For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విభిన్నమే కానీ... ( 'కంచె ' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  తొలి చిత్రం గమ్యం నుంచీ దర్శకుడు క్రిష్..విభిన్న తరహా కధాంశాలకే ఓటు వేస్తూ వచ్చాడు. అలాగే ఈ సారి కూడా సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యం తీసుకుని అక్కడ విద్వేషాల కంచెను చూపుతూ...దానికి ప్యారలల్ గా మన ఊళ్లను ముడిపెడుతూ ఇక్కడ ఊళ్ల మధ్య కులాల కంచె ఉందని ..ఈ రెండిటినీ విడిచిపెడితేనే మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడని చెప్పాలనే ఆలోచనతో చేసాడు. అయితే నేరేషన్ లోనే తడబడ్డాడని చెప్పాలి. అవార్డ్ సినిమాలా స్లోగా నడుస్తూ చాలా చోట్ల సహనానికి పరీక్షపెడుతుంది. కంటెంట్, మేకింగ్ బాగున్నా...వేగం మందగించటంతో కొన్ని సార్లు విసుగిస్తుంది. మరీ ఆరు పాటలు, ఐదు ఫైట్స్, బ్రహ్మానందం కామెడీ అనే రొటీన్ తెలుగు సినిమాకు ఇది మాత్రం ఆసక్తి కలిగించే కొత్త పరిణామం. ఇందుకు దర్శక,నిర్మాతలను అభినందించాలి. ముఖ్యంగా అప్పటి భారతదేశాన్ని చూడాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.

  రెండు విభిన్న కథలను ఒకే బ్యాక్ డ్రాప్ లో చెప్పాలని ప్రయత్నించిన చిత్రం ఇది. ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ) రెండో ప్రపంచ యుద్దం(1944)లో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడే ఓ సైనికుడు. అతని కమాండర్ ఈశ్వర్ (నిక్తిన్ ధీర్). ఓ సమయంలో జర్మన్ ఆర్మీ దాడి జరిపి..ఈశ్వర్ ని అతనితో పాటు ఉన్న వారిని ఎత్తుకుపోతారు. అయితే హరిబాబుకు , కమాండర్ ఈశ్వర్ కు ఇంతకు ముందే(1936) పరిచయం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...రాచకొండ సంస్దానాధినేత ఈశ్వర్ కు ఓ చెల్లెలు సీతాదేవి(ప్రగ్యాజైస్వాల్). సీతాదేవి, హరిబాబు ప్రేమించుకుంటారు. అయితే హరిబాబుది నిమ్న కులం కావటంతో ఊళ్లో గొడవలు భగ్గుమంటాయి. వారి ప్రేమ ప్రక్కన పెడితే ఇప్పుడు హరిబాబు... తన కమాండర్ ని,మిగతా వారిని రక్షించాడా..లేక గతం గుర్తు పెట్టుకుని వదిలాసాడా....సీతాదేవితో హరిబాబు ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా సినిమా.

  ఈ సినిమాలో ఉన్న వార్ ఎపిసోడ్,లవ్ ఎపిసోడ్ రెండూ బాగున్నాయి. అయితే వీటిని కలిపిన విధానమే చూసేవారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా కథలో ఎమోషనల్ డెప్త్ పెంచి, స్క్రీన్ ప్లే మరింత జాగ్రత్తలు తీసుకుని సినిమా స్పీడు పెంచితే ఇంకా బాగుండేది. అలాగే క్లైమాక్స్ ని కూడా మొదట్లో ఉన్న ఇంటెన్స్ తో కాకుండా తేలిపోయేలా ఉంది. ఇంటర్వెల్ కు ముందు కొద్ది సేపు బాగా స్లో అవుతుంది. అయితే ఇంటర్వెల్ మాత్రం బాగుంది. అలాగే సెకండాఫ్ లోనూ అదే పరిస్ధితి. పీరియడ్ చిత్రం కథ..అలా స్లో నేరేషన్ అనుకున్నాడేమో దర్శకుడు దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

  పరిణితి

  పరిణితి

  మొదటి సినిమా ముకుంద కు ఈ సినిమాకు వరుణ్ తేజ లో చాలా మార్పు వచ్చింది. అతని నటనలో పరిణితి వచ్చింది.

  రాకుమార్తెగా

  రాకుమార్తెగా

  ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రగ్యాజైస్వాల్ తన పాత్రలో ఒధిగిపోయిందనే చెప్పాలి. కొన్ని షాట్స్ లో రియల్ ప్రిన్సెస్ అనిపించింది. భాష రాకపోయినా భావం అర్దం చేసుకుని ఇచ్చిన ఎక్సప్రెషన్స్ బాగున్నాయి.

  తంగబలి

  తంగబలి

  చెన్నై ఎక్సప్రెస్ లో తంగబలిగా చేసిన నిక్తిన్ ఈ చిత్రంలో కమాండర్ గా, హీరోయిన్ అన్నగా ఒదిగిపోయాడు.

  హైలెట్

  హైలెట్

  ఈ సినిమాలో హైలెట్ ఏమిటీ అంటే సినిమాటోగ్రఫి అనే చెప్పాలి. మన కళ్ళ ఎదురుగా రెండవ ప్రపంచ యుద్దాన్ని చూపటంలో కృతకృత్యుడయ్యాడు.

  దర్శకుడుగా క్రిష్

  దర్శకుడుగా క్రిష్

  ఈ సినిమాలో దర్శకుడుగా క్రిష్...సబ్జెక్టు పరంగా వెరైటీ అంశం అయితే టచ్ చేసారు కానీ మేకింగ్ మరీ నీరసంగా చేసారు. సినిమాలో పీక్స్ కు తీసుకెళ్లే ఎలిమెంట్స్ ఉన్నా పట్టించుకోకుండా స్లో నేరేషన్ తో ముందుకు వెళ్లారు.

  క్లారిటీ

  క్లారిటీ

  లవ్ స్టోరీని క్లారిటీతో నేరేట్ చేసిన క్రిష్...ఎందుకనో యుద్ద సన్నివేశాల్లో క్లారిటీ మిస్ అయ్యారనిపిస్తుంది.

  సంగీత దర్శకత్వం

  సంగీత దర్శకత్వం

  పాటలు అంతగా కిక్ ఇవ్వలేకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు.

   మరింత బాగా చెయ్యాల్సింది

  మరింత బాగా చెయ్యాల్సింది


  ఎడిటింగ్ మరింత బాగా చెయ్యాల్సి ఉంది. బోర్ వచ్చే సన్నివేశాలను కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది.

  ఎవరెవరు..

  ఎవరెవరు..

  బ్యానర్: ఫస్ట్ ప్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
  నటీనటులు :వరుణ్‌తేజ్, ప్రగ్యాజైస్వాల్, నికితన్ ధీర్, అవసరాల శ్రీనివాస్, గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అనూప్ పూరి, మెరీనా టారా తదితరులు
  ఎడిటర్స్:సూరజ్ జెగ్‌తాప్, రామకృష్ణ అర్రం,
  మాటలు:సాయిమాధవ్, పాటలు:సీతారామశాస్ర్తీ,
  కెమెరా:జ్ఞానశేఖర్,
  సంగీతం: చిరంతన్ భట్
  కళ: సాహి సురేష్‌
  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్
  నిర్మాతలు :వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు
  విడుదల తేదీ: 22, అక్టోబర్ 2015.

  ఫైనల్ గా రొటీన్, రెగ్యులర్ చిత్రాలు కోరుకునే వారు ఈ సినిమాకు సాధ్యమైనంత దూరం ఉండటం మేలు. కొత్తగా ప్రయత్నించిన తెలుగు దర్శకుడు సినిమా అని వెళితే ఓకే అనిపిస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ నాటి హిస్టరీని తెరపై కొంతలో కొంత చూడాలనుకుంటే బాగుందనిపిస్తుంది. అయితే మల్టిప్లెక్స్ లు, ఎ లకు ఎక్కినట్లుగా బి,సి సెంటర్లలకు ఏ మేరకు ఈ సినిమా వెళ్తుందో చూడాలి.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Varun Tej, Krish's Kanche movie released today with divide talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X