For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The American Dream review : చాలా కాలం తరువాత ప్రిన్స్ హీరోగా సినిమా.. ఎలా ఉందంటే?

  |

  Rating:
  2.0/5

  స్ట్రీమింగ్ : ఆహా
  నటీనటులు: ప్రిన్స్ సిసిల్, నేహా కృష్ణ, రవితేజ ముక్కవల్లి, శుభలేఖ సుధాకర్ తదితరులు
  దర్శకుడు: డాక్టర్ విఘ్నేష్ కౌశిక్
  నిర్మాత: డా.ప్రదీప్ రెడ్డి
  సంగీత దర్శకుడు: అభినయ్ టీజె
  సినిమాటోగ్రఫీ: అదమ్‌ చప్‌మన్, అభిరాజ్ నాయర్
  ఎడిటర్ : శశాంక్ ఉప్పుటూరి

  ప్రపంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌కు 100 ప‌ర్సెంట్ తెలుగు కంటెంట్ అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రారంభ‌మైన తెలుగు ఓటీటీ ఆహా. ప్రతి శుక్రవారం ఒక్కో కొత్త తెలుగు సినిమా అందిస్తూ అల‌రిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. యంగ్ హీరో ప్రిన్స్ హీరోగా ది అమెరికన్ డ్రీమ్ రూపొందింది. యంగ్ హీరో ప్రిన్స్‌ సెసిల్, నేహా కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ చిత్రం 'ది అమెరికన్‌ డ్రీమ్‌'. డా. విఘ్నేష్ కౌశిక్ దర్శకత్వంలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఆహాలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

  ది అమెరికన్‌ డ్రీమ్‌ కధ :

  ది అమెరికన్‌ డ్రీమ్‌ కధ :


  రాహుల్(ప్రిన్స్) ఎలా అయినా అమెరికా వెళ్లి డబ్బు సంపాదించాలని కలలు సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఎలాగో కష్టపడి తన తండ్రి(శుభలేఖ సుధాకర్) అప్పు చేసిచ్చిన డబ్బుతో ఉద్యోగం కోసం అమెరికాకి వెళ్తాడు. అనేక ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైన తర్వాత రియా వర్మ(నేహా)ను కలుస్తాడు. ఆ తర్వాత ఈ జంట మధ్య ఎలాంటి ఎమోషన్స్ లేని రిలేషన్ షిప్ ఏర్పడుతుంది. మరో పక్క అమెరికా ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరదు. ఒక హత్య కేసులో చిక్కుకున్న తర్వాత అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. రాహుల్‌కు ఏమి జరుగుతుంది? డబ్బు సంపాదించాలనే అతని ఆశయం నెరవేరిందా? అనేదే సినిమా మొత్తం కథాంశం.

  ది అమెరికన్‌ డ్రీమ్‌ లో ట్విస్టులు

  ది అమెరికన్‌ డ్రీమ్‌ లో ట్విస్టులు

  సినిమా మొదలైనప్పటి నుంచి చివరి పావుగంట వరకు ఎలాంటి ఆసక్తి లేకుండా సినిమా సాగుతూ ఉంటుంది. సినిమా కధ ఏంటి అనే విషయాన్ని సినిమా మొదలైన కాసేపటికే చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించారు. కానీ ఈ అమెరికన్ డ్రీమ్ సినిమా దాదాపు పూర్తిగా క్లైమాక్స్‌లో ఉన్న పెద్ద ట్విస్ట్‌ మీదనే ఆధారపడి ఉంటుంది. మర్డర్ స్టోరీ అనుకుంటారు కానీ చివరి పావుగంటలో వెల్లడయ్యే ట్విస్ట్ సినిమా మొత్తం మీద ఉన్న ఒపీనియన్ ను మార్చివేసింది. ఇక సినిమా మొత్తం మీద చెప్పుకోదగ్గ ట్విస్ట్ కూడా అది ఒక్కటే. డబ్బు సంపాదించే ఉద్దేశంతో తండ్రి, స్నేహితుడు, ప్రియురాలిని వదులుకుని అమెరికా వెళ్లిన రాహుల్ ఆ డబ్బు ఎలా సంపాదించి వెనక్కు వచ్చాడు అనేదే సినిమా కధ.

  విశ్లేషణ :

  విశ్లేషణ :

  అమెరికన్ డ్రీమ్ అనేది తెలుగు యువతను ఆకట్టుకునే టైటిల్, అలాగే సబ్జెక్ట్ కూడా. దర్శకుడు డాక్టర్ విఘ్నేష్ కౌశిక్ సరైన కంటెంట్ తో సినిమా మొదలు పెట్టి ఉండచ్చు కానీ దాన్ని సరైన కథనం జత చేసి తెర మీద చూపించలేకపోయారు. సంపాదనే ధ్యేయంగా యూఎస్ వెళ్లాలని ప్లాన్ చేసుకునే యువత పడే కష్టాలతో సినిమా మొదటి భాగం సాగుతుంది. వాస్తవాన్ని తెలుసుకోకుండా యుఎస్ వెళ్లి అక్కడ ఏదో ఒక జాబ్ సంపాదిస్తే తన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాహుల్ నమ్మి అక్కడికి వెళ్లి ఎలాంటి జాబ్ దొరక్క బొక్కబోర్లా పడడం నేటి యువత బాగా కనెక్ట్ అయ్యే అంశం. ఇలాంటి వాటిని లైటర్ నోట్ లో కామెడీగా గతంలో కొన్ని సినిమాలు చూపించాయి. కానీ అనుకోకుండా విషయాలు ఊహించని తీవ్రమైన మలుపు తీసుకుంటాయి. మొదట కొంత సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది కానీ చివరికి చేరే కొద్దీ సినిమా మీద ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈ సినిమా థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికీ నచ్చి తీరే సినిమా ఇది.

  డైరెక్షన్ ఎలా ఉందంటే:

  డైరెక్షన్ ఎలా ఉందంటే:

  దర్శకుడు కౌశిక్ మంచి కథాంశాన్ని ఎంచుకున్నాడు, ఎమోషనల్ పార్ట్ ని బాగా హ్యాండిల్ చేశాడు కానీ కథనం మీద ద్రుష్టి పెట్టకపోవడంతో లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. తండ్రీ కొడుకుల బంధాన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేసారు కానీ లవ్ ని కూడా కాస్త బలంగా ఉండేలా రాసుకుని ఉంటే బాగుండేది. లవ్ యాంగిల్ ను కథనంలో బలవంతంగా చొప్పించినట్టు కనిపిస్తుంది ఆ కారణంగా, ప్రేక్షకులను బోర్ కొట్టే సన్నివేశాలు రిపీట్ అవుతాయి. అయితే సినిమా ఎక్కువగా అమెరికాలో జరుగుతింది. దర్శకుడికి పరిసరాలు బాగా తెలుసు కాబట్టి చాలా సన్నివేశాల్లో రియలిస్టిక్ టచ్ ఇచ్చాడు. సినిమా గందరగోళంగా ఉందని అనుకునే లోపే కీలక ట్విస్ట్ ఇచ్చి ఆకట్టుకున్నాడు దర్శకుడు. రాసుకున్నప్పుడు కధగా బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లే పరంగా శ్రద్ధ పెట్టకపోవడంతో క్లారిటీ మిస్ అయింది. ఇక మరింత క్లారిటీతో హడావిడి లేకుండా చేసి ఉంటే, ది అమెరికన్ డ్రీమ్ తన లక్ష్యాన్ని సాధించి ఉండేది.

  ప్రిన్స్ పెర్ఫార్మెన్స్

  ప్రిన్స్ పెర్ఫార్మెన్స్

  చాలా కాలం తర్వాత ప్రిన్స్‌ ప్రధాన పాత్రలో నటించాడు. రాహుల్ పాత్ర ప్రిన్స్‌కి పెర్ఫార్మర్‌గా మూడు విభిన్న షేడ్స్‌ని అందించింది. యుఎస్‌లో తన మనుగడ పోరాడుతున్న భారతీయ యువకుడిగా, ఎలా అయినా యుఎస్‌ వెళ్లి డబ్బు సంపాదించే వ్యక్తిగా అలాగే సినిమా చివరి భాగంలో సినిమా జానర్ మారిపోవడంతో అతని నటనకు కూడా మంచి స్కోప్ దక్కింది. ప్రిన్స్‌ మునుపటి పాత్రలతో పోలిస్తే, అతని నటన కొంచెం మెరుగ్గా ఉంది. హీరోయిన్ నేహా కృష్ణ కొత్త నటి అని ఈజీగా అర్ధం అయ్యే విధంగా ఆమె నటన ఉంది. ఇక సీనియర్ నటుడు సుభలేఖ సుధాకర్ తన ఎమోషనల్ డైలాగ్స్ సహా సెంటిమెంట్‌తో సినిమాకు ఎమోషనల్ కంటెంట్ ఇచ్చారు. మిగతా నటీనటులు ఎవరో తెలియదు కానీ తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.

  సాంకేతిక వర్గ పనితీరు విషయానికి వస్తే

  సాంకేతిక వర్గ పనితీరు విషయానికి వస్తే

  అభిరాజ్ నాయర్ - ఆడమ్ చాప్‌మన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ సినిమాను వేరే లెవల్ కు తీసుకువెళ్ళింది. అభినయ్ టీజే సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త మిశ్రమ స్పందనతో పర్వాలేదు అనిపించాయి. కాస్త బిగ్గరగా ఉన్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా ఉంది. శశాంక్ వుప్పుటూరి ఎడిటింగ్ పర్వాలేదు, ఆయన తన కత్తెరకు మరింత పని చెబితే బాగుండేది. ప్రొడక్షన్ డిజైన్ బాగానే ఉంది. డైలాగ్స్ నీట్ గా ఉన్నాయి కానీ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ డల్ గా ఉంది.

  ఫైనల్ గా:

  ఫైనల్ గా:


  ఓవరాల్ గా ది అమెరికన్ డ్రీమ్ రెండు విభిన్నమైన జానర్ లు కూడిన సినిమా. ఒకటి పూర్తి డ్రామా అయితే మరొకటి థ్రిల్లర్. ఈ సినిమా భాగాలుగా కొందరికి నచ్చవచ్చు, కానీ మొత్తంమీద అందరికీ నచ్చే అవకాశాలు తక్కువే. సినిమా మొత్తం పొడిగించిన షార్ట్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. అయితే ఈ వీకెండ్ ఒకభిన్నమైన సినిమా చూడాలనుకుంటే, చాలా తక్కువ అంచనాలతో ఈ సినిమా చూసేందుకు ప్రయత్నించండి.

  English summary
  The American Dream review and rating in telugu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion