twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెల్లవారితే గురువారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: శ్రీ సింహ, చిత్ర శుక్ల, మిషా నారంగ్, రాజీవ్ కనకాల, సత్య
    Director: మణికాంత్ గెల్లి

    దర్శకత్వం: మణికాంత్ గెల్లి
    నిర్మాతలు: రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
    రచన: నాగేంద్ర పిల్లా
    సినిమాటోగ్రఫి: సురేశ్ రగుతు
    మ్యూజిక్: కాల భైరవ
    ఎడిటింగ్: సత్య గిడులూరి
    బ్యానర్లు: వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
    రిలీజ్: 2021-03-27

    కథ ఏమిటంటే...

    కథ ఏమిటంటే...

    వీరేంద్ర (శ్రీ సింహా)కు, మధు (మిషా నారంగ్)కి తెల్లవారితే పెళ్లి అనగా కుటుంబ సభ్యులు రిసెప్షన్ నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల బలవంతం మీద అయిష్టంతోనే పెళ్లికి ఒప్పుకొంటారు. అయితే చివరి నిమిషంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వీరేంద్ర, మధు పెళ్లి మంటపం నుంచి నుంచి పారిపోతారు.

     తెల్లవారితే గురువారంలో ట్విస్టులు

    తెల్లవారితే గురువారంలో ట్విస్టులు

    పెళ్లి జరిగే కొద్ది గంటలకు ముందు ఫంక్షన్ హాల్ నుంచి పారిపోయిన వారి జీవితంలో ఏం జరిగింది. మధును వీరేంద్ర పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరిస్తాడు? అలాగే వీరేంద్రతో పెళ్లికి ఎందుకు మధు వెనకడుగు వేస్తుంది? వీరేంద్ర, కృష్ణవేణి ప్రేమ కథ కు ముగింపు ఏమిటి? పెళ్లికి ముందు పారిపోయి వచ్చిన మధు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే తెల్లవారితే గురువారం సినిమా కథ.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    పెళ్లి మంటపం నుంచి మధుతో పారిపోయిన వీరేంద్ర తన జీవితంలోని ప్రేమకథను చెప్పడం ప్రారంభిస్తాడు. కృష్ణవేణి తన జీవితంలోకి ప్రవేశించింది. తనంటే ఎంత ప్రేమ అనే విషయంతో ఫ్లాష్ బ్యాక్‌లోకి కథ వెళ్తుంది. అయితే కథకు కావాల్సిన వేగం, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎక్కడా కనిపించవు. చాలా రొటీన్ సీన్లతో అలా సాగిపోతుంది. ప్రేమ కథ కావాల్సిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లోపించడంతో కథ అంతగా ఆకట్టుకొన్నట్టు అనిపించదు.

    సెకండాఫ్ గురించి

    సెకండాఫ్ గురించి

    ఇక తనకు పెళ్లి అంటే ఎందుకు అయిష్టత అనే విషయాన్ని మధు పంచుకొంటుంది. పెళ్లిపై కలిగిన అయిష్టత అంతగా కన్విన్సింగ్‌గా ఉండదు. చాలా ఎమోషనల్ పాయింట్‌ను చాలా తేలికగా చెప్పడం కథను ఎలివేట్ చేసే పాయింట్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే వీరేంద్రను ఎందుకు కృష్ణవేణి వదులుకొంటుందనే పాయింట్‌ను బలంగా చెప్పలేకపోవడం మరో మైనస్ అని చెప్పవచ్చు. దీంతో ఎమోషనల్‌గా సాగాల్సిన ప్రేమ కథలు సాదాసీదాగా ముగుస్తాయి. అంతా ఊహించినట్టే జరుగుతండటం సినిమాపై ఆసక్తి కొరవడేలా చేసింది. క్లైమాక్స్ ముందు వచ్చే అజయ్ ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోలేకపోవడం, అదీగాక ఆ సీన్లు సినిమాకు అతికించినట్టు ఉండటం మరో మైనస్ అనిచెప్పవచ్చు

     శ్రీ సింహ యాక్టింగ్

    శ్రీ సింహ యాక్టింగ్

    కథ, కథనాలను పక్కన పెడితే.. శ్రీ సింహ తన పాత్ర పరిధి మేరకంటే ఎక్కువగానే న్యాయం చేశాడని చెప్పవచ్చు. స్క్రిప్టు బలంగా ఉంటే డెఫినెట్‌గా శ్రీ సింహకు మంచి పేరు వచ్చే అవకాశం ఉండేది. నాసిరకమైన కథను వీరేంద్ర పాత్ర ద్వారా మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు శ్రీ సింహ ప్రయత్నించాడనే చెప్పవచ్చు. కొన్ని సీన్లలో నటనపరంగా మెచ్యురిటీ కనిపించింది.

    హీరోయిన్ల పెర్ఫార్మెన్స్

    హీరోయిన్ల పెర్ఫార్మెన్స్

    ఇక మధుగా మిషా నారంగ్, కృష్ణవేణిగా డాక్టర్ పాత్రలో చిత్రా శుక్ల ఫర్వాలేదనిపించారు. వారి వారి పాత్రల మేరకు జస్టిఫై చేశారు. తమ పాత్రలకు సంబంధించి బలమైన కంటెంట్ లేకపోవడం వల్ల నటనకు ఎక్కువగా స్కోప్ లభించలేదు. మిషా తన గ్లామర్‌తోను, నటనతోను ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో ముఖ్యంగా సత్య తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. అలాగే వైవా హర్ష కూడా హెల్తీ హ్యూమర్‌ను పండించారు.

    సాంకేతిక విభాగాల పనితీరు...

    సాంకేతిక విభాగాల పనితీరు...

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే... తెల్లవారితే గురువారం సినిమాకు సంబంధించి కాలభైరవ అందించిన మ్యూజిక్ ఆకట్టుకొన్నది. పాటలు సిట్యుయేషన్‌ పరంగా అలరించాయి. ప్రధానంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫి మూవీకి ప్లస్ అయింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ వారాహి బ్యానర్‌కు తగినట్టుగా ఉన్నాయి.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్
    మ్యూజిక్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    కథ, కథనాలు
    పేలవమైన సన్నివేశాలు
    సాగదీత

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    లవ్, రొమాంటిక్, భావోద్వేగాలు, హాస్యం అంశాల కలబోతతో రూపొందిన చిత్రం తెల్లవారితే గురువారం. అయితే అయితే కథ, కథనాలు అంతగా ఆకట్టుకోలేకపోవడంతో అన్ని అంశాలు యావరేజ్‌గానే ఉన్నాయనే చెప్పవచ్చు. మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌ను సంతృప్తి పరిచే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే ఈ సినిమా భవిష్యత్ ఆధారపడి ఉండొచ్చు.

    English summary
    Thellavarithe Guruvaram is an film directed by Manikanth Gelli and jointly produced by Rajani Korrapati and Ravindra Benerjee Muppaneni under the banners of Vaaraahi Chalana Chitram and Loukya Entertainments. The film features Sri Simha, Chitra Shukla and Misha Narang in the lead roles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X