twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొలిప్రేమ మూవీ రివ్యూ: వరుణ్ పెర్ఫార్మెన్స్ అదుర్స్

    By Rajababu
    |

    Recommended Video

    Tholi Prema Review తొలిప్రేమ మూవీ రివ్యూ

    Rating:
    3.5/5
    Star Cast: వరుణ్ తేజ్, రాశీ ఖన్నా, హైపర్ ఆది
    Director: వెంకీ అట్లూరి

    ముకుంద చిత్రం నుంచి విభిన్నమైన పాత్రలను, వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకొంటూ మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకొంటున్నాడు. కంచె చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. ఫిదాతో సగటు ప్రేక్షకుడి గుండెల్లో స్థానం సంపాదించుకొన్నాడు. ఫిదా లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం తొలిప్రేమ.

    ఈ చిత్రానికి వెంకీ అట్లూరి తొలిసారి దర్వకత్వం వహించారు. అందమైన ప్రేమకథ అని చెప్పుకొంటున్న ఈ చిత్రంలో అందాల తార రాశీఖన్నా జంటగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న రిలీజ్‌కు సిద్దమైంది. వరుణ్, రాశీఖన్నాల కెమిస్ట్రీ తెరపైన ఏ విధంగా వర్కవుట్ అయింది? వరుణ్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని అందించిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    తొలిప్రేమలో పడ్డారిలా

    తొలిప్రేమలో పడ్డారిలా

    ఆదిత్య శేఖర్ (వరుణ్ తేజ్) మనసుకు నచ్చింది చేసే ముక్కుసూటి మనస్తత్వం ఉన్న యువకుడు. ట్రైయిన్‌లో వర్ష (రాశీఖన్నా) తారసపడిన మరుక్షణమే తొలి ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజీలో చేరుతారు. అంతా సవ్యంగా జరిగిపోతున్న సమయంలో ఓ కారణంగా వారిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆరేళ్లకు లండన్‌లో కలుసుకొంటారు.

    కోపతాపాలకు క్లైమాక్స్ ఇలా..

    కోపతాపాలకు క్లైమాక్స్ ఇలా..

    ఎంతో గాఢంగా ప్రేమించుకొన్న ఆదిత్య, వర్ష విడిపోవడానికి బలమైన కారణమేమిటి? పీకల్లోతు కోపంతో ఉన్న ఆదిత్య వర్ష మళ్లీ కలుసుకొన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడు? వారి మధ్య విభేదాలు, కోపతాపాలు తగ్గి మళ్లీ ఒక్కటైపోవడానికి ఎలాంటి పరిస్థితులు, సంఘటనలు వారి జీవితంలో చోటుచేసుకొన్నాయి. ఆదిత్యపై ప్రేమను రుజువు చేసుకోవడానికి వర్ష ఏ విధంగా స్పందించింది. వర్షపై తనకు ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి ఆదిత్య ఏమి చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే తొలిప్రేమ కథ.

     తొలి ప్రేమ ఫస్టాఫ్

    తొలి ప్రేమ ఫస్టాఫ్

    వరుణ్, రాశీల మధ్య తొలిప్రేమ రైల్లో పుట్టడం ద్వారా వారి జీవితం ప్రారంభమవుతుంది. ఓకే కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, సహచరులు మధ్య ఆటపట్టించే సన్నివేశాలతో చకచక కథ సాగిపోతుంటుంది. ప్రేమలో ఇష్టాఅయిష్టాలను, ప్రేమానురాగాలను చిన్న సంఘటనలు, సన్నివేశాల ద్వారా సినిమా ఆసక్తిగా మారుతుంది. ఓ ఇగో కారణంగా వరుణ, రాశీ విడిపోవడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.

     సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో బ్రేకప్ మెమోరీస్ నుంచి బయటపడటానికి ఆదిత్య లండన్‌కు వెళ్లిపోతాడు. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని తన ప్రాణస్నేహితుడు ప్రియదర్శితో, ఇతర స్నేహితులతో ఉద్యోగంలో చేరిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఆదిత్య జీవితంలోకి వర్ష మళ్లీ ప్రవేశిస్తుంది. వారి మధ్య మళ్లీ ప్రేమ చిగురించి ఒక్కటవ్వడం ద్వారా సినిమా ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌తో ముగుస్తుంది.

     దర్శకుడు వెంకీ టాలెంట్

    దర్శకుడు వెంకీ టాలెంట్

    సమకాలీన పరిస్థితుల్లో ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలు సాదాసీదాగా ఉండే చిన్న లైన్‌తో కథ రూపొందించుకొన్నారు. కానీ బలమైన సన్నివేశాలు, వాటికి మాటల తోడవ్వడంతో సినిమా ఎంతో మధురంగా మారుతుంది. ప్రథమార్థంలో రైల్వే స్టేషన్, కాలేజ్ సీన్లు చక్కగా డీల్ చేశాడు. ఆదిత్యకు వర్ష ఐ లవ్ యూ చెప్పే సీన్, బ్రేకప్ సీన్ లాంటి తెరకెక్కించిన విధానం వెంకీ ప్రతిభకు అద్దం పడుతుంది. ఇక సెకండాఫ్‌లో వర్ష, ఆదిత్యలు ఒకటి కావడానికి ఎంచుకొన్న స్కీమ్ సినిమాను మరోస్థాయికి సినిమాను చేర్చింది. ప్రియదర్శి ప్రేమను పెళ్లిగా మార్చేందుకు తెరపై ఆవిష్కరించిన సీన్ ఆయన టేకింగ్‌లో ఉండే డెప్త్‌ను చెబుతుంది. ప్రేమికుల మధ్య ఉండే సాదాసీదా పరిస్థితులతో చక్కటి భావోద్వేగంగా చిత్రంగా తొలిప్రేమను మలచడంలో వెంకీ అట్లూరి పూర్తిగా సఫలమయ్యాడు.

    అదరగొట్టిన వరుణ్ తేజ్

    అదరగొట్టిన వరుణ్ తేజ్

    ఆదిత్యగా వరుణ్ తేజ్ ఈ జనరేషన్ యువకుడి మనస్తత్వానికి ప్రతీక. యువకుల్లో ఆలోచనకు ముందు ఉండే ఆవేశాన్ని ఆదిత్య పాత్ర చూపుతుంది. ఆదిత్య పాత్రలో వరుణ్ తేజ్ అద్బుతంగా కనిపించాడు. గొప్పగా ఫెర్మార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఆదిత్య పాత్రలో వరుణ్ చూపిన పరిణతి ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పవచ్చు. మూడు రకాల విభిన్నమైన షేడ్స్‌లో వరుణ్ అదరగొట్టాడు. అవకాశం ఉన్న ప్రతీ చోట తన ప్రతిభతో రాటుదేలాడు. మెగా హీరోల్లో వరుణ్ ది బెస్ట్ అని ఆదిత్య పాత్ర ద్వారా ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

    రాశీఖన్నా ఫెర్హార్మెన్స్ సూపర్

    రాశీఖన్నా ఫెర్హార్మెన్స్ సూపర్

    ఊహగుసగుసలాడే సినిమాలో తన నటనతో ఆకట్టుకొన్నప్పటికీ రాశీఖాన్నా ఇప్పటివరకు గ్లామర్ తారగానే గుర్తింపు పొందింది. కానీ తొలిప్రేమ చూసిన తర్వాత రాశీఖన్నాపై అభిప్రాయం తప్పక మారుతుంది. తొలిప్రేమ సినిమాకు రాశీఖన్నా నటన ప్రాణంగా నిలిచింది. భావోద్వేగాలు కలిసి ఉన్న యువతి పాత్రను చాలా అవలీలగా పోషించిందింది. పాత్రలో జస్ట్ బిహేవ్ చేసిందని చెప్పవచ్చు. తెరపైన ప్రతీ ప్రేమ్‌లో వరుణ్‌ను డామినేట్ చేయడానికి చేసిన ప్రయత్నం ప్రేక్షకుడిని ఆకట్టుకొంటుంది. ప్రియదర్శి ప్రేమను పెళ్లిగా మార్చే సీన్‌లో నటుడు నరేష్ మధ్య జరిగిన సన్నివేశంలో రాశీఖన్నా పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా అనిచెప్పవచ్చు. గ్లామర్‌గా కనిపించడమే కాకుండా కీలక సన్నివేశాల్లో ఆమె నటన ఓ ధమాకా అని చెప్పవచ్చు.

    ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ

    ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ

    తొలిప్రేమను వినోదాత్మకంగా మలచడంలో ప్రియదర్శి, హైపర్ ఆది పాత్రలు అదనపు ఆకర్షణ. తమదైన శైలి, టైమింగ్‌తో కామెడీ పండిచారు. వరుణ్ తేజ్ తల్లిగా సుహాసిని, ప్రియదర్శి మామగా నరేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కులం పిచ్చి ఉన్న పాతతో నరేష్ పూర్తిస్థాయిలో మెప్పించాడు. కీలక సన్నివేశంలో సుహాసిని నటన సినిమాకు బలంగా మారింది.

     స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అనాలిసిస్

    స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే అనాలిసిస్

    తొలిప్రేమ సినిమాకు మాటలు, స్క్రీన్‌ప్లే అదనపు ఆకర్షణ. ఫీల్‌గుడ్ సన్నివేశాల కథను ఒద్దిగా చెప్పడానికి దర్శకుడు అనుసరించిన విధానం అభినందనీయం. పాత్రల్లో తొందరపాటు తనం కనిపించినా స్క్రిప్ట్‌లో ఆదరాబాదరా ఎక్కడ కనిపించదు. ప్రేక్షకుడిని ప్రతీ సీన్‌లో లీనమయ్యే విధంగా స్క్రిప్ట్ రూపొందడం తొలిప్రేమ సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఒక్క క్షణంలో కూడా దర్శకుడు స్క్రిప్ట్‌ను వదిలేయ్యలేయ్యకుండా సినిమాను సక్సెస్ అనే గమ్యస్థానానికి చేర్చడం కనిపిస్తుంది.

     తమన్ మ్యూజిక్ ఫీల్‌గుడ్

    తమన్ మ్యూజిక్ ఫీల్‌గుడ్

    తొలిప్రేమలో సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ప్రధానమైన పాత్ర. ఎమోషనల్ సీన్లకు అనుగుణంగా రీరికార్డింగ్ కూర్చిన తీరు తమన్ మెచ్యురిటీ అద్దం పడుతుంది. భాగమతి చిత్రంతో ఒక్క కొత్త తమన్ చూసిన ప్రేక్షకుడికి ఈ చిత్రంలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో విశ్వరూపం చూపించాడు. గతంలో తనపై ఉన్న విమర్శలకు తొలిప్రేమ మ్యూజిక్‌తో తమన్ చక్కటి సమాధానం చెప్పారని అనవచ్చు.

    జార్జి సీ విలియమ్స్ సినిమాటోగ్రఫీ

    జార్జి సీ విలియమ్స్ సినిమాటోగ్రఫీ

    తొలిప్రేమ సినిమాకు జార్జి సీ విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫ్ అదుర్స్. యూత్ మూడ్‌ను ఆకట్టుకొనే విధంగా సినిమాను అందంగా తీర్చిదిద్దాడు జార్జ్. కాలేజీ సన్నివేశాలు, లండన్ ఎపిసోడ్స్‌కు అందించిన సినిమాటోగ్రఫీతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు. జార్జి సీ విలియమ్స్ కెమెరా వర్క్ ఈ సినిమాకు ఎస్సెట్ అని చెప్పవచ్చు.

     ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    తొలిప్రేమ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు రూపొందించారు. కథ డిమాండ్ మేరకు ఎక్కడ రాజీ పడకుండా సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచారు. సాంకేతిక హంగులు, లోకేషన్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ బ్యానర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ప్రస్తుత జనరేషన్‌లో కనిపించే సంఘటనలే తొలిప్రేమ చిత్రం కథ. ఈ కథలో వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వీరిద్దరూ పోటాపోటీగా నటించడం వల్లే సినిమాకు ఓ ఫీల్‌ ఫ్యాక్టర్ జనరేట్ అయింది అనిచెప్పవచ్చు. క్యాటగిరీలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను టచ్ చేసే సినిమా తొలిప్రేమ. ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ అని తెలుసుకోవాలంటే రెండు రోజుల తర్వాత మోగే రికార్డుల మోతే చెబుతుంది.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • వరుణ్ తేజ్, రాశీఖన్నా కెమిస్ట్రీ, పెర్ఫార్మెన్స్
    • థమన్ మ్యూజిక్
    • కథ, కథనం
    • ఫస్టాఫ్
    • ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ
    • మైనస్ పాయింట్స్

      • సెకండాఫ్‌లో కొంత కథావేగం నెమ్మదించడం
      •  తెర ముందు.. తెర వెనుక

        తెర ముందు.. తెర వెనుక

        నటీనటులు: వరుణ్ తేజ్, రాశీఖన్నా, స్వప్న పబ్బి, ప్రియదర్శి, సుహాసిని మణిరత్నం, విద్యుల్లేఖ రామన్, హైపర్ ఆది

        కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: అట్లూరి వెంకీ
        నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
        మ్యూజిక్: ఎస్ఎస్ థమన్
        సినిమాటోగ్రఫీ: జార్జి సీ విలియమ్స్
        ఎడిటింగ్: నవీన్ నూలి
        బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
        రిలీజ్ డేట్: ఫిబ్రవరి 10

    English summary
    South superstar Varun Tej and actress Raashi Khanna's latest outing 'Tholi Prema' has hit the screens on February 9, 2018. The Telugu romantic drama is directed by debutant Venky Atluri and produced by B V S N Prasad. The film also stars Sapan Pabbi, Priyadarshi Pullikonda, Suhasini Maniratnam, Vidyullekha Raman and Hyper aadhi. The romantic comedy has received a positive response from fans on Twitter. This film is getting ready to release in telugu on Feb 10th. In this occassion, Telugu filmibeat brings review exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X