత్నం చేయటం మరీ దిగజార్చింది.

  నన్ను నేను కాపీ కొట్టు కోను అంటూనే ..
  'నువ్వు నేను' సినిమా క్లైమాక్స్ లో హీరో ప్రేమని గెలిపించటానికి స్నేహితులు రెడీ అవుతారు. ఆ సీన్ పై మమకారం పోక అనుకరిస్తూ దీంట్లో హీరో ప్రేమని గెలిపించటానికి చిన్న పిల్లలు (కరెక్టే) ప్రాణ త్యాగానికి రెడీ అవుతారు. ఇదో పరాకాష్ట.2003లో వచ్చిన సౌత్ కొరియా సినిమా ది క్లాసిక్ లో కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో దర్శనమివ్వటం విశేషం.

  ఫైనల్ గా
  ఎంత ఖాళీగా ఉన్నా కేక సినిమా వెళ్ళటం కొరివితో తల గోక్కోవటమే.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X