For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామిడీ గార్డ్‌ (బాడీగార్డ్ రివ్యూ)

  By Srikanya
  |

  -జోష్యుల సూర్య ప్రకాష్
  సంస్థ: శ్రీసాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌
  నటీనటులు: వెంకటేష్‌, త్రిష, సలోని, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, అలీ, సుబ్బరాజు, ధర్మవరపు, వేణుమాధవ్‌, ప్రగతి తదితరులు
  కథ: సిద్దిక్
  సంగీతం :ఎస్.తమన్
  నిర్మాత: బెల్లంకొండ సురేష్‌
  దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
  విడుదల: శనివారం

  స్టోరీనే గాడ్ గా నమ్ముకుని, కామిడీని సేప్టీ గార్డ్ గా పెట్టుకుని వెంకటేష్ తాజా చిత్రం బాడీగార్డ్ థియేటర్స్ లోకి దిగింది. ఇప్పటికే మూడు భాషల్లో వచ్చిన ఈ చిత్రం తెలుగులోనూ విజయవంతమయ్యేటట్లు కనపడుతోంది. కామిడీకి తగు మోతాదులో సెంటిమెంట్ కలపటంతో ఫ్యామిలీలకు నచ్చేటట్లు తయారైంది. ముఖ్యంగా వెంకటాద్రిగా వెంకటేష్ తనదైన శైలిలో నవ్వించటం సినిమాకు యుఎస్ పి గా మారింది. బి, సి సెంటర్లు, మహిళలను టార్గెట్ చేసిన ఈ చిత్రం వారికి బాగా నచ్చుతుంది.

  వెంకటాద్రి (వెంకటేష్‌).. తను దేముడులా భావించే వరదరాజులు నాయుడు (ప్రకాష్‌రాజ్‌)కి బాడీగార్డ్ గా పనికి కుదురుతాడు. అతని ధైర్యం, తెగువ నచ్చిన వరదరాజులు.. తన కూతురు కీర్తి (త్రిష)కి తన శత్రువల వల్ల ప్రమాదం ఉందని బావించి వెంకటాద్రిని ఆమెకు బాడీగార్డ్‌గా నియమిస్తాడు. అక్కడనుంచి ఆమెకు తోడుగా కాలేజికి వెళ్తూ తన అతి జాగ్రత్తల వల్ల ఆమెను ఇబ్బందులకి గురి చేస్తూంటాడు. విసిగిన కీర్తి వెంకటాద్రి మనస్సుని డైవర్ట్ చేసి స్వేచ్చ పొందాలనుకుని, అతనితో ఫోన్ ప్రేమ డ్రామా మొదలెడుతుంది. ఈ విషయం తెలియని వెంకటాద్రి.. ఫోన్ లో ఆమెతో ప్రేమలో పీకలోతు మునిగిపోతాడు. అప్పుడు కీర్తి అతనికి అస్సలు విషయం చెప్పిందా... ఇద్దరూ ఎలా కలిసారు... అన్నది తెలుసుకోవాల్సింటే తెరపై చూడాల్సిందే.

  ఈ చిత్రం వెంకటేష్ కు సంతోషం (నాగార్జున)లాంటి సినిమా అని చెప్పాలి. నిజానికి ఈ కథ తెలుగువారికి కొత్తేమీ కాదు.. అయితే ఈ కథకు కూర్చిన కథనమే సినిమా చివరి వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా కూర్చోబెట్టగలిగింది. ముఖ్యంగా క్లైమాక్స్... కుచ్ కుచ్ హోతా హై ని గుర్తు చేస్తుంది. అన్నిటికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రానికి వెంకటేష్ ని ఎన్నుకోవటం.. మరో హీరో అయితే నప్పడు అనిపించేలా సినిమాను తను ఒక్కడే అయ్యి లాక్కెళ్లిపోయాడు. సెకండాఫ్ లో కాస్త స్లో అయ్యినా, త్రిష పై పెట్టిన ఎమోషన్ సీన్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్టు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక డాన్ శీను చిత్రాన్ని కామెడితో ఒప్పించిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రంతో కామిడీ, సెంటిమెంట్ రెండూ కలిపి మెప్పించగలనని నిరూపించుకున్నాడు. కోన వెంకట్ మాటలు పెద్దగా పేలకున్నా కథనానికి ఇబ్బంది కలగకుండా నడిచిపోయాయి. టెక్నికల్ గా కెమెరా యావరేజ్ గా ఉంది. పాటల్లో టైటిల్ సాంగ్ బాగుంది. ఎడిటింగ్, ఆర్.ఆర్ సోసోగా ఉన్నాయి. మిగిలిన నటీనటుల్లో వేణు మాధవ్, అలీ కథకు పెద్దగా ఉపయోగపడకపోయినా నవ్వులు పండించటంలో తమ వంతు సాయం చేసారు. ఇక ప్రకాష్ రాజ్, తణికెళ్ల, ధర్మవరపు ఎప్పటిలాగే చేసేసారు. సెకండాఫ్ లో పాటలు ప్లేస్ మెంట్స్ మారిస్తే బావుండును అనిపిస్తుంది. అయితే ఇప్పటికే హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని చాలామంది చూసేయటమే ఈ సినిమాకున్న ఏకైక మైనస్.

  ఫైనల్ గా అసభ్యత, హింస లేకుండా ఉండటం, కామిడీ, సెంటిమెంట్ పండటంతో ఈ చిత్రం ఫ్యామిలీలు నిరభ్యంతరంగా చూసే అవకాశం కలిగిస్తుంది. యూత్ కాస్త దూరమైనా, కుటుంబాలు కదిలివస్తే సినిమా మంచి విజయమే సాధిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది.

  English summary
  Venkatesh's latest Body Gaurd film released today with positive talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X