twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్ధార్థ్ ‘ఎన్‌హెచ్ 4’ రివ్యూ....

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5
    హైదరాబాద్ : ఇంత కాలం లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరించిన హీరో సిద్దార్థ్ ఈ సారి సరికొత్త జోనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సింపుల్ స్టోరీకి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, యాక్షన్, సస్పెన్స్, ట్విస్ట్‌లు జోడించిన ఆ చిత్రం 'ఎన్‌హెచ్ 4'. బెంగుళూరు టు చెన్నై అనేది ఉప శీర్షిక. తమిళంలో 'ఉదయం ఎన్‌హెచ్ 4' పేరుతో రూపొందిన ఈచిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. మణిమారన్ దర్శకత్వం వహించారు.

    కథలోకి వెళితే...ప్రభు(సిద్దార్థ్), అతని స్నేహితులు అనంతపురం నుంచి బెంగుళూరు వెళ్లి అక్కడ కాలేజీలో చేరతారు. అదే కాలేజీలో చదువుతున్న రితిక(ఆశ్రిత శెట్టి) ప్రభు ఆటిట్యూడ్, బిహేవియర్‌ నచ్చి అతన్ని ప్రేమిస్తుంది. ప్రభు కూడా రితికను ప్రేమిస్తాడు. ఒకరోజు వీరి ప్రేమ విషయం బెంగులూరులో పెద్ద పొలిటికల్ లీడర్ అయిన రితిక తండ్రికి తెలిసి పోతుంది. దీంతో రితికను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ప్రభును, అతని స్నేహితులను కాలేజీలో చెడ్డీలపై నిలబెట్టి పోలీసులతో కొట్టించి అవమానిస్తాడు.

    నువ్వు లేకుండా నేను ఉండలేను, లేచి పోదాం అని రితిక చెప్పడంతో....ఇద్దరూ కలిసి పక్కా ప్లాన్ ప్రకారం బెంగుళూరు నుంచి ఎస్కేప్ అవుతారు. ఫ్రెండ్స్ వారికి సహాయం చేస్తారు. విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందనే భయంతో రితిక తండ్రి...తనకు నమ్మకమైన పోలీస్ ఆఫీసర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ మనోజ్ మీనన్(కెకె మీనన్)ను రంగంలోకి దింపుతాడు. రెండు గంటల్లో మీ కూతుర్ని మీ ముందు ఉంచుతాను మాటిస్తాడు మనోజ్ మీనన్. ప్రభు-రితిక ఎలా తప్పించుకున్నారు? చివరికి ఏమైంది అనేది మిగతా స్టోరీ.

    సిద్ధార్థ్ ‘ఎన్‌హెచ్ 4’ రివ్యూ....

    పెర్ఫార్మెన్స్ పరిశీలిస్తే... సిద్ధార్థ పెర్ఫార్మెన్స్ గత సినిమాలకు భిన్నంగా బాగుంది. రితిక అందం, అభినయంతో ఆకట్టుకుంది.

    సిద్ధార్థ్ ‘ఎన్‌హెచ్ 4’ రివ్యూ....

    పోలీసాఫీసర్ పాత్రలో కెకె మీనన్ అదరగొట్టాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రలకు మేరకు రాణించారు.

    సిద్ధార్థ్ ‘ఎన్‌హెచ్ 4’ రివ్యూ....

    సింపుల్ స్టోరీ అయినా సినిమాను స్ర్కీన్ ప్లేతో వినోదాత్మకంగా, ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు. ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మధ్య మధ్యలో కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి.

    సిద్ధార్థ్ ‘ఎన్‌హెచ్ 4’ రివ్యూ....

    దీనికి తోడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రభు వేసే ప్లాన్లు, వారి ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు వాడే ట్రిక్స్ ఆసక్తిని కలిగిస్తాయి. సందర్భానికి తగిన విధంగా పాటల బాగున్నాయి.

    సిద్ధార్థ్ ‘ఎన్‌హెచ్ 4’ రివ్యూ....

    అయితే....ఫస్టాఫ్‌తో పోల్చుకుంటే సెకండాఫ్ కాస్త స్లో అయింది. సస్పెన్స్ కొనసాగించేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. క్లామాక్స్ ఫర్వాలేదు. ఎక్సలెంట్ అనే రేంజిలో కాక పోయినా సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితనం చూపించాయి.

    సిద్ధార్థ్ ‘ఎన్‌హెచ్ 4’ రివ్యూ....

    ఫైనల్‌గా చెప్పేదేమంటే ఒకసారి చూసి ఎంజాయ్ చేదగ్గ మూవీ.

    English summary
    Udhayam NH4 is a road movie starring Siddharth, newcomer Ashrita Shetty and Kay Kay Menon. The story of the film is about a Tamilan named Prabhu, who is pursuing engineering in Bangalore, and a Bangalore-based girl Rikshitha (Ashritha Shetty).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X