For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెర వెనుక మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating: 2.5/5

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించిన తెర వెనుక చిత్రం కొత్త సంవత్సరం వేడుకలు పురస్కరించుకొని జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి వీ ప్రవీణ్ చంద్ర దర్శకత్వం వహించగా, మురళి జగన్నాథ్ మచ్చ నిర్మించారు. అయితే తెర ముందు అమన్ ప్రీత్ సింగ్ ఆకట్టుకొన్నాడా? అసలు ఈ చిత్ర కథ, కథనాలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం...

  సంజయ్ (అమన్ ప్రీత్ సింగ్)కు సమాజ సేవ అంటే ఎంతో ఇష్టం. అనాథ శవాలను దహనం చేసే బాధ్యతాయుతమైన కార్యానికి పూనుకొంటాడు. ఈ క్రమంలో అంజలి (విశాఖ ధీమాన్)తో ప్రేమలో పడుతారు. తన తండ్రి (ఆనంద చక్రపాణి)కి తెలియకుండా ప్రియుడితో అంజలి జల్సాలు చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్రియుడితో శృంగారం చేస్తున్న వీడియో కొందరు బయటపెట్టి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారు. కేవలం అంజలినే కాకుండా చాలా మందిని అలా వీడియోలు తీసి డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ (శ్వేత వర్మ) రంగంలోకి దిగుతుంది.

  బ్లాక్‌మెయిల్‌ గురైన అంజలి జీవితం ఏమైంది? సంజయ్ తన ప్రియురాలిని ఆపద నుంచి కాపాడుకొనేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు సంజయ్ నిజ స్వరూపం ఏమిటి? అసభ్య, అశ్లీల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసే ముఠాను పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఎదుర్కొన్నది అనే ప్రశ్నలకు సమాధానం తెర వెనుక చిత్ర కథ.

  Tera Venuka movie review and rating

  ఓ క్రైమ్ థ్రిల్లర్ కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాకు ఉన్నాయి. పెన్ డ్రైవ్ ఎపిసోడ్ సినిమాకు ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ అనిపిస్తాయి. సమకాలీన పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలకు తెర రూపం కల్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రవీణ్ చంద్ర. రాము కంద సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మాస్, క్లాస్ అంశాలతో రఘురాం రూపొందించిన పాటలు బాగున్నాయి.

  సంజయ్‌గా అమన్ ప్రీత్ సింగ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపిస్తాడు. నటన పరంగా ఇంకా చాలా మెచ్యురిటీని సాధించాల్సింది. కీలకమైన పాత్రను సమర్ధవంతంగా పోషించే ప్రయత్నం చేశాడు. ఇక అంజలిగా విశాఖ ధీమన్ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. ఈ చిత్రంలో మహిళా పోలీస్ ఆఫీసర్‌గా నటించిన శ్వేత వర్మ మంచి మంచి మార్కులు కొట్టేసింది. ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకనుగుణంగా ఫర్వాలేదనిపించారు. విలన్‌ బ్యాచ్‌లో దీపిక రెడ్డితోపాటు మిగితా ఆర్టిస్టులు బాగా నటించారు.

  ఇక దర్శకుడు ప్రవీణ్ చంద్ర విషయానికి వస్తే ఇప్పటికే బెల్స్, బంతిపూల జానకీ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితులు. మూడో ప్రయత్నంగా తెర వెనుక చిత్రాన్ని రూపొందించారు. సమాజంలో ఆడపిల్లలను, మధ్య తరగతి కుటుంబాలను టార్గెట్ చేసుకొని చేస్తున్న అక్రమాలను కథాంశాంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేమ పేరుతో అమ్మాయిలు ఎలా వంచించ బడుతున్నారనే విషయాన్ని స్పష్టంగా చూపించారు. కథకు తగినట్టుగా మంచి నటీనటులను, సపోర్టింగ్ యాక్టర్లను ఎంచుకొంటే ఈ చిత్రం మరింత ప్రేక్షకాదరణ పొందేది. మొత్తానికి ఓ సామాజిక అంశాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తాయి.

  English summary
  Tera Venuka movie review: Tollywood's popular actress Rakul preet Singh's brother Aman Preet Singh introduced to tollywood with Tera Venuka movie. This movie released on January 1st. Directed by V Praveen Chandra and Produced by Murali Jagannadh Machcha
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X