For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వదలడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|

Rating:
2.0/5

లవర్ బాయ్‌ క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సిద్దార్థ్.. గత కొన్నేళ్లుగా వెనుకబడ్డాడు. రూటు మార్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ హిట్ కొట్టలేకపోతున్నాడు. హారర్ మూవీలో గతేడాది వచ్చిన గృహం పర్వాలేదనిపించగా.. మరోసారి అదే జానర్‌లో వదలడు అంటూ తెలుగు ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ శుక్రవారం(అక్టోబర్ 11) వచ్చేశాడు. మరి ఈసారైనా సిద్దార్థ్ సక్సెస్ అయ్యాడా? లేదా? అన్నది చూద్దాం.

కథ

కథ

కల్తీ లేకి ఆహారమే తన ఆశయం అని చెప్పుకునే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్(సిద్దార్థ్).. ఎక్కడ కల్తీ జరిగినా విజృంభిస్తుంటాడు. ఓ పదార్థం ఏరకంగా తయారైంది? ఎలాంటి రసాయనాలను వాడి తయారు చేశారు? అనే వాటిని వాసనను బట్టి చెప్పే జగన్‌.. చిన్నప్పటి నుంచి వాసనను గ్రహించలేని లోపంతో బాధపడుతున్న జ్యోతి(కేథరిన్ థ్రెస్సా)ని ప్రేమిస్తాడు. అయితే తన లోపం ఎవరికి కష్టంగా మారకూడదని పెళ్లి ఆలోచనలు మానుకుంటుంది. అయితే అనూహ్యంగా జ్యోతికి స్మెల్లింగ్ సెన్సెస్ వస్తాయి.. అన్ని వాసనలను గుర్తుపడుతుంది.

 కథలో ట్విస్ట్‌లు..

కథలో ట్విస్ట్‌లు..

అంత వరకు బతికే ఉన్నాడనుకున్న జగన్ హత్యకు గురయ్యాడని జ్యోతికి తెలుస్తుంది? జ్యోతికి స్మెల్లింగ్ సెన్స్ పనిచేయడం.. జగన్ చనిపోవడాని మధ్య ఉన్న సంబంధ ఏంటి? జగన్‌ను హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ

 విశ్లేషణ

విశ్లేషణ

ఫస్టాఫ్ సోసోగా నడవగా.. సెకండాఫ్‌లో కథనం ఆకట్టుకుంటుంది. హోటల్స్‌పై రైడ్ చేయడం.. హీరోయిజం ఎలివేట్ కావడం.. ఇలా చకాచక సాగుతుంది. సెకండాఫ్ మొదట్లో వచ్చే ఆ ముప్పై నిమిషాల సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. మళ్లీ ప్రీ క్లైమాక్స్‌ , క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో ప్రేక్షకులు ఇట్టే పసిగట్టేస్తారు.

నటీనటుల ఫర్ఫామెన్స్..

నటీనటుల ఫర్ఫామెన్స్..

తన ఉద్యోగాన్ని తాను నిక్కచ్చిగా చేసే జగన్ పాత్రలో సిదార్థ్ చక్కగా నటించారు. అన్ని బాగానే కుదిరినా.. సిద్దార్థ్ పాత్రకు చెప్పిన డబ్బింగ్ మాత్రం సరిపోలేదు. ఎంత డబ్బింగ్ చిత్రమైనా తన గొంతునే వాడి ఉంటే.. అది కూడా తెలుగు సినిమా అనే ఫీలింగ్ అయినా వచ్చేది. యాక్షన్ సీన్స్‌లోనూ సిద్దార్థ్ అదరగొట్టేశాడు. ఇక జ్యోతి పాత్రలో కెథరిన్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. ఫస్టాఫ్‌లో దాదాపు కేథరిన్ కనిపించగా.. అన్నీ సీన్స్‌లో నటనతో ఆకట్టుకుంది. పాత్రకు తగ్గట్టు కేథరిన్‌కు చెప్పిన డబ్బింగ్ పర్వాలేదనిపించింది. గ్లామర్ పరంగానే కాదు.. నటనలోనూ ఆకట్టుకోగలనని కేథరిన్ నిరూపించింది. మిగతా పాత్రల్లో కబీర్ దుహాన్ సింగ్, సతీష్, ఆదుకాలమ్ నరేన్, స్టంట్ సిల్వ లాంటి వారు తమ పరిధి మేరకు నటించారు.

దర్శకుడు పనితీరు..

దర్శకుడు పనితీరు..

సినిమాకు అనుకున్న పాయింట్ కొత్తదే అయినా.. ఇంతకు ముందు ఒకేఒక్కడు, అపరిచితుడు లాంటి సినిమాల్లో అది చూసేశాం. అక్కడ ఆ కథలను వాడిన ట్రీట్‌మెంట్ కొత్తవి.. అందుకే అవి అంతగా జనాల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఈ చిత్రానికి తీసుకున్న పాయింట్‌కు రొటీన్ ఫార్మూలాను వాడేసినట్లు అనిపిస్తుంది. కొత్తగా కథనాన్ని రాసుకుని ఉంటే బాగుండేది.

టెక్నికల్ విభాగాల పనితీరు..

టెక్నికల్ విభాగాల పనితీరు..

ఈ కథలో మళ్లీ హారర్, దెయ్యం కాన్సెప్ట్‌ను జొప్పించి.. ఉండాల్సిన ఫీల్‌ను మిస్ చేసినట్టు అనిపిస్తుంది. నీళ్ల నుంచి పాల దాకా అన్నీ కల్తీ అయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇచ్చే సందేశం బాగానే ఉంది. అయితే సినిమా పరంగా చూస్తే.. ఈ కథను చెప్పడానికి ఎంచుకున్న కథనం, ఇచ్చిన ఎండింగ్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 మ్యూజిక్, ఎడిటింగ్..

మ్యూజిక్, ఎడిటింగ్..

ఇది పూర్తిగా హారర్ మూవీ కూడా కాదు.. అయితే సందర్భానుసారంగా తన నేపథ్య సంగీతంతో తమన్ ఆకట్టుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆడియెన్స్‌ను భయపెట్టాడు. సినిమాటోగ్రఫర్ ఏకాంబరం తన కెమెరాతో ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా మలిచాడు. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్స్ తన కత్తెరతో తీసేస్తే ఇంకా బాగుండేది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

సినిమా కథ ఆలోచింపజేసేదే అయినా.. కథనం, క్లైమాక్స్ అందరూ ఊహించేలా రాసుకోవడం మైనస్ అయింది. ఈ విషయంలో సాయి శేఖర్ ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. కల్తీ ఆహారం.. వాటిపై జులుం విధించే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఒక ఆఫీసర్ నిజాయితీగా ఉంటే ఏం జరుగుతుందన్నది ఎన్నో సినిమాల్లో చూసేసే ఉన్నాం. ఈ సినిమా ప్రజలకు అవగాహన కల్పించేలానే ఉన్న.. ఎంతమంది దగ్గరికి ఈ చిత్రం చేరుతుందన్నది ప్రశ్న.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్

కథ

సిద్దార్థ్

మైనస్ పాయింట్స్

ప్రేక్షకుడి ఊహకు సాగేట్టు కథనం

ఫస్టాఫ్

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు: సిద్ధార్థ్, క్యాథరీన్ త్రెసా, కబీర్ దుహాన్ సింగ్, సతీష్, ఆదుకాలమ్ నరేన్, స్టంట్ సిల్వ తదితరులు

కథ, దర్శకత్వం: సాయి శేఖర్

నిర్మాత: ఆర్ సౌందర్య, దీప అయ్యర్

మ్యూజిక్: ఎస్ థమన్

సినిమాటోగ్రఫి: ఎన్‌కే ఏకాంబరం

ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్

బ్యానర్: ట్రైడెంట్ ఆర్ట్స్

రిలీజ్ డేట్: 2019-10-11

English summary
Aruvam is an uTamil, Telugu language comedy horror film written and directed by Sai Sekhar. The film stars Siddharth, Catherine Tresa with Sathish and Kaali Venkat in supportive roles. This movie released on October 11, 2019.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more