For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గెలుద్దామనే వచ్చాడు కానీ...(రివ్యూ)

  By Srikanya
  |

  సంస్ద: కెవీ ఫిలింస్
  నటీనటులు: జీవా, తాప్సీ, రెహమాన్ తదితరులు
  సంగీతం: తమన్
  నిర్మాత: కె వేణు గోపాల్
  దర్శకత్వం: ఆర్ కణ్ణన్

  ఒక సినిమా హిట్టైతే అదే ఫార్మెట్ ని నమ్ముకుంటూండటం హీరోలకు అలవాటు. రీసెంట్ గా రంగం చిత్రంతో తెలుగువారికి దగ్గరైన జీవా ..అందులోని క్లైమాక్స్ ట్విస్ట్ భాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించటంతో మళ్ళీ క్లైమాక్స్ ట్విస్టునే మరోసారి నమ్ముకుని గెలుద్దామని వచ్చాడు. అయితే అంత ఓపిగ్గా క్లైమాక్స్ ఎప్పుడో వచ్చే ట్విస్టు కోసం ఎదురుచూసే ఓపిక లేని జనం మరి ఈ సినిమాని ఏ మేరకు గెలవనిస్తారో చూడాల్సిందే.

  జీవా(జీవా) ఓ ప్రత్యేకమైన పనిమీద ముంబై వస్తాడు.అక్కడున్న రమణ(నంద) అనే డాన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటాడు. అంతేగాక రమణకు తను అంజలి(తాప్సి)కి మధ్యన నడిచిన ప్రేమ కథను చెప్తాడు. అది పూర్తవగానే డార్లింగ్ తరహా ట్విస్టు రివిల్ అయ్యి ఇంటర్వెల్ వస్తుంది. ఆ తర్వాత బిజెనెస్ మ్యాన్ అయిన అంజలి తండ్రి ని ఓ షూట్ అవుట్ లో మరణిస్తాడు. దానికి కారణం రమణ. దాంతో రివేంజ్ తీర్చుకోవాలని భావించిన అంజలి..రణనని పోలీసులుకు పట్టిచ్చిస్తే పెళ్ళికి ఒప్పుకుంటాను అంటుంది.అయితే ఆ హత్యకు సాక్ష్యం ఉండదు. ఆ పరిస్దితుల్లో జీవా ఏం చేసాడు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేది మిగతా కథ.

  తెలుగులో అతనొక్కడే తో హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చే కథలన్నీ కేవలం ట్విస్టులని నమ్ముకుని చేసినవే. దాంతో అతని కెరీర్ లోనూ ఆ తర్వాత ఒక్క హిట్టూ పడలేదు. ఇప్పుడు జీవా ని చూస్తూంటే అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నట్లున్నాడు. రంగం హిట్టుకి కారణం క్లైమాక్స్ ట్విస్ట్ కాకుండా అప్పటిదాకా కథ నడిపించిన విధానం. వేరే వాళ్లుని విలన్ గా ప్రొజక్టు చేస్తూ చివరలో అస్సలు విలన్ ని రివిల్ చేసి షాక్ ఇస్తాడు. మహేష్ పోకిరీలోనూ కథ అలాగే జరుగుతుంది. కథ మొత్తం ఓకిరి..మాఫియా ముఠాలు అన్నట్లు సాగి చివరిలో పోలీస్ ఆఫీసర్ అని రివిల్ అవటం సక్సెస్ ని ఇచ్చింది. అదే ఇక్కడ మిస్సైంది. ఇక నటీనటుల్లో జీవా చాలా బాగా చేసాడు. తాప్సీ ఎప్పటిలాగే గ్లామర్ డాల్ గా అందాలను ఒలకపోయటంలో మునిగిపోయింది. విలన్ గా నందా తెలుగులోనూ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. టెక్నకల్ గానూ సౌండ్ గా ఉన్న ఈ చిత్రంలో పాటలు సైతం రెండు బావున్నాయి. సంతానం కామెడీ ఉన్నంతంలో రిలీఫ్.

  ఫైనల్ క్లైమాక్స్ వద్ద ఉన్న ట్విస్టు ఎంతవరకూ ప్రేక్షకులపై ప్లే అవుతుందనేదానిపై ఆధారపడిన ఈ చిత్రం తెలుగునాట పెద్దగా వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు.ఇక ఇంటర్వెల్ వట్టద్ద వచ్చిన ట్విస్టు గతంలో డార్లింగ్ సినిమాలో తెలుగువారు చూసిందే కాబట్టి అక్కడ షాక్ అవటం కష్టం. ఇవన్నీ బేరీజు వస్తే...ఈ సినిమాతో తెలుగులో నిలబడుదామనుకున్న జీవా ఆశలపై నీళ్ళు ఒలికినట్లే కనపడుతున్నాయి.

  English summary
  Jeeva, popular Tamil actor and younger son of producer RB Chowdary has got his first break in Tollywood with Rangam, which is running towards hundred days in twenty plus centers. With Rangam's success many more Jeeva movies are now being dubbed in Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X