twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శౌర్యం కొంచమే...(శౌర్యం రివ్యూ)

    By Staff
    |

    Souryam
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్:భవ్య క్రియేషన్స్‌
    తారాగణం:గోపీచంద్,అనుష్క,పూనమ్ కౌర్,మనోజ్.కె.జయన్,
    ధర్మవరపు,తనికెళ్ల భరణి,రఘుబాబు,అలీ,కృష్ణభగవాన్,
    ఎమ్మెస్ నారాయణ,సుధ,శరత్ బాబు తదితరులు
    సంగీతం: మణిశర్మ
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
    యాక్షన్: విజయ్,రామ్-లక్ష్మన్
    కెమెరా :వెట్రి
    మాటలు :రత్నం
    కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ
    నిర్మాత: వి.ఆనందప్రసాద్
    రిలీజ్ డేట్: 25 సెప్టెంబర్ 2008

    చెల్లెలు సెంటిమెంటు కి యాక్షన్ ట్రీట్ మెంట్ కలపి తీసిన చిత్రం శౌర్యం. ఫస్టాఫ్ బోరనిపించినా సెకెండాఫ్ సర్దుకుని సరే అనిపిస్తుంది. లక్ష్యం అనంతరం ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ చిత్రంలో ఇంటర్ వెల్ తర్వాత వచ్చే విలన్ ని ఆట పట్టించే పావు గంట ఎపిసోడ్ బాగా పండటం ప్లస్ గా మారింది. అలాగే విలన్ ఎపిసోడ్,చెల్లి ఎపిసోడ్, లవ్ ఎపిసోడ్ ఇలా దేనికి దానికే విడిపోయి రన్ అవటం మైనస్ గా అనిపిస్తుంది. అయినా బి,సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ సినిమా అక్కడ వర్కవుట్ అవుతుంది.

    పోలీస్ ఆఫీసర్ విజయ్(గోపీచంద్)కి చెల్లి దివ్య(పూనమ్ కౌర్) అంటే ప్రాణం. కానీ చిన్నతనంలో ఏర్పడ్డ ఓ చిన్న అపార్ధంతో ఆమె జీవితకాలంగా అతన్ని ద్వేషిస్తూ దూరంగా వెళ్ళిపోతుంది. మరో ప్రక్క విజయ్ వృత్తి పరంగా శివరామ్ గౌడ్(మనోజ్ కె జయన్) అనే లోకల్ డాన్ తో తలపడతాడు. దాంతో విలన్ విజయ్ పై కక్ష కట్టి, అతని ప్రాణమైన చెల్లిని చంపటం ద్వారా పగతీర్చుకోవాలని ఆమె కోసం వెతుకుతూంటాడు. అలా విలన్స్, విజయ్ విడివిడిగా దివ్య కోసం వెతుకుతూంటారు. చివరకి ఎవరికి ఆమె దొరికింది....విజయ్ ని ఆమె తన అన్న గా ఏక్సెప్ట్ చేసిందా అలాగే ఈ కథలోకి శ్వేత (అనూష్క) ఎలా వచ్చింది అనేది అన్న విషయాలు తెరపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్ల తో కలిపి చూసి తెలుసుకోవాల్సిందే.

    ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ కథలో ఇంటర్వెల్ దాకా ఆగి ఒక్కసారిగా ట్విస్ట్ ఇద్దామనే తాపత్రయం కొంప ముంచింది. ఆ బ్యాంగ్ కోసం ఫస్టాఫ్ మొత్తం బలిపెట్టాల్సి వచ్చింది . దాంతో కథ లేకుండా కేవలం హీరోయిన్ తో పాటలు, అలీ కామిడీ, విలన్స్ వినాయిక్ సినిమాలోలాగ ఫొటోలు పట్టుకు తిరగే ఎపిసోడ్లు తో ఫస్టాఫ్ నింపేశారు. ఇక సెకెండాఫ్ లో కథ మొత్తం ఒకే సారి చెప్పాల్సి వచ్చి రెండు ఫ్లాష్ బ్యాక్ లు వరసగా వేసారు. ఒకటి హీరో తన చెల్లి నుండి ఎట్లా విడిపోయాడు, విలన్ తో తగువు ఎలా వచ్చిందనేది రెండు ముక్కలుగా చూపాల్సి వచ్చింది. దాంతో హీరోయిన్ కథలోకి గానీ, హీరో సమస్యలోకి గానీ రాకుండా దూరంగా ఉండి కేవలం ఫ్లాష్ బ్యాక్ వినటానికే సరిపోయింది.ఇక సెంటిమెంటు,సస్పెన్స్ కలవవు అనేది బేసిక్ రూల్. చెల్లెలు తో విడిపోయాడన్న విషయం సెకెండాఫ్ సగం దాకా తెలియచేయకుండా సస్పెన్స్ చేయటంతో అప్పటి దాకా రావాల్సిన ఎమోషన్ సన్నివేశాలు పండలేదు. విలన్స్ ని ఫస్టాఫ్ లో చావకొడుతున్నా ఒక్క విజిలూ పడదు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పోలీస్ ఎపిసోడ్ హాలీవుడ్ క్రాంక్ సినిమాలోని విషం ఎపిసోడ్ ని గుర్తు చేస్తుంది.

    టెక్నికల్ గా కెమెరామెన్ డైరక్టర్ అయినప్పుడు విజువల్స్ తో కథ చెబుతాడని ఎవరైనా ఊహిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా రెగ్యులర్ దర్శకుల్లాగే డైలాగులతో కథనం నడిపారు. ఇక గోపీచంద్ కీ ఇలాంటి పాత్రలు కెరీర్ ప్రారంభం నుండీ చేస్తున్నవే కాబట్టి వైవిధ్యం చూపటానికి వీలు లేకుండా పోయింది. అనూష్క దీ సేమ్ సిట్యువేషన్..గ్లామర్ డాల్ గా మిగిలిపోయింది. ఇక మాయాజాలం(శ్రీకాంత్) సినిమాలో హీరోయిన్ గా చేసిన పూనమ్ కౌర్ ఈ చిత్రంలో చెల్లిగా చేసింది. ఫర్వాలేదనిపించేలా చేసింది కాబట్టి ఇలాంటి పాత్రలు వరస కట్టే అవకాశం ఉంది. కమిడియన్లలో సిక్స్ పాక్ ట్రెండ్ ని సెటైర్ చేస్తూ అలీ కనిపించినా కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, రఘుబాబే బాగా నవ్వించారు.
    అజయ్ విలనీ కూడా పెద్ద చెప్పుకునే విధంగా లేదు. ఇక అనూష్క బాత్ రూమ్ సీన్ ఒక వర్గాన్ని బేస్ చేసుకుని చేసినా పెద్ద ఇంపాక్ట్ కనపడదు. అలాగే కలకత్తా అని తెరపై చూపేది హైదరాబాద్ లా కనపడటం దర్శకుడి వైఫల్యమే. సంగీతం ఈ సినిమాకు మరో మైనస్. అంతే గాక గోపీచంద్ కిఇంకా కాలేజీలో చదివే సీన్లు ఎందుకు పెడుతున్నారో అర్ధం కాదు.

    ఏదైమైనా పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దాలన్న దర్శకుడు తాపత్రయ పడినంతగా వర్కవుట్ కాకపోయినా వయిలెన్స్ ని ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. బి,సి సెంటర్లకు బాగా పట్టే అవకాశం ఉంది. అయినా ఫ్యామిలీలు మాత్రం దూరంగానే ఉండటంతో యావరేజ్ గా మిగులుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X