For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Telangana Devudu review.. వెండితెరపై కేసీఆర్ జీవితం.. ఉద్యమ స్పూర్తిని రగిలించే బయోపిక్

  |

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోషించిన పాత్ర అద్భుతం. అహింస పద్దతిలో ఓ సత్యాగ్రహంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలే వ్యూహ రచన చేశారు. ఆంధ్రా పాలకుల ఎత్తులుపై ఎత్తులకు ఉద్యమ కార్యచరణ రూపొందించారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి ఎన్నో ఉద్యమాలకు కార్యరూపం ఇచ్చి ప్రజలందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అలాంటి మహోన్నత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ జీవితంలోని కీలక సంఘటనలను ఆధారంగా చేసుకొని తెలంగాణ దేవుడు అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం ఎలాంటి స్పూర్తిని కలిగించిందనే విషయాన్ని తెలుసుకొందాం.

  మెదక్ జిల్లాలో పుట్టిన విజయ్ దేవ్ (కేసీఆర్) (జిషాన్, శ్రీకాంత్) బాల్యం నుంచే రెబెల్‌గా ఉంటారు. అన్యాయానికి ధీటుగా ఎదురిస్తూ విప్లవ భావాలతో అందరికి స్పూర్తిగా నిలుస్తారు. కళలు, ఉపన్యాసాలతో రాటుదేలిన విద్యార్థిగా కనిపిస్తాడు. స్కూల్‌, కాలేజీ విద్య సమయంలోనే నాయకత్వ లక్షణాలను పుచ్చుకొంటాడు. తొలుత కాంగ్రెస్ నాయకుడిగా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ప్రజాసేవకు అంకితమవుతారు. ఆంధ్రా పాలకుల వివక్షణ తట్టుకోలేక బంగారు తెలంగాణ పార్టీని స్థాపిస్తాడు.

  Telangana Devudu movie review and rating: Srikanth, Zeeshan Osmans impressive performances

  బంగారు తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ దేవ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? జై సార్ (ఆచార్య (జయశంకర్ పేరు మార్చి) (సుమన్) సలహాలు, ఉద్యమ కార్యాచరణను ఎలా ముందుకు తీసుకెళ్లాడు. ఆంధ్ర ప్రజల మనోభావాలు నొప్పించకుండా ఎలా ఉద్యమాన్ని విజయ్ దేవ్ ముందుకు తీసుకెళ్లాడు? ఆంధ్ర పాలకుల కుట్రలను ఎలా ఎండగట్టాడు? దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతును ఎలా కూడగట్టారు? కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోవడానికి కారణాలు ఏమిటి? సొంతంగా పోటి చేసి ప్రజా సంక్షేమాన్ని అమలు చేసి తెలంగాణ ప్రజలకు దేవుడిగా ఎలా నిలిచారు అనే ప్రశ్నలకు సమాధానమే తెలంగాణ దేవుడు సినిమా కథ.

  గత రెండు దశాబ్దాల కాలంలో సమైక్య ఆంధ్ర రాష్ట్రం, తెలంణా రాష్రంలో జరిగిన కీలక పరిణామాలపై అద్భుతంగా పరిశోధన చూసి కథగా రూపొందించుకోవడంపై వడత్యా హరీష్ కృషిని ప్రశంసించాలి. వివాదాలకు తావు లేకుండా కథను అద్భుతంగా చెప్పడంలోను, అలాగే పాత్రలను డిజైన్ చూసుకొని తెరమీద పండించిన విషయం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. కథ, మాటలు, నటీనటుల నుంచి ప్రతిభను రాబట్టకోవడం పక్కాగా సఫలమయ్యారు. పాటల హోరు కాస్త శృతిమించడం వల్ల కథలో భావోద్వేగానికి అడ్డంకిగా నిలిచిందనే అభిప్రాయం కలుగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని పాటలను తగ్గించి ఉంటే స్టోరి మరింత ఇంటెన్స్‌గా మారి ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అన్ని విభాగాలను దర్శకుడు సమన్వయం చేసిన తీరు సగటు ప్రేక్షకుడిని సైతం మెప్పించేలా ఉంది.

  బాల్యంలో విజయ్ దేవ్‌గా జిషాన్ ఉస్మాన్ తన పాత్రలో ఒదిగిపోయారు. స్కూల్‌లో భూస్వామి కొడుకుతో జరిగే గొడవ సీన్‌లో జిషాన్ నటన బాగా ఆకట్టుకొన్నది. ఇక ఆంధ్రాలో జరిగే సాంస్కృతిక పోటీల సందర్భంగా జరిగిన అన్యాయం సమయంలో ఆవేదన వెల్లడించే సన్నివేశాల్లో కూడా జిషన్ ఫెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకొన్నారు. ఇక యుక్త వయస్సు నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ దేవ్ పదవి బాధ్యతలు చేపట్టే వరకు ఉన్న పాత్రలో శ్రీకాంత్ చక్కటి హావభావాలు, నటనా ప్రతిభను చాటుకొన్నారు. కేసీఆర్ హావభావాలను వ్యక్తీకరించడంలో సఫలమయ్యారు. ఉద్వేగపూరిత ప్రసంగాలు, భాష, యాసను అనుకరించడంలో తన వంతు కృషిని చేశాడు. తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.

  ఇక తెలంగాణ దేవుడు చిత్రంలో సినిమా ఇండస్ట్రీలోని ఎక్కువ మంది స్టార్ నటులు పలు పాత్రల్లో కనిపించారు. రమేశ్ రావు (హరీష్ రావు)గా అజయ్, సంతూ (ఎంపీ సంతోష్ కుమార్)గా సమీర్, కేటీఆర్ పాత్రలో వెంకట్, కవిత పాత్రలో మధుమతి చక్కటి నటన ప్రదర్శను చూపించారు. ఇక వైఎస్ఆర్ పాత్రలో కాశీ విశ్వనాథ్, ఆచార్య జయశంకర్ పాత్రలో సుమన్ అద్భుతంగా ఒదిగిపోయారు. విజయ్ దేవ్ భార్య పాత్రలో సంగీత ఆకట్టుకొన్నారు. చేవెళ్ల చెల్లెమ్మ పాత్రలో సత్యకృష్ణ, గీతారెడ్డి పాత్రలో సన తదితరులు తెరపైన మెరిసారు.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ముందుగా నిర్మాత మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ ప్రయత్నాన్ని, కృషిని అభినందించాలి. ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను చాలా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. ప్రతీ ఫ్రేమ్‌లో నిర్మాణ విలువలు పుష్కలంగా కనిపిస్తాయి. నందన్ బొబ్బిలి మ్యూజిక్, పాటలు బాగున్నాయి. గౌతంరాజు ఎడిటింగ్ విషయంలో కొన్ని చోట్ల కత్తెర్లు పడాల్సిన అవసరం ఉంది. చివరి గంటలో రెండు పాటలను తొలగిస్తే.. సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

  తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణలో ఎదురులేని పోరాటం చేసిన కేసీఆర్ జీవితంలోని బయటకు తెలియని కొన్ని సంఘటనలు అద్భుతంగా చూపించారు. నిరాహర దీక్ష సమయంలో బయటకు రాని కొన్ని సన్నివేశాలను తెర మీద చూపించారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో విలీనం విఫలం కావడం వెనుక కారణాలను అద్బుతంగా చూపించారు. కేసీఆర్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసుకొనే విధంగా వెండితెర మీద సన్నివేశాలను అద్బుతంగా ఆవిష్కరించారు. స్క్రిప్టు పరంగా కొన్ని కొన్ని లోపాలను మినహాయిస్తే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ చరిత్రకు బైబిల్‌గా నిలుస్తుంది. ఒక డాక్యుమెంటరీగా కాకుండా రెండున్నర గంటలపాటు భావొద్వేగానికి గురిచేసే చిత్రంగా తెలంగాణ దేవుడు సినిమాను తెరపైన ఆవిష్కరించే ప్రయత్నం జరిగిందని చెప్పవచ్చు. మహోన్నమైన ఉద్యమానికి చిహ్నంగా రూపొందించిన ఈ సినిమాకు ఎంత రేటింగ్ ఇచ్చినా తక్కువే. ఈ సినిమాను రేటింగ్‌లతో కొలువడం సరికాదు. తెలంగాణపై అభిమానం ఉన్న ప్రతీ ఒక్కరు చూడదగిన చిత్రంగా చెప్పవచ్చు. తెలంగాణ దేవుడు సినిమా ద్వారా కేసీఆర్ జీవితం గురించి ప్రజలకు చెప్పే మంచి ప్రయత్నం జరిగిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  Recommended Video

  Hero Srikanth Released Poison Movie Song

  నటీనటులు : శ్రీకాంత్, సంగీత, మధుమిత, జిషాన్ ఉస్మాన్, సుమన్, సునీల్, బ్రహ్మాజీ, సత్యకృష్ణ, అజయ్, వెంకట్, కాశీ విశ్వనాధ్, వడత్యా హరీష్ తదితరులు
  నిర్మాత: మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌
  దర్శకత్వం: వడత్యా హరీష్
  మ్యూజిక్: నందన్ బొబ్బిలి
  ఎడిటింగ్: గౌతంరాజు
  రిలీజ్ డేట్: 2021-11-12

  English summary
  Telangana CM KCR's biopic Telangana Devudu comes to theatres on November 12th. Here is the review of the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X