twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్వాలేదనిపించే కామెడీ చిత్రం

    By Staff
    |

    Tenali
    -జలపతి గూడెల్లి
    చిత్రం: తెనాలి
    నటీనటులు: కమల్‌ హాసన్‌, జయరాం, జ్వోతిక, దేవయాని
    సంగీతం:ఏ.ఆర్‌.రెహమాన్
    నిర్మాత: ఎస్పీ బాలసుబ్రమణ్యం
    దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌

    అనవసరమైన మేకప్‌ లు, గెటప్‌ లు లేకుండా కమల్‌ నటించిన తాజా చిత్రం తెనాలి పూర్తిస్థాయి కామెడీ చిత్రం. ఒక పిరికివాడి మనస్థత్వం గురించి తీసిన ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం. ఫస్ట్‌ హాఫ్‌ అంతా నవ్వులమయమే. అయితే కమల్‌ చేసే విన్యాసాలు కొన్ని 'అతి'గా ఉండడం చిరాకు కలిగిస్తుంది. అయితే అసలే కామెడీ సినిమాలు కరువైన ఈ రోజుల్లో ఈ సినిమా రిలీఫ్‌ లాంటిది. అప్పుల అప్పారావు, ఏప్రిల్‌ 1 విడుదల లాగా కడుపుబ్బ నవ్వించే చిత్రం కాకపోయినా, రోటిన్‌ తెలుగు సినిమా కామెడీ కన్నా కాస్తా బెటరే.

    తెనాలి రాముడు(కమల్‌ హాసన్‌)కి ప్రపంచంలో ఏది చూసినా భయమే. దేన్ని తలచుకున్నా భయమే. అలాంటి ఈ తెనాలి మానసిక నిపుణుడు పంచభూతం దగ్గరికి వస్తాడు. పంచభూతం పేరుకే మానసిక నిపుణుడు. కానీ ఏమీ తెలియదు. సో.. ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్‌ లు ఎవరూ ఉండరు. మరో ఫేమస్‌ సైక్రియాట్రిస్ట్‌ జయరాం దగ్గరికి వచ్చే పేషెంట్‌ ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంటుంది. జయరాంను దెబ్బతీసేందుకు తన పేషెంట్‌ తెనాలిని ప్రయోగిస్తాడు. తెనాలి జయరాం పేషెంట్‌ గా మారుతాడు. ఇక తెనాలిని వదులుకునేందుకు జయరాం పడే కష్టాలే ఈ సినిమాలోని హాస్య సన్నివేశాలు.

    కమల్‌ నటన బావుంది. కానీ కొంచెం అతిగా నటించడమే ఇబ్బంది. కథ అంతా తెనాలి చుట్టూ తిరిగినా జయరాం తన నటనతో ఆకట్టుకున్నాడు. దేవయాని, జ్వోతికల పాత్రలు కేవలం సపోర్టివ్‌ క్యారెక్టర్స్‌. డైరక్టర్‌ కె.ఎస్‌.రవికుమార్‌ స్క్రీన్‌ ప్లే మీద కాస్తా దృష్టి సారిస్తే బావుండేది. సెకండ్‌ హాఫ్‌ లోనే అన్ని పాటలు జొప్పించి ప్రేక్షకులు బోర్‌ ఫీలయ్యేలా చేశాడు. ఎ.ఆర్‌.రెహమాన్‌ తన కెరీర్‌ లోనే ఇంత పేలవమైన సంగీతం అందించడం ఇదే మొదటిసారి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X