twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Spider-Man: No Way Home Review: వెండితెర మీద ట్రిపుల్ ధమాకా.. ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ మ్యాజిక్

    |

    Rating:
    4.0/5
    Star Cast: టామ్ హాలెండ్, జెండ్యా, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బాల్టన్, అండ్రూ గార్‌ఫీల్డ్, టోబే మాగ్యూరే
    Director: జాన్ వాల్ట్

    సినిమా రంగంలో రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని పంచుతున్న మూవీ సిరీస్ స్పైడర్ మ్యాన్. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ చిత్రం దేనికి అదే సాటి. వరల్డ్ వైడ్‌గా ఈ సిరీస్‌కు కోట్లాది అభిమానులు ఉన్నారు. అలాంటి స్పైడర్ మ్యాన్ సిరీస్‌కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 17 రిలీజ్ అవుతున్నది. కానీ భారత్‌లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను బట్టి ఒక రోజు ముందుగానే థియేటర్లోకి తీసుకొచ్చారు. ఇలాంటి విశేషాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ, కథనాలు, నటీనటుల ప్రతిభను సమీక్షించాల్సిందే..

     స్పైడర్ మ్యాన్: నో మ్యాన్ హోమ్ కథ

    స్పైడర్ మ్యాన్: నో మ్యాన్ హోమ్ కథ

    విధ్వంసాలకు, వినాశనాలకు కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పైడర్ మ్యాన్ అలియాస్ పీటర్ పార్కర్ ( టామ్ హలెండ్) ఎవరనే విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనతోపాటు తన ప్రియురాలు ఎంజే అలియాస్ మిచెల్లి జోన్స్ (జెండ్యా), స్నేహితుడు నెడ్ (జాకబ్ బట్లాన్)కు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అడ్మిషన్‌ను నిరాకరిస్తుంది. ఈ క్రమంలో స్పైడర్ మ్యాన్‌గా తన గుర్తింపు రూపుమాపాలని, తన గురించి అందరూ మరిచిపోయేలా చేయాలని డాక్టర్ స్ట్రేంజ్(బెనడిక్ట్ కుంబర్‌బ్యాచ్)ను కలుస్తాడు.

    స్టోరీలో మలుపులు ఇలా..

    స్టోరీలో మలుపులు ఇలా..

    పీటర్ పార్కర్‌పై పడిన చెడు గుర్తింపు మరిచిపోయేలా డాక్టర్ స్ట్రేంజ్ చేశాడా? ప్రపంచం దృష్టిలో తనపై చెడు ముద్రను తొలగించుకొనే క్రమంలో పీటర్ పార్కర్ ఏం చేశాడు? ఈ కథలో మిగితా ఇద్దరు స్పైడర్ మ్యాన్‌ (అండ్రూ గార్‌ఫీల్డ్, టోబే మాగ్యూరే)ల పాత్రలు ఏమిటి? పీటర్ పార్కర్‌కు మిగితా ఇద్దరు స్పైడర్ మ్యాన్స్ ( ఏం చేశారు? పీటర్ పార్కర్ తో డాక్టర్ ఓట్టో ఆక్టావియస్ ఎందుకు విబేధించాడు? సాండ్ మ్యాన్ (థామస్ హేడెన్), ఎలెక్ట్రో (జామీ ఫాక్స్), లిజార్డ్ (రైస్ ఇఫాన్), గ్రీన్ గోబ్లిన్ (విలియమ్ డాఫే) పాత్రల పరిచయం ఎలా జరిగింది? ఎంఐటీలో పీటర్ పార్క్, ఎంజె, నెడ్‌‌కు ప్రవేశాలు లభించాయా? చివరకు ప్రపంచం దృష్టిలో పీటర్ పార్క్‌కు మంచి ఇమేజ్ లభించిందా అనే ప్రశ్నలకు సమాధానమే స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమా కథ.

    ఫస్టాఫ్ రివ్యూ

    ఫస్టాఫ్ రివ్యూ

    తొలి భాగం విషయానికి వస్తే.. విధ్వంసాలు, వినాశనానికి కారణమని తనపై పడిన చెడు ముద్రతో పీటర్ పార్క్‌తోపాటు స్నేహితులు కూడా ఓ రకమైన ఎమోషన్స్ గురికావడంతో కథ ప్రారంభమవుతుంది. భావోద్వేగమైన పరిస్థితుల్లో ప్రేక్షకుల్లో ఉత్తేజానికి గురి చేసేలా డాక్టర్ స్రేంజ్ ఎంట్రీ జరుగడం సినిమాలో ఒక హైలెట్‌గా కనిపిస్తుంది. ఎంఐటీలో ప్రవేశానికి తిరస్కారానికి గురికావడంతో కథలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకొంటుంది. ఆక్టావిస్‌తో యాక్షన్ సీన్లు థ్రిలింగ్‌కు గురిచేస్తాయి. సాండ్ మ్యాన్, లిజార్డ్, గ్రీన్ గోబ్లిన్ పాత్రల రాకతో ప్రేక్షకుల్లో జోష్ పెరుగుతుంది.

    సెకండాఫ్‌ రివ్యూ ఇలా..

    సెకండాఫ్‌ రివ్యూ ఇలా..

    సెకండాఫ్‌లో ఇద్దరు స్పైడర్ మ్యాన్‌లు ప్రవేశించడంతో ఓ మ్యాజిక్‌గా మారుతుంది. ముగ్గురు స్పైడర్ మ్యాన్‌లు చేసే విన్యాసాలు తెర మీద అబ్బుర పరుస్తాయి. తల్లి మే పార్కర్ (మారిసా తోమీ) మరణించే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేసేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్‌లో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూకు సంబంధించిన ఎపిసోడ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతుంది. ఇలాంటి మరెన్నో అంశాలు సినిమాకు హై ఎనర్జీగా మారుతాయి. ప్రతీ పది నిమిషాలకు బ్యాంగులతో సినిమా అదిరిపోతుంది.

    వావ్ అనిపించేలా దర్శకుడు జాన్ వాల్ట్ ప్రతిభ

    వావ్ అనిపించేలా దర్శకుడు జాన్ వాల్ట్ ప్రతిభ

    దర్శకుడు జాన్ వాల్ట్ అనుసరించిన స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంటుంది. గత స్పైడర్ మ్యాన్ సిరీస్‌లోని పాత్రలను పరిచయం చేసిన విధానం సరికొత్తగా, ఫుల్ జోష్‌తో ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిలో మంచి ఇమేజ్ ఉన్న పాత్రలను కథలోకి తెచ్చిన విధానం సినిమాకు బలంగా మారాయని చెప్పవచ్చు. యాక్షన్, ఎమోషన్ అంశాలను మిక్స్ చేసిన విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమాను ఓ క్లాసిక్‌గా రూపొందించడంలో జాన్ వాల్ట్ సక్సెస్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    టామ్ హాలెండ్ ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    టామ్ హాలెండ్ ఇతర నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    పీటర్ పార్కర్‌గా టామ్ హాలెండ్ నటన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ సన్నివేశాల్లోను, అలాగే ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. ఎంఐటీలో ప్రవేశానికి తిరస్కరణకు గురి అయిన సీన్లలో, అలాగే తల్లి మరణించిన సన్నివేశాల్లో టామ్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొంటుంది. యాక్షన్ సీన్లలో కూడా బాగా రాణించారు. స్పెడర్ మ్యాన్ ప్రియురాలి‌గా ఎంజేగా జెండ్యా, స్నేహితుడు నెడ్‌గా జాకబ్ బట్లాన్ కథకు, తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశాడు. నెడ్ యాక్టింగ్ మంచి కామెడీని పండించింది. మరోసారి డాక్టర్ స్ట్రేంజ్‌గా బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ కీలకమైన పాత్రలో మెప్పించాడు. డాక్టర్ స్ట్రేంజ్ చేసే విన్యాసాలు ఆకట్టుకొంటాయి. మిగితా పాత్రల్లోని వారు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.

    సాంకేతిక విభాగాల పనితీరు.

    సాంకేతిక విభాగాల పనితీరు.

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. మారో ఫియరో అందించిన సినిమాటోగ్రఫి కనుల విందుగా ఉంటుంది. యాక్షన్, ఎమోషన్ సీన్లను అద్భుతంగా కెమెరాలో బంధించారు. ఫస్టాఫ్‌లో డాక్టర్ ఆక్టోపస్‌తో స్పైడర్ మ్యాన్ ఫైట్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టి నేపథ్యంలో జరిగి యాక్షన్ సీన్లు హై రేంజ్‌లో ఉన్నాయి. అనేక పాత్రలను కథలో మిళితం చేసే ప్రక్రియ ఎడిటర్‌కు కత్తిమీద సామే. ఆ పనిని జెఫరీ ఫోర్ట్ సమర్ధవంతంగా పోషించారు. మైఖేల్ గియాచినో అందించిన మ్యూజిక్ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పలు సన్నివేశాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. కొలంబియా పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్, పాస్కల్ పిక్చర్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    వెండితెరపైన ముగ్గురు స్పైడర్ మ్యాన్స్ చేసిన మ్యాజిక్ స్పైడర్ మ్యాన్: నో వే హో. అద్బుతమైన సాంకేతిక నైపుణ్యత, గ్రాఫిక్స్ పనితీరు, యాక్షన్, ఎమోషన్స్, నటీనటుల ప్రతిభ, దర్శకుడు అందించిన కథ, కథనాలు ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. వెండితెర మీద అద్బుతమైన అనుభూతిని అందించే చిత్రమని చెప్పవచ్చు. లాక్‌డౌన్ తర్వాత మంచి సినిమాను చూడాలని ఆశించే సగటు ప్రేక్షకుడికి పంచభక్ష్య పరమాన్నంతో కూడిన మంచి భోజనం లాంటి సినిమా. టెక్నికల్, గ్రాఫిక్‌తో కూడిన సినిమాలను ఆదరించే వారికి ఈ చిత్రం పైసావసూల్ లాంటిది. డోంట్ మిస్ ఇట్..

    స్పైడర్ మ్యాన్... నటీనటులు, సాంకేతిక నిపుణులు

    స్పైడర్ మ్యాన్... నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: టామ్ హాలెండ్, జెండ్యా, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బాల్టన్, బెనడిక్ట్ కుంబర్‌బ్యాచ్, అండ్రూ గార్‌ఫీల్డ్, టోబే మాగ్యూరే తదితరులు
    దర్శకత్వం: జాన్ వాల్ట్
    నిర్మాతలు: కెవిన్ పీజ్, ఆమీ పాస్కల్
    సినిమాటోగ్రఫి: మారో ఫియోరే
    ఎడిటింగ్: జాఫెరీ ఫోర్డ్
    మ్యూజిక్: మైఖేల్ గియాచినో
    ప్రొడక్షన్ కంపెనీలు: కొలంబియా పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్, పాస్కల్ పిక్చర్స్
    రిలీజ్ డేట్: 2021-12-16

    English summary
    American superhero film based on the Marvel Comics character Spider-Man film hits the screen on December 16th. Spider-Man: No Way Home co-produced by Columbia Pictures and Marvel Studios. Directed by Jon Watts
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X