twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడెవడు మూవీ రివ్యూ: ఆకట్టుకొనే సస్పెన్స్ థ్రిల్లర్

    మౌనమేలనోయి, నిను చూడక నేను ఉండలేను, ఒరే పండు, నీ జతగా నేనుండాలి లాంటి చిత్రాలతో టాలీవుడ్ కు సుపరిచితులైన సచిన్ జోషి తాజా చిత్రం వీడెవడు. ఈ చిత్రానికి దర్శకుడు సత్య తాతినేని. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల

    By Rajababu
    |

    Rating:
    2.5/5
    Star Cast: సచిన్ జోషి, ఇషా గుప్తా, ప్రభు, ప్రతాప్ పోతన్, శ్రీనివాస్ రెడ్డి
    Director: సత్య తాతినేని

    Recommended Video

    Sachin Joshi's "Veedevadu" Movie Review వీడెవడు మూవీ రివ్యూ..

    మౌనమేలనోయి, నిను చూడక నేను ఉండలేను, ఒరే పండు, నీ జతగా నేనుండాలి లాంటి చిత్రాలతో టాలీవుడ్ కు సుపరిచితులైన సచిన్ జోషి తాజా చిత్రం వీడెవడు. ఈ చిత్రానికి దర్శకుడు సత్య తాతినేని. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నదా? సచిన్ జోషికి మళ్లీ సక్సెస్ లభించిందా? ఇషా గుప్తా అందాలు ప్రేక్షకులను అలరించాయా? అన్న ప్రశ్నలకు సమాధానమే వీడెవడు. థ్రిల్లర్ తోపాటు ప్రేమకథా చిత్రంగా రూపొందిన వీడెవడు చిత్రం గురించి తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ ఏంటంటే..

    కథ ఏంటంటే..

    సత్య కబాడ్డీ ఆటగాడు. శృతి ( ఇషా గుప్తా) అనే సంపన్నురాలైన యువతి ప్రేమలో పడతాడు. శృతి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. కానీ శోభనం రోజే శృతిని దారణంగా చంపివేశాడన్న ఆరోపణలపై సత్యను జైల్లో పెడతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తొలి రోజే ఎందుకు చంపాడు అనే కోణంలో దర్యాప్తు జరుగుుతంది. ఇంతకీ శృతిని సత్య చంపాడా? శృతి దారుణానికి ఎందుకు గురైంది. శృతిని చంపిన కేసులో సత్య ఎలా బయటపడ్డాడు ? అనే ప్రశ్నలకు సమాధానమే వీడెవడు.

    ఫస్టాఫ్ ఇలా..

    ఫస్టాఫ్ ఇలా..

    సత్య ఫస్ట్ నైట్ రోజు శృతి హత్య ఘటనతో సినిమా ప్రారంభమవుతుంది. కోర్టు విచారణలో మౌనంగా ఉండటంతో సత్యను రిమాండ్ పై గోవా జైలుకు తరలిస్తారు. జైలులో కబడ్డీ నేపథ్యంలో కథను నడిపిస్తూ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిత్తించడంలో దర్శకుడు సత్య తాతినేని తన మార్కును చాటుకున్నారు. కేసు దర్యాప్తు చేసే అధికారిగా కిషోర్, అతని సహాయకుడిగా హర్షవర్థన్ పాత్రలు ఆకట్టుకునేలా ఉండటంతో పాటు శ్రీనివాస్ రెడ్డి కామెడితో తొలి భాగం సరదాగా గడిచిపోతుంది.

    సెకంఢాప్ లో...

    సెకంఢాప్ లో...

    జైలులో సత్యను చంపడానికి కొన్ని శక్తులు ప్రయత్నించడం వాటిని సత్య సమర్థవంతంగా ఎదుర్కోనే సన్నివేశాలు బాగున్నాయి. చివర్లో సత్య చనిపోయే సీన్, ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు చిత్రాన్ని అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించారు. చివరి అర్థగంట వీడెవడు సినిమాకు ఊపిరి అని చెప్పవచ్చు.

    విశ్లేషణ

    విశ్లేషణ

    వీడెవడు ప్రేమకథ చిత్రంతోపాటు ఓ చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్. ఈ కోణంలో సాగే కథను కబడ్డీ నేపథ్యాన్ని అల్లుకొని రాసిన కథ బాగుందని చెప్పవచ్చు. అనేక మలుపులు తిరుగుతూ సాగే ఈ చిత్రం క్రమక్రమంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాకు బలం, బలహీనత హీరో సచిన్ జోషి. ఎందుకంటే సచిన్ ఒప్పుకోకపోతే ఓ మంచి కథను తెరకెక్కించే అవకాశం లభించేంది కాదు. అలా అని తానే హీరోగా మారడం కొంత మైనస్ అని చెప్పవచ్చు.

    సచిన్ పెర్ఫార్మెన్స్ ...

    సచిన్ పెర్ఫార్మెన్స్ ...

    ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్యను చంపిన హంతకుడి పాత్రలో సచిన కనిపించాడు. కీలక సన్నివేశాల్లో సచిన్ మంచి నటనతో ఆకట్టుకొన్నాడు. పాత్ర పరిథి మేరకు సత్య పాత్రకు సచిన్ పూర్తిగా న్యాయం చేశారు.

     ఇషా గుప్తా అందాల ఆరబోత

    ఇషా గుప్తా అందాల ఆరబోత

    అందాల ఆరబొస్తు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఇషాగుప్తా ఈ చిత్రంలో శృతి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో అవసరమైన చోట అందాల ఆరబోసే విషయంలో ఇషా మొహమాటం పడినట్లు కనిపించదు.

    శ్రీనివాస్ రెడ్డి, వెన్నల కిషోర్ కామెడీ

    శ్రీనివాస్ రెడ్డి, వెన్నల కిషోర్ కామెడీ

    సచిన్ స్నేహితుడిగా నివాస్ రెడ్డి తనదైన మార్కు కామెడిని ప్రదర్శించారు. టైమింగ్ తో పంచ్ డైలాగ్స్ ను విసరడంలో వంద శాతం సఫలమయ్యాడు. జైలు అధికారిగా వెన్నెల కిషోర్ కనిపించాడు. సెల్పీ పిచ్చి నవ్వించేలా ఉంది. సీరియస్ గా సాగే సినిమాలో వీరిద్దరి కామెడి అదనపు ఆకర్షణ.

    ఇతర పాత్రల్లో..

    ఇతర పాత్రల్లో..

    ఇతర పాత్రలో కిషోర్, శృతి తండ్రిగా ప్రభు, సైక్రియాటిస్ట్ గా ప్రముఖ సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ కనిపించారు. గతంలో విశేషమైన నటనతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రతాప్ పోతన్ మళ్లీ చాలా రోజుల తర్వాత తెరపై కనిపించాడు. మిగతా పాత్రల్లో సుప్రిత్, ధన్యా బాలకృష్ణన్ తదితరులు నటించారు.

    వినేంద్ర మీనన్ ఫోటోగ్రఫీ..

    వినేంద్ర మీనన్ ఫోటోగ్రఫీ..

    వీడెవడు సాంకేతిక విభాగాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే సినిమాటోగ్రఫీని ముందుగా చెప్పుకోవాలి. వినేంద్ర మీనన్ అందించిన పోటోగ్రఫీ చాలా బాగుంది. గోవా అందాలను, కబాడ్డీ ఆటకు సంబంధించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. రెయిన్ ఎఫెక్ట్స్, లైటింగ్ ను వాడుకున్న తీరు ప్రశంసనీయం.

    ఎడిటింగ్ భేష్

    ఎడిటింగ్ భేష్

    సీరియస్ గా సాగే సినిమాలో ఎడిటింగ్ అత్యంత కీలకం. పనికి రాని ఒక్క ఫ్రేమ్ మధ్యలో కనిపించినా ఒక్కోసారి సినిమాపై పట్టు చేజారిపోతుంది. ఈ విషయంలో ఎడిటర్ ప్రవీణ్ పూడి ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడెవడుకు ఎడింగ్ ప్లస్ పాయింట్.

    తమన్ అదుర్స్...

    తమన్ అదుర్స్...

    ఇటీవల కాలంలో తమన్ సంగీతం పరమ బోర్ అనే మాట వినిపిస్తుంది. కానీ వీడెవడు సినిమా చూస్తే కొత్త తమన్ కనిపిస్తాడు. రీ రికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసింది. రెండు పాటలు తెర మీద ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పోలెండ్ లో చిత్రీకరించి పాట బాగున్నది.

    చివరగా...

    చివరగా...

    వీడెవడులో సచిన్ హీరో అంటే పెదవి విరిచే మాట నిజం. కానీ ఈ చిత్రంలో కొత్త సచిన్ ను చూస్తాం. సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి వీడెవడు తప్పక నచ్చుతుంది. సినిమాలో సచిన్ కాకుండా స్క్రిప్ట్ మాత్రమే తెర మీద కనిపిస్తుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స
    కథ, కథనం
    ఎడిటింగ్
    మ్యూజిక్
    ఫొటోగ్రఫీ
    డైరెక్షన్,
    నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: సచిన్ జోషి, ఇషా గుప్తా, ప్రభు, ప్రతాప్ పోతన్, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, వెన్నెల కిషోర్, ధన్య బాలకృష్ణన్
    నిర్మాత: రైనా జోషి
    దర్శకత్వం: సత్య తాతినేని
    మ్యూజిక్: ఎస్ ఎస్ థమన్
    ఎడిటింగ్ ప్రవీణ్ పూడి
    సినిమాటోగ్రఫీ వినేంద్ర మీనన్
    రిలీజ్: సెప్టెంబర్ 15, 2017

    English summary
    Sachin Joshi's latest movie is Veedevadu. This film is a supense thirller. Director is Satya Tatineni. Heroine is Isha Gupta. This film is released on September 15th 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X