»   »  ఊగచ్చుకానీ... (‘ఉయ్యాలా జంపాలా’రివ్యూ)

ఊగచ్చుకానీ... (‘ఉయ్యాలా జంపాలా’రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

నాగార్జున నిర్మాత,సురేష్ బాబు సమర్పణ ...ఓ రేంజిలో హోరెత్తించిన పబ్లిసిటీ...చిన్న సినిమాకు భారీ వరమే. అయితే అది ప్రేక్షకుడుకి కూడా వరం కావాలి. తెలుగు తెరపై బావా మరదళ్ల అనుబంధంపై ఇప్పటికే బోల్డు కథలు వచ్చాయి...హిట్టయ్యాయి. ఈ సారి కూడా గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ ..లో ఓ కుర్రాడు..అతని మరదలు కథ ఆవిష్కరించారు. కథ అంటే కొత్తది అనుకునేరు..అదీ బావా..మరదళ్ల అనుబంధం అంత పాతది... నువ్వే కావాలి,నువ్వు నాకు నచ్చావు నాటిది. కథ ఎప్పటిదైనా నేరేషన్ తో కూర్చోబెట్టచ్చు కదా అంటే దర్శకుడు అదీ ఆ కాలం నాటిదే తీసుకున్నాడు...ఈ సినిమాలో బాగున్నదల్లా కెమెరామెన్ పనితనం, హీరో అచ్చం పాత్రలో ఇమిడిపోయి..గోదారి కుర్రాడిలా అనిపించటం.


గోదావరి జిల్లాలో ఓ పల్లెలో మొదలయ్యే ఈ కథలో ... సూరి (రాజ్‌ తరుణ్‌), ఉమాదేవి (అవని..చిన్నారి పెళ్లికూతురు ఫేమ్) బావామరదళ్లు. ఒకరంటే మరొకరికి పడదు. ఎప్పుడు గిల్లికజ్జాలే. ఎత్తుకు పైఎత్తులు వేసుకొని కవ్వించుకొంటుంటారు. ఆమెను ఉడికించటానికి సూరి...సునీత(పునర్నవి భూపాలం)తో ప్రేమలో పడినట్లు నటిస్తాడు. అయితే దానికి రిటార్ట్ గా..ఉమాదేవి.. పార్టు అనే కుర్రాడితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అతను మోసగాడు అని తెలుసుకుని బావా,మరదళ్లు బుద్ది చెప్తారు. తర్వాత వీరిద్దరి మధ్యా ప్రేమ మొలిచిందా..వాళ్లిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.

 Uyyala Jampala - Movie review

మొదటే చెప్పుకున్నట్లు ఇలాంటి ఫీల్ గుడ్ మార్క్ సినిమా ఇలాంటి కథల్లో కొత్తదనం ఏమీ ఉండదు. హీరో,హీరోయిన్స్ ఎలా తమ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలుసుకున్నారు అనేదే కీలకాంశం. కేవలం ట్రీట్ మెంట్ మీద ఆధారపడి రాసుకునే కథలే ఇవి. ట్రీట్ మెంట్ పండితే సినిమా నిలబడుతుంది. అయితే సినిమాలో తర్వాత నుంచి వచ్చే పదో సన్నివేశం ఏమిటో కూడా తెలిసిపోయేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. క్లైమాక్స్ అయితే మరీ రొటీన్ గా ఉంది. ..సీన్స్ లో డెప్త్ మిస్సైంది. అలా వచ్చి సీన్స్ నవ్వించో,మరొకటో చేసి వెళ్లిపోతాయి తప్పించి మనస్సుపై గాఢమైన ముద్రవేయలేకపోయాయి.


రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో అలాంటి అవసరమూ ఉండదు...దాని టార్గెట్ ప్రేక్షకులు వేరు. ఇలాంటి సినిమాల ప్రేక్షకులు వేరు. వారు..ఆశించేది..తమను తాము ఐడింటిఫై చేసుకునే పాత్రలు..ఫీల్ తో నడిచే సన్నివేశాలు. హృదయాన్ని తట్టిలేపే క్లైమాక్స్..ఇవన్ని ఇందులో మిస్సయ్యాయి. అక్కడక్కడా టచ్ చేసినా దర్శకుడు దాన్ని పూర్తిగా అందుకోలేకపోయాడు. అయితే దర్శకుడు మాత్రం సీన్స్ ని తెరపై నీట్ గా, సింపుల్ గా ఎక్కించగలగాడు. హీరో,హీరోయిన్స్ కొత్తవారైనా వారి నుంచి బాగానే నటన రాబట్టుకున్నాడు. కెమెరా వర్క్ బాగుంది. హీరోగా చేసిన కుర్రాడు కొత్త కుర్రాడయినా బాగా చేసాడు. హీరోయిన్ గా చేసిన అమ్మాయి... అక్కడక్కడా లిప్ సింక్ కాలేదు..మరింత జాగ్రత్తపడాల్సింది. సంగీతం ఓకే అనిపిస్తుంది.


ఏదైమైనా ఇలాంటి సినిమాలు విజయవంతం అయితే చిన్న సినిమాలుకు ఊపు వస్తుంది. మరింత మంది క్రియోటర్లు తమ సత్తా చూపుకునే అవకాసం ఉంటుంది. మరీ తీసిపారేసే సినిమా మాత్రం కాదు..కాబట్టి అవకాసాన్ని బట్టి ఓ లుక్కు వేయచ్చు. మీ మరదలనో...లేదా బావనో తోడు తెచ్చుకుంటే..తెరపై బావా,మరదళ్లు అక్కడక్కడా బోర్ కొట్టినా మీవాళ్ల కంపెనీని ఎంజాయ్ చేసి బయిటపడొచ్చు.


సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్‌, సన్‌షైన్‌ పిక్చర్స్‌
నటీనటులు: రాజ్‌తరుణ్‌, అవిక, అనితా చౌదరి, రవివర్మ తదితరులు. సంగీతం: సన్నీ ఎం.ఆర్‌.
ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి.,
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్,
కళ: ఎస్.రవీందర్,
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి.,
సమర్పణ: డి. సురేష్‌బాబు
దర్శకత్వం: విరించి వర్మ.

English summary
Uyyala Jampala is a simple rustic lovestory directed by newcomer Virinchi Varma relesed today with avergae talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu