twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆంజనేయులు' సమీక్ష

    By Staff
    |
    Anjaneyulu
    Rating
    సినిమా: ఆంజనేయులు
    నటీనటులు: రవితేజ, నయనతార, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్,
    చలపతిరావు, రాజా రవీంధ్ర, ఎవిఎస్, జీవ, సుభాష్, శ్రీనివాసరెడ్డి,
    పాండా, పృధ్వి, శివనారాయణ, తిరుపతి ప్రకాష్, సనా
    సంగీతం: తమన్ ఎస్
    సినిమాతోగ్రఫి: రవీంద్రబాబు
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పరశురాం (బుజ్జి)
    నిర్మాత: గణేశ్ బాబు
    విడుదల తేదీ: ఆగస్టు 12

    ఆంజనేయులు(రవితేజ) ఒక టీవీ చానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు. అంజలి (నయనతార) ఒక సెల్ ఫోన్ కంపెనీలో ఉద్యోగి. సూర్య (బ్రహ్మాజీ) నిజాయితీగా అదే టీవీ చానల్ లో రిపోర్టర్ గా మర్డర్ కేసు వివరాలు బయటపెడతాడు. బడా (సోనూ సూద్) విలనీని రచ్చకీడ్చుతాడు. ఆ మాఫియా గ్యాంగ్ అంతు తేల్చే బాధ్యతను రవితేజ తీసుకుంటాడు.

    రవితేజ ఈ కొత్త పాత్రను కూడా అద్భుతంగా పోషించాడు. మొత్తం సినిమా అతని మీదే నడిచింది. ఇక నయనతారకు పెద్దగా అవకాశం లేని పాత్ర. ఆమె పాటలకే పరిమితమైంది. విలన్ సోను సూద్ గ్యాంగ్ స్టర్ గా బాగా సరిపోయాడు. బ్రహ్మానందం, కోట, ఎంఎస్ నారాయణల హాస్యం సినిమాకు బాగా ఉపయోగపడింది. దర్శకుడు పరశురామ్ తయారు చేసుకున్న కథ,మాటలు బాగున్నాయి. సంగీతం ఫర్వాలేదు.

    ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కాస్త సీరియస్ గా ఉంటుంది. క్లైమాక్స్ వరకు టెంపో ఇంకా గట్టిగా ఉంటే సినిమా పెద్ద హిట్ అయి ఉండేది. రవితేజ కెరియర్ లో అత్యధిక ప్రింట్లతో విడుదలైన చిత్రమిది. రెండో వారంలో దీని జయాపజయాలు స్పష్టమయ్యే అవకాశముంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X