Telusu Kada Twitter Review: తెలుసు కదా మూవీ ట్విట్టర్ రివ్యూ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం తెలుసు కదా. నీరజ కోన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా... రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. వైవా హర్ష, రవి మరియా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వీఎస్ జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు.
గతంలో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తెలుసు కదాపై అంచనాలు నెలకొన్నాయి. భారీగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్, ట్రైలర్ల విడుదల తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అక్టోబర్ 17వ తేదీన తెలుసుకదా మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు అక్టోబర్ 16వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

ఒక క్రేజీ రోమ్ కామ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ స్టార్ డే. సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్‌లోనే అత్యుత్తమ నటనను కనబరిచారు. దర్శకురాలు నీరజ కోన చాలా బాగా డీల్ చేశారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి తమ పనిని అద్భుతంగా చేశారు. సినిమా బాగుంది చూడండి మిస్ అవ్వొద్దంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ సిద్ధూ జొన్నలగడ్డయే. భావోద్వేగభరితంగా ఉన్నప్పటికీ సినిమా వినోదాత్మకంగా ఉంది. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు బాగుంది. కథ కొత్తగా ఉండి.. గొప్ప సందేశం ఇస్తుంది. తెలుసు కదా మూవీ టీమ్‌కి అభినందనలు అని ఓ యూజర్ పోస్ట్ చేశాడు.
సిద్ధూ జొన్నలగడ్డ ఈ చిత్రానికి మెయిన్ నైట్ లైట్. హర్ష స్క్రీన్ మీద ఉన్నంత సేపు కామెడీ మాత్రం సూపర్‌గా ఉంది. 18 ప్లస్ సీన్స్ ఏం లేవు.. ఓవరాల్‌గా బాగుంది.. హిట్ బొమ్మ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
ఇటీవలి కాలంలో చూసిన అత్యుత్తమ పాత్రలలో ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ రోల్ ఒకటి. హర్ష కామెడీ టైమింగ్ పీక్స్‌లో ఉంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో. థియేటర్‌లలో మిస్ అవ్వొద్దు మిత్రులారా.
నా షో ఇప్పుడే పూర్తయ్యింది. అందమైన కథ, మంచి ఇంటర్వెల్ సీన్, పర్ఫెక్ట్ ఎండింగ్. మీ దగ్గరిలోని థియేటర్‌లలో మిస్ అవ్వకండి. హిట్ బొమ్మ.. నా రేటింగ్ 3.5/5 అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
ప్రేమ, నవ్వులు, భావోద్వేగాలతో కూడిన రిఫ్రెషింగ్ రొమాంటిక్ రైడ్ ఇది. సిద్ధూ జొన్నలగడ్డ తన యాక్టింగ్, ఎనర్జీతో మెరిసిపోయాడు. ఇద్దరు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. నీరజ కోన పర్ఫెక్ట్ డెబ్యూతో ఆకట్టుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరో విన్నర్. తప్పకుండా చూడండి అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
సిద్ధూ అన్న యాక్టింగ్ చించేశాడు.. రాశీ, శ్రీనిధి శెట్టిల నటన సూపర్. సినిమాటోగ్రఫి, కథ, సినిమాలోని ప్రతీది సూపర్. సిద్ధూ అన్నకి కమ్ బ్యాక్ ఫిల్మ్. బొమ్మ సూపర్ హిట్ అని యూజర్ రాసుకొచ్చాడు
మన జెన్ - Z బ్యాచ్‌కి చాలా కనెక్ట్ అయ్యే ఫిల్మ్ ఇది. వరుణ్ క్యారెక్టర్‌తో పక్కా రిలేట్ అవుతారు. స్లో పేస్ ఉన్నా చాలా ఎంగేజింగ్‌గా తీశారు.. కుద్దూస్ అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు
నేటి యువతకు బాగా సరిపోయే సంఘర్షణతో కూడిన ఆధునిక సంబంధాలను అన్వేషించే చిత్రం తెలుసు కదా. దర్శకురాలు తన మొదటి ప్రయత్నంలోనే స్పష్టమైన రచన, ప్రధాన తారాగణం నుంచి బలమైన ప్రదర్శనలను రాబట్టి, ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేసింది. రెండు పాటలు, అర్బన్ యూత్‌ని లక్ష్యంగా చేసుకున్న హాస్యం ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. సహజమైన నేపథ్యమే అయినా.. కథను బాగా ఎగ్జిక్యూట్ చేసి సినిమాను విజయవంతం చేశారు అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు


Click it and Unblock the Notifications











