twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనం భరించడం కష్టమే... (ఉపేంద్ర-2 రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    హైదరాబాద్: కన్నడ స్టార్ ఉపేంద్ర చాలా మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన ‘ఉపేంద్ర' చిత్రం అప్పట్లో తెలుగులో కూడా విడుదలై మంచి ఫలితాలు రాబట్టింది. ఈచిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన కన్నడ చిత్రం ‘ఉప్పి-2' తెలుగులో ‘ఉపేంద్ర-2'గా విడుదలైంది. నల్లమలుపు బుజ్జి ఈచిత్రాన్ని తెలుగులో విడుదల చేసారు. నేను అనే అహన్ని మనిషి వదులుకోవాలని ‘ఉపేంద్ర' లో చెప్పిన ఉపేంద్ర, నువ్వు అనే కాన్సెప్ట్ ను ఉపేంద్ర 2 చెప్పడానికి ప్రయత్నించాడు. ఈచిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేసాడు ఉపేంద్ర.

    కథలోకి వెళితే...
    కొంతమంది భవిష్యత్ గురించి ఆలోచిస్తారు, ఇంకొందరు గతంలో ఉండిపోతారు. ఎవరైతే గతం, భవిష్యత్ అనే ఆలోచన లేకుండా ప్రస్తుతం, ఈ క్షణం అనేదాని గురించి మాత్రమే ఆలోచిస్తాడో తను చాలా హ్యాపీగా ఉంటాడు అని సైన్స్ ప్రొఫెసర్ చెప్పిన మాటలు విన్న కాలేజీ స్టూడెంట్ ఖుషీ (క్రిస్టినా అకివా) వర్తమానం గురించి మాత్రమే ఆలోచించే లక్షణాలు ఉన్న నువ్వు(ఉపేంద్ర) అనే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎవరు ఏం అడిగినా భవిష్యత్ గురించి ఆలోచించడం మానేయ్యండి అన్ని సెట్ అవుతాయని చెబుతుంటాడు నువ్వు. నువ్వు ప్రవర్తన బాగా నచ్చిన ఖుషి అనితో ప్రేమలో పడుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో శైజల(పారుల్ యాదవ్)వల్ల నువ్వు గురించి ఓ షాకింగ్ తెలుస్తుంది. మరో వైపు నువ్వును పట్టుకోవడానికి సీబీఐ ఆఫీసర్(షాయాజీ షిండే), మాఫియా డాన్(శోభరాజ్) వెంటపడు ఉంటుంది. వీళ్ళందరూ నువ్వు వెంట పడటానికి అసలు కారణం మల్టీ మిలినియర్ మందాకిని(ప్రియాంక ఉపేంద్ర). సినిమాలో నేను(ఉపేంద్ర) మరో క్యారెక్టర్ కూడా ఉంటుంది. అసలు నువ్వు ఎవరు? నేను ఎవరు? నువ్వు గరించి వీరంతా ఎందుకు వెతుకుతున్నారు, నేను అనే వ్యక్తి ఉన్నాడా? అనేది తెరపై చూడాల్సిందే.

    Upendra 2 Movie Review

    పెర్ఫార్మెన్స్..
    ఉపేంద్ర పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను ఎంచుకున్న పాత్రలకు పెర్ఫార్మెన్స్ పరంగా పూర్తి న్యాయం చేసాడు. వివిధ క్యారెక్టర్లలో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. తన యాక్టింగ్ స్కిల్స్‌తో షోలో డామినేషన్ చూపించాడు. తన స్టైల్, డైలాగ్స్, స్టంట్స్ పరంగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ క్రిస్టినా అకివా చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. అందం, గ్లామర్ పరంగా అమ్మడు ఓకే. సాయాజీ షిండే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పరుల్ యాదవ్, సత్యజిత్, బ్యాంక్ జనార్ధన్, మిమిక్రి దయానంద్, ప్రియాంక ఉపేంద్ర తమ పాత్రలకు తగిన విధంగా రాణించారు.

    టెక్నికల్...
    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే అశోక్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ఓకే. గురుకిరణ్ అందించిన సంగీత యావరేజ్. ఎడిటింగ్ కూడా ఇంకాస్త బావుండాల్సింది. సినిమా నిర్మాణ విలువల బావున్నాయి.

    విశ్లేషణ...
    కథలోని పాయింట్ ఉపేంద్ర పర్ ఫెక్టుగా ప్రజెంట్ చేయలేక పోయాడు. స్క్రీప్లేలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాడు. క్లైమాక్స్ లో 4 పాత్రలను ఒక్కసారిగా చూపించి, దేనికీ క్లారిటీ, అసలు నిజమైన పాత్ర ఏది అనేది చెప్పకుండా ముగించేసాడు. సినిమా అసలే కన్ ఫ్యూజన్‌గా సాగుతుంది... దానికితోడు స్లో నేరేషన్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో ఎంటర్టెన్మెంట్ అసలే లేదు.

    ఓవరాల్‌గా...
    తెలుగు ప్రేక్షకులు భరించే స్థాయిలో ఈ సినిమా లేదు.

    English summary
    Upendra's much awaited movie Upendra 2 has released. Check out Telugu Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X