»   » మిస్టరి థ్రిల్లర్ జానరే కానీ... (టామ్‌ హ్యాంక్స్‌.. 'ఇన్‌ఫెర్నో' రివ్యూ)

మిస్టరి థ్రిల్లర్ జానరే కానీ... (టామ్‌ హ్యాంక్స్‌.. 'ఇన్‌ఫెర్నో' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

'ది డావిన్సీ కోడ్‌', 'ఏంజెల్స్‌ అండ్‌ డెమన్స్‌' వంటి మిస్టరీ ధ్రిల్లర్ పుస్తకాలు రాసిన అమెరికన్‌ రచయిత డాన్‌ బ్రౌన్‌ మరో మిస్టరీ పుస్తకం 'ఇన్‌ఫెర్నో'అదే పేర్లతో తెరకెక్కింది. 'ఇన్‌ఫెర్నో'పుస్తకంగానూ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. దాంతో టామ్ హ్యాంక్స్ అబిమానులు మాత్రమే కాక ఆ సీరిస్ పుస్తకాభిమానులు సైతం ఈ సినిమా కోసం ఎదురుచూసారు.

అంతేకాకుండా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించటం జరిగింది. అలాగే దగ్గుపాటి రానా ఈ సినిమాలో టామ్ హాంక్స్ పాత్రకు డబ్బింగ్ చెప్పటం జరిగింది. ఇన్ని విశేషణాలతో కూడిన ఈ చిత్రం మన ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మన ముందుకు వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28న విడుదల అవుతున్న ఈ చిత్రం అంతకంటే ముందుగా ఈ శుక్రవారం మన దేశంలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో, ఇంతకు ముందు సినిమాలు తరహాలో మనలని ఆకట్టుకుంటుందో లేదో రివ్యూలో చూద్దాం.

మెలకవ వచ్చినా అమ్నీషియాతో

మెలకవ వచ్చినా అమ్నీషియాతో

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో సింబాలజిస్ట్‌గా పనిచేసే రాబర్ట్‌ లాంగ్‌డన్‌(టామ్‌ హ్యాంక్స్‌) కొద్దిరోజులుగా ఆస్పత్రిలో కోమాలోఉంటాడు. ఒకరోజు ఉన్నట్టుండి అతడికి మెలకువ వస్తుంది. అయితే అమ్నీషియా వల్ల రాబర్ట్‌కి గతమేమీ గుర్తుండదు. ముఖ్యంగా తనెవరో , అసలు ఎక్కడున్నాడో గుర్తు ఉండదు.

అతనెవరో తెలుసుకుని

అతనెవరో తెలుసుకుని

అమ్నేషియాతో ఉన్న అతనికి డాక్టర్ సియొన్నా బ్రూక్స్(ఫెలిసిటి జోన్స్) సాయిం చేస్తుంది. ఆమె సాయింతో అతనికి తన గతం మొత్తం గుర్తుకు వస్తుంది. అంతేకాకుండా ఓ సైకోపాత్ వల్ల ప్రపంచానికి పెద్ద ముప్పు ఉందని అర్దమవుతుంది.

విలన్ తెచ్చే ముప్పు

విలన్ తెచ్చే ముప్పు

ఇలా ఉండగా ఓ సైకోపాత్ బిలియనీర్ చేతిలో ప్రపంచానికి ప్రమాదముందని తెలుస్తుంది. ఓ భయంకరమైన వైరస్‌ను అతడు కొద్దిగంటల్లో వ్యాపింపజేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. అదే జరిగితే భూమి భూమి మీద సగం జనాభా మరణించడం ఖాయం.

డాక్టర్ తో కలిసి

డాక్టర్ తో కలిసి

అప్పుడు రాబర్ట్‌ లాంగ్‌డన్‌ తన డాక్టర్ సియోన్నా బ్రూక్స్‌(ఫెలిసిటీ జోన్స్‌) సహకారంతో ఆ ప్రమాదాన్ని ఎలా అడ్డుకున్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ప్రయాణం ఇది.

చిక్కని మిస్టరీలను

చిక్కని మిస్టరీలను

ఇందులో పురాతన గుర్తులను విశ్లేషించే రాబర్ట్‌ లాంగ్‌డన్‌ అంతుచిక్కని మిస్టరీలను తెలివిగా ఛేదిదిస్తుంటాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లో డాన్‌బ్రౌన్‌ రాసిన మరో పుస్తకం ‘ఇన్‌ఫెర్నో' ఆధారంగా అదే పేరుతో హాలీవుడ్‌లో రూపొందింది.

అదే సమస్య

అదే సమస్య

సినిమా థ్రిల్లర్ కదా అని చాలా ఆసక్తిగా ధియోటర్ కు వెళ్లి కూర్చుంటే అన్ని ముందే తెలిసిపోతూండేలా కథని డిజైన్ చేసారు. దర్శకుడు, రచయిత అనుకున్న ట్విస్ట్ లు మనకు అంతగా కిక్ ఇవ్వకపోవటమే సమస్యగా మారింది. అప్పటికీ స్క్రీన్ ప్లే చాలా వరకూ మ్యానేజ్ చేసారు.

చూస్తున్నంతసేపు మాత్రం

చూస్తున్నంతసేపు మాత్రం

ఈ సిరీస్‌లో వచ్చిన గత చిత్రాల స్థాయిలో లేకపోయినా సినిమా చూస్తున్నంత సేపు టెన్షన్ కు గురిచేస్తుంది. ట్విస్టులు కొత్తగా ఈ తరహా చిత్రాలు చూసే వారికి అద్బుతం అనిపిస్తాయి. అలాగే మొదటి రెండు పార్ట్‌ల తరహాలోనే ఈ చిత్రం సాగడంతో కొత్తదనం కరవైనట్లు అనిపిస్తుంది.

ఎప్పటిలాగే..

ఎప్పటిలాగే..

ది డావిన్సీ కోడ్‌'.. ‘ఏంజెల్స్‌ అండ్‌ డెమెన్స్‌' చిత్రాల్లో నటించిన టామ్‌ హ్యాంక్స్‌ ఈ చిత్రంలో మరోసారి రాబర్ట్‌ లాంగ్‌డన్‌గా కనిపించాడు. దొరికిన ఆధారాలతో మిస్టరీని ఛేదిస్తూ మానవాళికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆపేందుకు హీరో రాబర్ట్‌ లాంగ్‌డన్‌ చేసే ప్రయత్నాలు ఆసక్తిని కలిగిస్తాయి.

ఇర్ఫాన్ ఖాన్ ఎలా చేసాడంటే...

ఇర్ఫాన్ ఖాన్ ఎలా చేసాడంటే...

హీరోకి సహాయపడే డాక్టర్ పాత్రలో ఫెలిసిటీ జోన్స్‌ మెప్పించిందనే చెప్పాలి. ఇర్ఫాన్‌ఖాన్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో తన నటనతో అదరగొట్టాడు. మిగిలిన నటులు కూడా తమ పరిధి మేరకు నటించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టింది

సినిమాకు పనిచేసినవారు

సినిమాకు పనిచేసినవారు

నటీనటులు: టామ్‌ హ్యాంక్స్‌, ఫెలిసిటీ జోన్స్‌, ఇర్ఫాన్‌ఖాన్‌, ఒమర్‌ సై, బెన్‌ ఫోస్టర్‌ తదితరులు
సంగీతం: హాన్స్‌ జిమ్మర్‌
సినిమాటోగ్రఫీ: సాల్వటోర్‌ టొటినొ
కథ: డాన్‌ బ్రౌన్‌ రాసిన ‘ఇన్‌ఫెర్నో' పుస్తకం ఆధారంగా
స్క్రీన్‌ప్లే: డేవిడ్‌ కోయిప్‌
దర్శకత్వం: రాన్‌ హొవర్డ్‌
నిర్మాతలు: బ్రెయిన్‌ గ్రేజర్‌,రాన్‌ హొవర్డ్‌

ఫైనల్ గా అద్బుతమని చెప్పలేం కానీ .. ఖచ్చితంగా ఈ సినిమా ఉన్నంతలో మనని ఎంగేజ్ చేస్తూ...థ్రిల్లింగ్‌కి గురిచేస్తుంది. మిస్టరీ ధ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ లో మంచి కాలక్షేపమే.

English summary
Tom Hanks's latest movie Inferno, based on Dan Brown's novel by the same name has a twisted, high on history plot. The only improvement it has on the book is that it ends in two hours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu